For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు తెలుసుకోవాల్సిన మేటి 10 బరువు తగ్గటం గురించి అపోహలు

|

స్థూలకాయం చాలా మంది మనుషులకి హెచ్చరికగా మారింది.మొండిగా కరగకుండా ఉండి, మీ ఆకారాన్నే మార్చే పొట్టలోని కొవ్వు అంటే చిరాకు వస్తుంది.

ఇంటర్నెట్లో బరువు తగ్గడం చాలా ఎక్కువ చర్చించే అంశం అవ్వడం వల్ల, ఎలా బరువు తగ్గాలా అని చాలా మంది రాసిన ఆర్టికల్స్ మీకు కనిపిస్తాయి.వీటిల్లో కొన్ని నిజాలే,కాని చాలా వరకు మనల్ని బలవంతంగా నమ్మించాలని చూసే అపోహలు కూడా ఉంటాయి.

కనుక, మేము అలా ఒక 10 అపోహల గురించి ఇక్కడ వివరించాం.అందరూ చాలా ఆరోగ్యకరమైన మరియు అందమైన జీవితం జీవించాలనుకుంటారు.కామీ స్థూలకాయం వలన హానికరమైన ఆరోగ్య సమస్యలైన రక్త పోటు,మధుమేహం,కీళ్ళనొప్పులు మరియు ఇంకెన్నిటినో ప్రేరేపించబడతాయి.


అందుకని, తమని తాము ఆరోగ్యకరంగా ఉంచుకోవాలని,ప్రజలు తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మి మోసపోతారు.కామీ, మీకు నిజంగా బరువు తగ్గాలనుంటే , ఒక సరైన ఆహార నిపుణుడు మరియు వ్యాయమ ట్రయినర్ ను సంప్రదించండి.

వాళ్ళు మీకు సరైన దారి చూపించి,మీ బరువు తగ్గడంలో సహాయపడతారు.మనం ఇప్పుడు, ఇక్కడ సోషల్ నెట్ వర్క్ లో కన్పించే సాధారణమైన అపోహల గురించి చూద్దాం.

ఇక దురభిప్రాయాలు తొలగించుకుని, నిజాలు తెలుసుకోవాల్సిన సమయం ఇది.

1. కార్బొహైడ్రేట్లు మీలో కొవ్వు పెరిగేలా చేస్తాయి.

1. కార్బొహైడ్రేట్లు మీలో కొవ్వు పెరిగేలా చేస్తాయి.

మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారని తెలిసి, పిండి పదార్థాలకి(కార్బోహైడ్రేట్లు) దూరంగా ఉండమని చాలా మంది చెప్పే ఉంటారు.నిజానికి, కార్బోహైడ్రేట్లలో సాధారణమైనవి మరియు సంక్లిష్టమైనవి అనే రెండు రకాలు ఉంటాయి.సాధరణమైన కార్బోహైడ్రేట్లలో చక్కెరలు మరియు సాచ్యురేటెడ్ కొవ్వు ఉంటాయి,సంక్లిష్టమైన దాంట్లో దీనికి పూర్తి వ్యతిరేకమైనవి ఉంటాయి.కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న పళ్ళు, కాయగూరలు నిజానికి మీ బరువుని సరిగ్గా ఉంచి,బరువు తగ్గడంలో సహాయపడతాయి.

2. ఎంత ఎక్కువ సేపు వ్యాయమం చేస్తే, అంత తొందరగా బరువు తగ్గుతుంది

2. ఎంత ఎక్కువ సేపు వ్యాయమం చేస్తే, అంత తొందరగా బరువు తగ్గుతుంది

అవును, ఎంత కఠినమైన మరియు తీవ్రమైన వ్యాయామ సెషన్ చేస్తే, అంత శరీర బరువు తగ్గుతారనే మాట నిజమే.కామీ అపోహ ఏంటంటే అలా తగ్గాలంటే, తప్పనిసరిగా గంటలు, గంటలు వ్యాయామం చేయాలనేది.బరువు తగ్గడానికి ప్రయత్నించేప్పుడు, ఎక్కువ సమయం కాదు మీ శక్తి మొత్తం పెట్టి చేయాలి.గంటలు గంటలు కూర్చోని అక్కడ వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు.మీరు చేయాల్సిందల్లా, మీకు సరిపోయే వ్యాయామాలు తీసుకోని, అవి తీవ్రంగా మరియు మీ శక్తి మొత్తాన్నిఖర్చుపెట్టే విధంగా ఉండాలి.

3. సరైన ఆహార క్రమము మరియు రోజూ వ్యాయమం చేస్తే బరువు తగ్గుతుంది.

3. సరైన ఆహార క్రమము మరియు రోజూ వ్యాయమం చేస్తే బరువు తగ్గుతుంది.

బరువు పెరగడం మరియు బరువు తగ్గడం ఒకే నాణానికి రెండు వైపులులాంటివి.మీ జీవన శైలి,తిండి అలవాట్లు, ఏ వైపు గెలుస్తాయో నిర్ణయిస్తాయి.డైటింగ్ అంటే తక్కువ తినడం కాదు.మీ ఆహరం అన్ని పోషకాలతో సరైన మొతాదులో ఉండాలి అని అర్థం.ఏ ముఖ్యమైన పోషకం లేకపోయినా అది మిమ్మల్ని బలహీన పరుస్తుంది.అందుకే,ఆరోగ్యకరమైన ఆహరం తిని, రోజూ వ్యాయమం చేయాలి.

