For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మం నిగనిగలాడడానికి, రకరకాల భంగిమల్లో శృంగారం చేయడానికి, పొట్ట తగ్గడానికి ఈ యోగా ఆసనాలు వేయాలి

చర్మం నిగనిగలాడడానికి, రకరకాల భంగిమల్లో శృంగారం చేయడానికి, పొట్ట తగ్గడానికి ఈ యోగా ఆసనాలు వేయాలి యోగాసనాలు, యోగ, యోగా ఆసనాలు

|

సూర్యనమస్కారం అనేది పలుయోగాసనాల మేలు కలయిక. ఈ ఆసనాలను ఏ వయస్సులోని వారైనా వేయవచ్చు. దీని వలన శారీరకంగానూ, మానసికంగానూ ఉపయోగంగా ఉంటుంది. సూర్యనమస్కారం 12 ఆసనాలతో కలసి ఉంటుంది.

నిలబడిన స్థితిలో కాళ్ళను పరస్పరం దగ్గరకు తీసుకు రావాలి. భుజాలను చక్కగా పైకి తీసుకు రావాలి. తలకుపైకి తీసుకు వచ్చిన అరచేతులను కలపాలి. ఆలాగే ముఖం ఎదుటకు తీసుకువచ్చి నమస్కారం చేసే స్థితికి రావాలి. కలిపిన చేతులు ఛాతీ వద్ద ఉండేలా చూసుకోవాలి.

భుజాలను పైకి తీసుకురావాలి

భుజాలను పైకి తీసుకురావాలి

గాలిపీల్చుకుంటూ భుజాలను పైకి తీసుకురావాలి. చెవులను తాకుతూ ఉండాలి. మెల్లగా చేతులను వెనకవైపుకు తీసుకురావాలి. వీలైనంతగా తలను వెనక్కు వంచాలి. మెల్లగా గాలి వదులుతూ ముందుకు వంగాలి. చేతులను సమాంతరంగా ఉంచుతూ నేలను తాకాలి. ఈ సమయంలో తల మోకాలిని తాకుతూ ఉండేంతవరకూ తీసుకురావాలి. ఈ స్థితిలో కొన్నిసెకనులు అలాగే ఉండాలి. దీనినే పాద పశ్చమోత్తాసనం అంటారు.

కుడికాలును వెనక్కు తీసుకురావాలి

కుడికాలును వెనక్కు తీసుకురావాలి

గాలి పీల్చుతూ కుడికాలును వెనక్కు తీసుకురావాలి. వీలైనంత వెనక్కు ఉండేలా చూడాలి. ఈ స్థితిలో తలపైకెత్తాలి. కొన్ని సెకనలు ఈ స్థితిలో ఉండాలి. మెల్లగా గాలి వదులుతూ అదే విధంగా ఎడమ కాలిని వెనక్కు తీసుకురావాలి. పాదాలు రెండూ పక్కపక్కన ఉండేలా చూడాలి. భుజాలు చక్కగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు శరీరం బాణం విల్లు ఆకారంలో ఉంటుంది. ప్రాణాయామం వల్ల కూడా శరీరం సౌష్టవంగా మారుతుంది. ముఖంలో కాంతి పెరిగి కళకళలాడుతుంటారని యోగా నిపుణులు సూచిస్తున్నారు.

శృంగారానికి కూడా

శృంగారానికి కూడా

ఇక యోగాసనాల వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. శరీరం నుంచి విషతుల్యాలు వేగంగా బయటకు వెళ్లిపోతాయి. అవయవాల పనితీరు బాగుంటుంది. మనసును శ్వాస ప్రక్రియపై లగ్నం చేసి, ఏకాగ్రత సాధన చెయ్యడం వల్ల మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యము పెరుగుతుంది. నానా రకాల ఒత్తిళ్లలో కూరుకుపోతున్న నేటి తరానికి యోగా చాలా అవసరం. యోగాతో చర్మ సంరక్షణే కాదు ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. శృంగారానికి కూడా యోగా బాగా తోడ్పడుతుంది.

లైంగిక సామర్థ్యం

లైంగిక సామర్థ్యం

యోగా ఆసనాలు మన శరీరంలోని నాడీ కండరాల ధాతువులను చక్కగా ఉత్తేజపరుస్తాయి. మెదడును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరం, మనసు రెండూ సంయుక్తంగా ఉన్నప్పుడు లైంగిక సామర్థ్యం మరింత పెరగడమే కాక శృంగారం పాల్గొనే వ్యక్తుల మధ్య ఒద్దిక, గాఢమైన అనుబంధం నెలకొంటాయి.

వివిధ రకాల భంగిమల్లో

వివిధ రకాల భంగిమల్లో

శృంగారం జరిపే సమయంలో వివిధ రకాల భంగిమలలో చేయటం వలన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. పరిశోధనల ప్రకారం కొన్ని రకాల యోగాసనాలను అనుసరించటం వలన లైంగిక సమస్యలు తొలగి, లైంగిక జీవితాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆనందాన్ని పొందుతారు.

