For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు చేసే ఈ తప్పులే మీ బెల్లీ ఫ్యాట్ కు కారణమవుతాయని మీకు తెలుసా ?

మీరు చేసే ఈ తప్పులే మీ బెల్లీ ఫ్యాట్ కు కారణమవుతాయని మీకు తెలుసా ?

|

భారతదేశ జనాభాలో చాలామంది తమ పొట్ట భాగంలో పెరిగిన కొవ్వును కోల్పోవడానికి చాలా రకాల వ్యాయామాలను సాధన చేస్తూ, ఆహార నియంత్రణ పద్ధతులను పాటిస్తూ చాలా ఎక్కువగా కష్టపడుతుంటారు. కానీ మా ప్రశ్న ఏమిటంటే, ఇన్ని రకాల ప్రయత్నాలను లెక్కలోకి తీసుకోవచ్చా ? ఈ వ్యాసంలో, పెద్దలు (వయోజనులు) వారి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించుకోవడానికి ఎందుకు ఎక్కువగా కష్టపడతారో అనే విషయాన్ని గూర్చి మీకు క్లుప్తంగా తెలియజేస్తుంది.

బెల్లీ ఫ్యాట్ లో 6 రకాలు ఉన్నాయి, వీటిలో సబ్కటానియోస్ ఫ్యాట్ & విస్కాల్ ఫ్యాట్ అనేవి చాలా సాధారణమైనవి. సబ్కటానియస్ ఫ్యాట్, మీ చర్మం క్రింద కనబడుతుంది & ఇది కొవ్వు కణజాలంతో తయారవుతుంది. ఇది చర్మానికి & రక్తనాళాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది.

Why Belly Fat Is So Hard To Lose In Adults?

విస్కాల్ ఫ్యాట్ అనేది కాలేయం, ప్యాంక్రియాస్ & ప్రేగులు వంటి అనేక ఇతర శరీర అవయవాల చుట్టూగా ఉన్న పొట్ట భాగంలో నిల్వ చేయబడుతుంది. ఇలా పొట్ట చుట్టూ అధికంగా ఉండే కొవ్వు వల్ల మీకు గుండె జబ్బులు, టైప్ 2 మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు & ఇన్సులిన్ నిరోధకత ఏర్పడటం వంటి అనారోగ్య రుగ్మతలకు దారితీస్తుంది.

బెల్లీ ఫ్యాట్ను అర్ధం చేసుకున్న తరువాత, మీరు దానిని ఎందుకో కోలుకోలేకపోతున్నారో అనే విషయాన్ని గూర్చి ఈ క్రింద తెలిపిన విషయాలను చదివి తెలుసుకోండి.

1. వర్కౌట్లు తప్పుగా చేయడం :-

1. వర్కౌట్లు తప్పుగా చేయడం :-

మీరు కార్డియో వ్యాయామాలను మాత్రమే చేస్తున్నట్లయితే, మీ నడుము పరిమాణం అస్సలు తగ్గదు. మిమ్మల్ని శారీరక శ్రమకు గురి చేసే బరువులను ఎత్తడం & మీ బలాన్ని పెంపొందించే వ్యాయామాలను చేయడం వల్ల మీ శరీర కండరాల ద్రవ్యరాశి పరిమాణం పెరగడమే కాక, శరీరంలో ఉన్న అధిక కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

మీరు సరైన వ్యాయామ పద్ధతులను సాధన చేయటం వల్ల శరీరంలో ఉన్న అధిక కేలరీలు తొందరగా కరిగేలా చేస్తుంది. మీరు ఒక వారంలో 250 నిమిషాల నిడివి ఉన్న మోడరేట్ వ్యాయామ పద్ధతులను (లేదా) 125 నిమిషాల నిడివి ఉన్న తీవ్రమైన వ్యాయామ పద్ధతులను సాధన చేయాలి.

2. అధిక శ్రమను కలిగి ఉన్న వ్యాయామాలను చేయకపోవడం పోవడం :-

2. అధిక శ్రమను కలిగి ఉన్న వ్యాయామాలను చేయకపోవడం పోవడం :-

మొండిగా ఉన్న బెల్లీ ఫ్యాట్ ను తొలగించడానికి, మీరు మీ వ్యాయామాలను తీవ్రతరం చేయాలి. "మెడిసిన్ అండ్ సైన్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్" జర్నల్ పత్రికలో ప్రచురించిన ఒక అధ్యయనంలో, "అధిక-తీవ్రతను" కలిగిన వ్యాయామాలను చేసే వారిని, "తక్కువ-తీవ్రతను" కలిగిన వ్యాయామాలను చేసిన వారితో పోలిస్తే ఎక్కువ బెల్లీ ఫ్యాట్ను కోల్పోతున్నారు.

3. మద్యపానం అధికంగా చేయటం :-

3. మద్యపానం అధికంగా చేయటం :-

ఆల్కహాల్లో మీరు ఊహించిన దాని కంటే చాలా ఎక్కువ కేలరీలు ఉన్నాయి. 12 ఔన్స్ల (354 ml) రెగ్యులర్ బీర్లో 153 కేలరీలు ఉండగా, 5 ఔన్స్ల (147 మి.లీ) రెడ్ వైన్లో 125 కేలరీలు ఉంటాయి. కాబట్టి, మీరు బెల్లీ ఫ్యాట్ ను కోల్పోవాలనుకుంటే, అతి తక్కువ మోతాదులో (అంటే బాధ్యతాయుతంగా) మద్యపానం చేసేటట్లుగా చూసుకోవాలి.

4. బాగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ను తీసుకోవడం :-

4. బాగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ను తీసుకోవడం :-

వైట్ బ్రెడ్, క్రాకర్స్ & చిప్స్, స్వీట్గా ఉండే డ్రింక్స్ & డెసెర్ట్లు వంటి ఆహారాలలో ఉండే శాచ్యురేటెడ్ ఫ్యాట్ కారణంగా మీ శరీరం ఇన్ఫ్లమేషన్కు గురవుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్, బెల్లీ ఫ్యాట్తో ముడిపడి ఉంటుంది, అందువల్ల మీరు ప్రాసెస్ చేయబడిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ శరీరం బెల్లీ ఫ్యాట్ను కోల్పోయే సామర్థ్యాన్ని కోల్పోతుంది.

5. మీ శరీరం తప్పుడు కొవ్వులను కలిగి ఉండటం :-

5. మీ శరీరం తప్పుడు కొవ్వులను కలిగి ఉండటం :-

మీ శరీరం ఒకే విధంగా అన్ని రకాల కొవ్వులను నియంత్రించ లేదని మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. మోనోఅన్శాచురేటెడ్ ఫ్యాట్స్ ను కలిగివుండే అవకాడో, ఆలివ్ ఆయిల్స్ వంటి మొదలైన వాటితో పాటు; పోలే-అన్శాచురేటెడ్ ఫ్యాట్స్ను కలిగి ఉన్న సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్స్ & చేపల వంటి ఇతర ఆహార పదార్థాలను మీ డైట్లో భాగంగా చేసుకోవడం వల్ల అవి మీ శరీరాన్ని ఇన్ఫ్లమేషన్కు గురి చేస్తుంది. మీరు ఇలాంటి ఆరోగ్యకరమైన కొవ్వు పదార్ధాలను తినడం వల్ల అవి మీ శరీరానికి మంచి చేస్తుంది, కానీ మీరు వాటి వినియోగాన్ని మోడరేట్గా ఉంచుకోవాలని గుర్తుంచుకోవాలి.

6. మీ వయస్సు క్రమేపీ పెరగటం :-

6. మీ వయస్సు క్రమేపీ పెరగటం :-

మీరు వృద్ధాప్యానికి చేరువవుతున్న దశలో స్త్రీపురుషులిద్దరిలో ఉండే జీవక్రియ రేటు బాగా పడిపోతుంది. రుతువిరతి కారణంగా మీ శరీరంలో ఈస్ట్రోజెన్ & ప్రొజెస్టెరాన్ హార్మోన్లు ఉత్పత్తి నెమ్మదించడం వల్ల మీరు నెమ్మదిగా బరువు పెరుగుతారు. ఇంతలో, టెస్టోస్టెరాన్ స్థాయిలు కూడా నెమ్మదిగా పడిపోతాయి, ఈ హార్మోన్లలో సంభవించే అసమతుల్యత వల్ల స్త్రీలలో బెల్లీఫ్యాట్ ఏర్పడటానికి దారితీస్తుంది.

7. చాలా ఎక్కువ వత్తిడిని కలిగి ఉండటం :-

7. చాలా ఎక్కువ వత్తిడిని కలిగి ఉండటం :-

మీరు అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న కారణంగా మీ శరీర బరువును తగ్గించుకోవటం, మీకు చాలా కష్టతరమవుతుంది. ఎందుకంటే ఒత్తిడి హార్మోన్ అయిన "కార్టిసాల్" తీవ్ర ప్రభావానికి గురికావడం వల్ల మీ శరీరంలో అధిక కొవ్వును ఏర్పరచడానికి ప్రేరేపిస్తుంది. ఈ కార్టిసాల్ మరింత తీవ్ర ప్రభావానికి గురవటం వల్ల జీవక్రియ ఆధారిత పరిస్థితులకు విఘాతం ఏర్పడి, కండరాల విచ్ఛేదనానికి & మీ శరీరంలో కొవ్వును ప్రేరేపించుటకు దోహదపడుతుంది. ఇలా మీ పొట్ట భాగంలో కొవ్వు అధికంగా చేరుతుంది.

8. తగినంత నిద్ర లేకపోవడం :-

8. తగినంత నిద్ర లేకపోవడం :-

ఈ కారణం వల్ల కూడా మీరు మీ బెల్లీ ఫ్యాట్ను పోగొట్టుకోలేకపోతున్నారు. మీరు రోజువారీగా 5-6 గంటలు నిద్రపోతున్నప్పుడు మీ శరీర బరువు పెరుగుతుంది. "నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్" సూచించిన సూచనల మేరకు, వయోజనులు (పెద్దలు) ప్రతిరోజూ 7-8 గంటల పాటు నిద్రించాలి.


English summary

Why Belly Fat Is So Hard To Lose In Adults?

There are six types of belly fat out of which subcutaneous fat and visceral fat are the most common. Some of the reasons why belly fat is so hard to lose in adults are doing the wrong workout, drinking too much alcohol, stressing out too much, consuming processed foods and unhealthy fats, etc.
Desktop Bottom Promotion