For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డైటింగ్ చేయకుండా బరువు తగ్గే మార్గాలు

డైటింగ్ చేయకుండా బరువు తగ్గే మార్గాలు

|

కొన్నిసార్లు డైటింగ్ కాకుండా బరువు తగ్గే పద్ధతులు ఇంకేమన్నా ఉన్నాయా అని మీరు కూడా ఆలోచిస్తారు,కదా? డైటింగ్ అంటే మీకిష్టమైన పదార్థాలన్నిటినీ దూరం పెట్టి, కాయగూరలు,సలాడ్లు,సూప్ లపై ధ్యాస పెట్టాలి. దీనివల్ల మీకిష్టమైన పదార్థాలని తినలేక ఆకలితో మాడి బరువు తగ్గాల్సి వస్తుంది.

బరువు తగ్గడం కేలరీలను లెక్కపెట్టుకోవటం మాత్రం కాదు, నిజానికి మీ శరీరంలో హార్మోన్లకి సరైన వాతావరణం కల్పించడం, అలా అవి మీరు బరువు తగ్గడానికి సాయపడతాయి.

ways to lose weight without dieting

మానసిక వత్తిడి, డిప్రెషన్, ఇతర ఎమోషనల్ సమస్యలు కూడా ఈ హార్మోన్ల సరైన వాతావరణాన్ని దెబ్బతీస్తాయి. అందుకని మనస్సు, శరీరం ఈ రెండిటిపరంగా ఈ సమస్యలని విశ్లేషించి పరిష్కరించాలి.

మీరు తినేటప్పుడు,ఎంత ఎందుకు అనే విషయాలని, మీ సైకలాజికల్, ఎమోషనల్ జీవితాలపై వాటి ప్రభావాన్ని ఆలోచించి ముందడుగు వేయటం ముఖ్యం

డైటింగ్ చేయకుండా బరువు తగ్గగలిగే కొన్ని మార్గాలు ఇవిగో...

ద్రవ రూపంలో కొవ్వును తీసుకోవడం మానేయండి

ద్రవ రూపంలో కొవ్వును తీసుకోవడం మానేయండి

మార్కెట్లో దొరికే ఫిజ్జీ డ్రింక్స్ కేలరీలతో నిండివుండి ఉన్న మీ బరువును మరింత పెంచుతాయి. కానీ బరువు తగ్గాలనుకుంటే ఈ కూల్ డ్రింక్స్, ఐస్డ్ టీ వంటి వాటికి దూరంగా ఉండండి. వాటిబదులు నిమ్మకాయ నీళ్ళు,డిటాక్స్ టీలు, నిమ్మ ఉన్న డ్రింక్స్ తీసుకోండి. గ్రీన్ టీ ఎక్కువ తాగండి, అది వేగంగా బరువును తగ్గిస్తుంది.

బ్రేక్ ఫాస్ట్ అస్సలు మానవద్దు

బ్రేక్ ఫాస్ట్ అస్సలు మానవద్దు

రోజూ పొద్దున బ్రేక్ ఫాస్ట్ చేయని అలవాటు ఉంటే అది మెటబాలిజం వేగాన్ని తగ్గిస్తుంది, దీనివల్ల జీర్ణశక్తి కూడా నెమ్మదిస్తుంది. మెల్లగా జీర్ణమవటం వలన జీర్ణమవ్వని పదార్థాలు కొవ్వులుగా మారిపోతాయి. అందుకని బ్రేక్ ఫాస్ట్ ఎప్పుడూ 9 గంటలలోపు తినేయటం మంచిది, అలా బరువు సులభంగా తగ్గవచ్చు.

ఎక్కువ నీళ్ళు తాగండి

ఎక్కువ నీళ్ళు తాగండి

నీరు తాగటం శరీరానికి తప్పనిసరి, అది శరీరాన్ని హైడ్రేటడ్ గా ఉంచుతుంది. మీరు ప్రతిరోజూ తప్పనిసరిగా 6-8గ్లాసుల నీరును తాగటం తప్పనిసరి, అలా శరీరంలోని విషపదార్థాలు బయటకిపోగలుగుతాయి. ఈ విషపదార్థాలను బయటకి పంపించడం వలన బరువు తగ్గవచ్చు.మంచినీళ్ళు మెటబాలిజాన్ని క్రమబద్ధీకరించటంలో కూడా సాయపడతాయి, మీ ఆకలి విషయంలో కూడా మార్పులు తొందరలోనే గమనిస్తారు.