4. ఆహారం మానేస్తే బరువు తగ్గుతారు

4. ఆహారం మానేస్తే బరువు తగ్గుతారు

భోజనం మానేయడం అనేది మనం చాలా మంది మహిళల్లో ప్రధానంగా చూసే సమస్య.చాలా మందికి భోజనం మానేస్తే కొవ్వు తగ్గుతుంది అనే దురభిప్రాయం ఉంటుంది.కానీ దానికి సరిగ్గా వ్యతిరేకమే జరుగుతంది.ఎందుకంటే, మీ శరీరంలో జీవక్రియ సగటు తగ్గిపోయి,దాని ఫలితంగా కొవ్వు తగ్గాల్సింది పోయి, కొవ్వు పేరుకుంటుంది.

5. శాఖాహారిగా మారి బరువు తగ్గించుకోవడం

5. శాఖాహారిగా మారి బరువు తగ్గించుకోవడం

మంసాహారం వలన మీరు లావవ్వరు.చాలా మంది, శాఖాహారిగా మారితే బరువు తొందరగా తగ్గిపోతాం అనుకుంటారు.కాని మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు తినే ప్రతీ ఆహారానికి కేలరీలు ఉంటాయి.

6. మాంసం వలన లావు అవటం

6. మాంసం వలన లావు అవటం

ఇదంతా ఒక ఆహార పదార్థాన్ని, మీరు ఎలా వాడుకుంటారన్న దాన్ని బట్టి ఉంటుంది.మాంసాహారంలో మంచి ప్రోటీన్లు ఉంటాయి.సరైన మోతాదులో తీసుకుంటే ,అది మీ బరువు తగ్గడంలో సహాయపడుతుంది.అది ఇంకా మీ కండరాలను పెంచి,కొవ్వు కరగడంలో కూడా సహాయం చేస్తుంది.కానీ మళ్ళా ఎక్కువ తింటే లావయ్యేలా చేస్తుంది.

7. వ్యాయామం పేలవమైన మెటబాలిజంకి ఏ సహాయం చేయలేదు

7. వ్యాయామం పేలవమైన మెటబాలిజంకి ఏ సహాయం చేయలేదు

పేలవమైన మెటాబాలిజంతో బాధపడుతున్న వారికి, వ్యాయమం ద్వారా బరువు తగ్గించలేమని ఒక దురభిప్రాయం ఉంది.నిజానికి, దానికి ఖచ్చితంగా వ్యతిరేకం నిజం.ఒక మనిషి రోజూ వ్యాయమం చేయడం ద్వారా తన జీవక్రియ సగటుని మెరుగుపరుచుకోవచ్చు.ఇది శరీరంలో ఉన్న అక్కర్లేని కొవ్వు తీసేయడంలో కూడా సహాయపడుతుంది.

8. నీళ్ళు తాగితే బరువు తొందరగా తగ్గుతుంది

8. నీళ్ళు తాగితే బరువు తొందరగా తగ్గుతుంది

మన శరీరం సరిగ్గా పనిచేయడానికి నీళ్ళు కావాలి, ఎందుకంటే మన శరీరం 60 శాతం నీళ్ళే కాబట్టి.కానీ, నీళ్ళ వలన బరువు తగ్గుతారనేది అపోహ మాత్రమే.కాకపోతే నీళ్ళు ఎప్పుడు మిమ్మల్ని హైడ్రేట్ చేసి ఉంచుతాయి మరియు బర్గర్ అలాంటి చిరు తిండ్లు తినాలనిపించినప్పుడు కడుపు నిండుగా ఉంచుతాయి అంతే తప్ప వాటంతట అవే కేలరీలు కరిగించవు.

9. బరువులు ఎత్తడమనేది శరీర ఆకృతిని నిర్మించుకునే వాళ్ళకి మాత్రమే

9. బరువులు ఎత్తడమనేది శరీర ఆకృతిని నిర్మించుకునే వాళ్ళకి మాత్రమే

మీకు పెద్ద పెద్ద ఆజానుబాహుల శరీరాలు అక్కర్లేనప్పటికీ బరువులు ఎత్తచ్చు.అది మీ కండరాలలో శక్తిని పెంచి,కొవ్వు మరియు కేలరీలను కరిగిస్తుంది.కుస్తి పట్టేవాడైనా, సాధరణ మనిషైనా అందరికి అవసరమే.

10. అర్థరాత్రి ఆకలి వలన లావవుతారు

10. అర్థరాత్రి ఆకలి వలన లావవుతారు

అర్థరాత్రి ఆకలి వలన లావౌతారు.అవును, మీరేమి తింటున్నారో మీకు తెలిసినంత వరకు ఇది నిజమే.మీరు నిద్ర మధ్యలో అర్థ రాత్రి లేచి, కేక్ కాని పేష్ట్రి కాని తింటే ఖచ్చితంగా అది మీ బరువు పెంచుతుంది.కానీ అలా కాకుండా, వెన్నతీసిన పాలు తాగితే , దాని వలన ఆకలి తగ్గుతుంది మరియు బరువు పెరగకుండా నివారిస్తుంది.

English summary

Top 10 Weight Loss Myths You Should Know About

Weight loss has become such a hype, you can find several articles which may be useful, while others are just myths that we are forced to believe. Know about the 10 weight loss myths here.
Story first published: Tuesday, February 13, 2018, 17:30 [IST]