వీర్య కణాల్లో నాణ్యత

వీర్య కణాల్లో నాణ్యత

అలాగే పలువురు దంపతులు జీవనశైలి, ఒత్తిడి మూలంగా సంతాన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి ప్రధానం కారణం వీర్యకణాల్లో నాణ్యత లేకపోవడం. రోజూ యోగా చేసే అలవాటు ఉంటే వీర్యకణాల్లో నాణ్యత మెరుగుపడుతుంది.

రోజూ యోగా కచ్చితంగా చేయాలి. సెక్సువల్ ఫిట్‌నెస్‌కు యోగాకు మధ్య సంబంధం ఉందని, సెక్స్ ‌కు సంబంధించిన సమస్యలను యోగానుంచి పరిష్కరించుకోవచ్చునని యోగా గురువులు అంటున్నారు. దీంతో ఆరోగ్యంగావుంటూ సెక్స్ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించవచ్చునని చెబుతున్నారు. యోగా అంటేనే జోడించడం, కలపడం అని అర్థం.

దివ్యౌషధంలాంటిది

దివ్యౌషధంలాంటిది

యోగా అనేది మీకు మీ భాగస్వామికి మంచి దివ్యౌషధంలాంటిది. అయితే శరీరంలో నూతనోత్సాహాన్ని నింపడానికి మరే ఇతర మందులు లేవు. దీనికి యోగాలో పద్మాసనమే ముఖ్యమంటున్నారు యోగా నిపుణులు. పద్మాసనం ఏకాగ్రతను పెంచుతుందని చెబుతున్నారు. సెక్స్ సమస్యలు స్త్రీ పురుషుల్లో విభిన్నంగా ఉంటాయి. అందువల్ల ఇద్దరూ యోగా ఆసనాలు వేయాల్సి ఉంటుంది.

ప్రాణాయమం, ధనురాసన, వజ్రాసన, సర్వాంగాసనం, హలాసనం

ప్రాణాయమం, ధనురాసన, వజ్రాసన, సర్వాంగాసనం, హలాసనం

యోగాలో ముఖ్యమైనది ప్రాణాయమం. దీనివల్ల శరీరం, మనసు నియంత్రణలో ఉండటమే కాకుండా కావలసినంత సెక్స్ సామర్థ్యం వస్తుంది. ధనురాసన, వజ్రాసన, సర్వాంగాసనం, హలాసనం, సూర్యనమస్కారం వంటి యోగాసనాలతో మంచి ఫలితం ఉంటుంది. ఇలా మీరు యోగాతో సెక్స్ సామర్థ్యం పెంచుకోండి. ఐతే ఈ ఆసనాలను నిపుణులైన వారి ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. పైన తెలిపిన ఆసనాలన్నీ ఆరోగ్యాన్ని పెంపొందించటమే కాకుండా, లైంగిక జీవితంలో కలిగే సమస్యలను తగ్గించి, శృంగారంలో ఉన్న ఆనందాన్ని పొందేలా చేస్తాయి.

పొట్ట దగ్గర బరువు తగ్గుతుంది

పొట్ట దగ్గర బరువు తగ్గుతుంది

ఇక బరువు తగ్గడానికి ఒక మంచి ఆసంన ఉంది. అదే. హస్త ఉత్తాన ఆసనం. ఉత్తానమంటే పైకి లేపడం. చేతుల్ని పైకి లేపి చేసే ఆసనం గనుక దీన్ని హస్త ఉత్తాన ఆసనం అన్నారు. రెండు చేతులనూ నిటారుగా ఆకాశమువైపు జతగా సాచి నిదానంగా, నిండుగా ఊపిరిని తీసుకుని లోపల బంధించాలి. ఇదే స్థితిలోనడుము పైభాగము నుంచి అర చేతుల వరకూవున్న శరీరాన్ని వీలైనంత వెనక్కి వంచాలి. ఈ స్థితిలో చేతులు, భుజాలు, ఉదర స్థానం బాగా సాగడంవలన అవి పటిష్టంగా తయారవుతాయి. పొట్ట సాగడంవలన జీర్ణ శక్తి పెరుగుతుంది. ఊపిరితిత్తులు బలాన్ని పెంచుకుంటాయి. కొవ్వు కరగటం ద్వారా క్రమంగా పొట్ట దగ్గర బరువు తగ్గుతుంది.

వెనక్కి వంచకూడదు

వెనక్కి వంచకూడదు

ఈ ఆసనం చేసేటప్పుడు ప్రారంభంలోనే వెన్ను పూర్తిగా వెనక్కి వంచే ప్రయత్నం చేయకూడదు. ప్రారంభంలో కొంతమందికి కళ్ళు తిరిగి చీకట్లు కమ్మి కింద పడే అవకాశం ఉంది. అలా జరిగితే మరోసారి ప్రయత్నించేటప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి, కాళ్ళు, పాదాలు తగినంత ఎడంగావుంచి వెన్ను వెనక్కు వంచగలిగే స్థితికి మాత్రమే వంచాలంటున్నారు యోగా నిపుణులు.

English summary

international yoga day 2022: yoga for glowing skin 15 poses that can do wonders

yoga for glowing skin 15 poses that can do wonders
Desktop Bottom Promotion