ఎక్కువ పండ్లు తినండి

ఎక్కువ పండ్లు తినండి

ఎంత వీలైతే అంత పూర్తి పండ్లను తింటూ ఉండండి. పండ్లలో చాలామటుకు నీరు ఉంటుంది, ఇది బరువు తగ్గటానికే కాదు, శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. మీరు దబ్బపళ్ళు, టార్ట్ చెర్రీపండ్లు,నేరేడుపళ్ళు, పుచ్చకాయ, పీచెస్, ప్లమ్స్, ఆపిల్, జామ, టమాటా మొదలైనవాటిని తినవచ్చు. ఇవి రోజూ తినటం వలన మంచి సానుకూల ఫలితాలు కన్పిస్తాయి.

ఆకుపచ్చని ఆకుకూరల సలాడ్లు

ఆకుపచ్చని ఆకుకూరల సలాడ్లు

మీరు భోజనం మొదలుపెట్టేముందు, మీ ప్లేటును సలాడ్లతో నింపండి, ఎందుకంటే తాజా సలాడ్లు ఆరోగ్యకరమైన, తక్కువ ఆకలిని ఉంచుతాయి. పైన క్రీమ్ ఉండే డ్రస్సింగ్ లు, ఛీజ్ లేదా ఇంకా ఏదన్నా కొవ్వుపదార్థాలని సలాడ్ కి దూరంగా ఉంచండి. మీరు తురిమిన క్యాబేజి,ఉల్లిపాయలు,కాప్సికంలు,వామాకు ఇంకా ఇతర తాజా కాయగూరలను సలాడ్ కి జతచేసుకోవచ్చు.

సంపూర్ణ ధాన్యాలు

సంపూర్ణ ధాన్యాలు

సంపూర్ణ ధాన్యాలను తీసుకోవడం ఒంటికి మంచిది, అలాగే ఎక్కువసేపు ఆకలి వేయకుండా కడుపు నిండివుంటుంది.బరువు తగ్గటానికి మంచివైన ధాన్యాలలో బ్రౌన్ రైస్, బార్లీ, బక్ వీట్, ఓట్లు, కినోవా,వైల్డ్ రైస్, మొక్కజొన్న, ఆవాలు మొదలైనవాటిని ఆహారంలో జతచేసుకోవచ్చు. వీటిల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజలవణాలైన జింక్,కాపర్, మెగ్నీషియం,ఐరన్ ఉంటాయి.

ప్రొటీన్ ఎక్కువగా తీసుకోండి

ప్రొటీన్ ఎక్కువగా తీసుకోండి

ప్రొటీన్ కి మన ఆకలిపై చాలా నియంత్రణ ఉంటుంది, అది కడుపు నిండుగా ఉన్న భావాన్ని పెంచగలదు, ఆకలిని తగ్గించి మీరు కొన్ని కేలరీలే తినేలా చేయగలదు. ఎందుకంటే,ఆకలిని,కడుపు నిండినట్లు ఉండే ఫీలింగ్ పై పనిచేసే అనేక హార్మోన్లపై ప్రొటీన్ ప్రభావం చూపించగలుగుతుంది. మీ ఆహారంలో, బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం,రాత్రి భోజనాలలో ప్రొటీన్ పదార్థాలు ఎక్కువ ఉండేలా మొదలుపెట్టండి. కానీ అతిగా ప్రొటీన్ పదార్థాలని తినవద్దు.

 నెమ్మదిగా నమలండి

నెమ్మదిగా నమలండి

పరిశోధనల్లో తేలింది ఏంటంటే మీరు ఆహార పదార్థాలని నమలటానికి ఎంత సమయం తీసుకుంటారో, అంత తక్కువ కేలరీలు మీ శరీరంలోకి చేరతాయి.ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినటం వలన మెదడుకి పొట్ట నుండి కడుపు నిండిందనే సిగ్నల్ చేరి మీరు ఎక్కువ తినకుండా చేస్తుంది. నమిలి తినడం వలన సరిగ్గా అరిగి, మీరు తినే పరిమాణం కూడా తగ్గిపోతుంది.

English summary

Ways To Lose Weight Without Dieting

Losing weight sustainably isn't about counting calories but about creating the proper hormonal environment in your body that's conducive to weight loss. The ways to lose weight without dieting are not going on a liquid diet, drinking lots of water, not avoiding breakfast, eating lots of fruits, chewing foods slowly, etc.
Story first published:Wednesday, April 11, 2018, 14:26 [IST]
Desktop Bottom Promotion