For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువును కోల్పోవడమా! కొవ్వును కోల్పోవడమా!- మీ ప్రాధాన్యత దేనికి?

బరువును కోల్పోవడమా! కొవ్వును కోల్పోవడమా!- మీ ప్రాధాన్యత దేనికి?

|

బరువు కోల్పోవడం మరియు కొవ్వును కోల్పోవడం ఒకటే అని మీరు అనుకుంతున్నట్లైతే, ఆ రెండింటి మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉందని మీరు ఇకనైనా తెలుసుకోవాలి. రెండింటి మధ్య వ్యత్యాసం గురించి అవగాహన లేనందున, చాలామంది తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోలేకపోతున్నారు.

మన శరీర బరువులో, ఎముకలు, కండరములు, అవయవాలు మరియు నీరు కూడా భాగమే! కాబట్టి బరువు తగ్గడం ప్రారంభించాక, మన శరీరం ఈ అన్ని భాగాల బరువును కోల్పోతుంది. కొవ్వు నష్టపవడమంటే, మన శరీరంలోని నిల్వ ఉన్న కొవ్వు తొలగిపోవడం అని అర్థం.

Weight Loss Vs Fat Loss: Which is Healthy, Difference Explained

శరీర బరువు మరియు బరువు కోల్పోవడం గురించి తెలుసుకోవలసిన వాస్తవాలు:

బరువు కోల్పోవడం తప్పనిసరిగా ఒక వ్యక్తికని ధృఢంగా మరియు ఆరోగ్యకరంగా మారుస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం అతను లేదా ఆమె యొక్క శరీరంలో ఉండే కొవ్వు పదార్ధం మీద ఆధారపడి ఉంటుంది. మన శరీరం బరువు ప్రధానంగా, అందులో నిల్వ ఉన్న నీటి బరువు మీద ఆధారపడి ఉంటుంది. కార్బోహైడ్రేట్లకి మన శరీరంలోని నీటిని పట్టి ఉంచే సామర్ధ్యం కలిగి ఉన్నందున బరువు పెరుగుటకు ఆస్కారం ఇస్తుంది. అందువల్ల తక్కువ స్థాయిలో పిండి పదార్థాలను సేవించడం, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

కొన్నిసార్లు బరువు తగ్గినప్పుడు, శరీరం కండర ద్రవ్యరాశిని కోల్పోతుంది. దీనివలన మన శరీరం యొక్క జీవక్రియ రేటు తగ్గిపోయి, తగ్గడానికి బదులుగా బరువు పెరుగుటానికి ప్రేరేపిస్తుంది. అధిక బరువుగల వ్యక్తులు బరువు తగ్గి, సరైన మరియు ఆకారం పొందడానికి తగిన వ్యాయామాలు చేయడం చాలా కీలకం. వారి శరీరానికి తగిన వ్యాయామాలు ఎంచుకుని, కొవ్వు కరిగించడం మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. వాటి ప్రభావం శరీరంపై ప్రతికూలంగా ఉండకుండా చూసుకోవాలి.

కొవ్వులు కోల్పోవడానికి సరైన విధానం ఏమిటి?

కొవ్వులు కోల్పోవడానికి సరైన విధానం ఏమిటి?

సరైన మార్గంలో బరువు కోల్పోవడమనే లక్ష్యాన్ని సాధించడానికి, వ్యాయామ ప్రణాళికలో పాలనలో దృఢత్వ వ్యాయామాలతో పాటు కార్డియో వ్యాయామాలను కూడా భాగంగా చేసుకోవాలి.

బరువు కోల్పోవడానికై కేవలం కార్డియో వ్యాయామాలు మాత్రమే చేస్తే, అది కండరాల నష్టమే కాకుండా, కొవ్వు పూర్తిగా తొలగిపోతుంది. ఇది శరీరం యొక్క శక్తి మరియు దృఢత్వ స్థాయిని తగ్గించి, శరీరంను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. దీని మూలంగా కూడా శరీరం యొక్క జీవక్రియ రేటు మరియు కండరాల ద్రవ్యరాశి తగ్గిపోతుంది.

ఇంకొక వైపు, శరీరం నుండి అవాంఛిత కొవ్వులని కోల్పోవాలనుకుంటే, కార్డియోతో పాటు బరువులు ఎత్తడంలో శిక్షణ మరియు సరైన నిద్ర అవసరం. మీ శరీరం యొక్క దృఢత్వ స్థాయి మరియు శక్తిని పెంచడంలో ఇది సహాయపడుతుంది.

సరైన మార్గంలో బరువును ఎలా తగ్గించుకోవాలి?

సరైన మార్గంలో బరువును ఎలా తగ్గించుకోవాలి?

డీహైడ్రేషన్ వల్ల బరువు కోల్పోవద్దు:

డీహైడ్రేషన్ వలన మీ బరువు తగ్గుతుంది, కానీ ఇది నిజమైన బరువు నష్టం కాదు. శరీరంలోని కొవ్వులు ఎక్కడివక్కడే నిలిచి ఉండిపోతాయి. డీహైడ్రేషన్ వలన కండరాలకు నీరు లభించక సడలిపోతాయి.

కండరాలను పెంచుకుంటూ కొవ్వులను కరిగించాలి: స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ద్వారా బరువు కోల్పోవడం అత్యుత్తమ మార్గం. ఈ పద్ధతి ద్వారా, కాండరాలు పెరుగుతూ, శరీరం బరువు తగ్గుతుంది. కేవలం కార్డియో వ్యాయామాలు చేస్తే సరిపోదు. మీరు కార్డియో చేయడం ఆపగానే, మీరు కోల్పోయిన బరువు మొత్తంని తిరిగి పొందుతారు.

కొవ్వులు కోల్పోవటం ద్వారా ఆరోగ్యాన్ని పొందండి:

కొవ్వులు కోల్పోవటం ద్వారా ఆరోగ్యాన్ని పొందండి:

వెయిట్ లిఫ్టింగ్, మీ శరీరంలోని కొవ్వులను కోల్పోవడానికి ఉత్తమ మార్గం. సురక్షితంగా ఉంటూ, మీరు నిర్ధారించుకున్న బరువు కోల్పోవడానికి, కండరాలను నిర్మించుకోడానికి మరియు గాయపడకుండా లక్ష్యాన్ని సాధించడానికి, సమర్థవంతులైన శిక్షకుల మార్గనిర్దేశం అవసరం.

కండర ద్రవ్యరాశిని పొందేందుకు సరైన ఆహారం తీసుకోవడం తప్పనిసరి:

కండర ద్రవ్యరాశిని పొందేందుకు సరైన ఆహారం తీసుకోవడం తప్పనిసరి:

కండరాల నష్టం నిరోధించడానికి, కేలరీలు మరియు పోషకాలను సరైన మొత్తంలో కలిగి ఉన్న ఆహారం తీసుకోవడం కీలకం. సూచించే స్థాయిలో అలాగే మీ శరీరం యొక్క పరిమాణం మరియు మీ క్రియాశీలకత ప్రకారం తినండి. అన్ని రకాల పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు, దుంపలు, పాడి పదార్థాలు & మాంసంలను, మీ ఆహారంలో భాగంగా చేర్చండి

English summary

Weight Loss Vs Fat Loss: Which is Healthy, Difference Explained

Many of us focus on losing weight but the right thing to do is losing body fats. Doing so will leave us with a healthy body which is well-structured. To achieve the goal of a well-structured body you should include cardio workout along with strength exercises & proper sleep. This will increase your fitness levels, strength as well as metabolism rate.
Desktop Bottom Promotion