For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గడానికి యాపిల్ సైడర్ వెనిగర్ ను ఎలా ఉపయోగించాలి

|

శరీరం బరువు అనేది ఎప్పుడు కూడా వ్యక్తి యొక్క ఎత్తుకు అనుగుణంగా ఉండాల్సి ఉంటుంది. క్రమంగా ఒక వ్యక్తి ఎత్తుకి ఏమాత్రం అనుబంధం లేకుండా అసాధారణ రీతిలో బరువును కలిగి ఉన్న ఎడల, దాన్ని స్థూలకాయం లేదా ఊబకాయం అని వ్యవహరించడం జరుగుతుంది. శరీరంలో కొవ్వు నిక్షేపణలు అధికంగా ఉన్నప్పుడు సంభవించే పరిస్థితిగా ఈ స్థూలకాయాన్ని పరిగణిస్తారు. ఈ బరువును నియంత్రించుకునే క్రమంలో భాగంగా BMI ప్రామాణికాలను అనుసరిస్తూ అనేకమంది ఫలితాలను సాధించారు కూడా. ఎప్పటికప్పుడు BMI గమనించడం, క్రమంగా ఆహార మరియు జీవనశైలి విధానాలలో అవసరమైన మార్పులను తీసుకుని రావడం ద్వారా కోరుకున్న రూపాన్ని సాధించిన వారు కూడా ఉన్నారు.

ఒకవేళ ఒక వ్యక్తి అతడు/ఆమె శరీరానికి అవసరమైన మోతాదుల కన్నా అదనంగా ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించినా, డిప్రెషన్ లేదా జీన్స్ వంటి అనేక ఇతర అంశాల ప్రభావాలకు లోనైనా, ఈ స్థూలకాయం సమస్య తలెత్తుతుంది. అధికంగా ఆహారాన్ని తీసుకోవడంతో పాటుగా, జీవన శైలి ప్రామాణికాలు, డ్రగ్స్, మద్యపానం, ధూమపానం, కొన్ని రకాల ఔషధాలను తీసుకోవడం వంటివి కూడా స్థూలకాయానికి ప్రతిబంధకాలుగా ఉన్నాయి.

నిజానికి ఇది సాధారణమైన సమస్యే అయినా, ఎవరు దీని బారిన పడుతారో చెప్పడం కష్టం. ఊబకాయం వ్యక్తి జీవన విధానానికి కూడా అవరోధంగా మారగలదు. ఊబకాయం రక్తపోటు, కిడ్నీలో రాళ్ళు, హార్మోనుల అసమతౌల్యం, అలాగే కొన్ని రకాల క్యాన్సర్లకు కారణమవడమే కాకుండా ప్రాణాపాయానికి కూడా దారితీస్తుంది.

బరువు తగ్గించడంలో జీవనశైలిలో చేయదగిన మార్పులు, తీసుకోవలసిన ఆహార ప్రణాళికలను ఇదివరకు అనేక వ్యాసాలలో మనం తెలుసుకుంటూనే ఉన్నాం., ఆ క్రమంలో భాగంగానే, ఈ వ్యాసంలో, బరువు కోల్పోవడం దృష్ట్యా ఒక అద్భుతమైన పదార్ధాన్ని ఉపయోగించే విధానం గురించిన వివరాలను తెలుసుకుందాం. ఆ పదార్ధం తెలియనిదేమీకాదు, ఆపిల్ సైడర్ వెనిగర్. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా, సమర్థవంతంగా బరువును తగ్గించడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ అద్భుతంగా పని చేస్తుందని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.

నిజానికి ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ ఒకప్పుడు ప్రజలకు అంత సుపరిచితం కాదు. కానీ ఇప్పుడు ఆపిల్ సైడర్ వెనిగర్ లేని సూపర్ మార్కెట్ అంటూ ఉండదు. కావున దీని లభ్యత గురించిన ఆలోచన అనవసరం.

ఆపిల్ సైడర్ వెనిగర్ వివిధరకాల విటమిన్లు, పొటాషియం, ఖనిజాలు మరియు పలు ఇతర ఆమ్లాల యొక్క అద్భుత మూలంగా ఉంటుంది. ఇది శరీరంలో నీటి నిలుపుదలను నిరోధించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా బరువు తగ్గడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది.

కావున, బరువు తగ్గడం కోసం ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఉపయోగించే విధానం గురించి తెలుసుకోడానికి వ్యాసంలో ముందుకు సాగండి.

1. దాల్చిన చెక్క, నిమ్మ మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ :

1. దాల్చిన చెక్క, నిమ్మ మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ :

2 నుండి 3 టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని 8 నుండి 10 ఔన్సుల నీటికి కలపండి. ఈ మిశ్రమాన్ని రోజులో మూడు సార్లు సేవించండి. దీన్ని ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసి, కూల్‌డ్రింక్ వలె తీసుకోవచ్చు.

2. ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు తేనె :

2. ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు తేనె :

రెండు టీస్పూన్ల తేనె మరియు 2 నుండి 3 టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఒక గ్లాసు నీటిలో కలపండి. తాగే ముందు షేక్ చేసి తీసుకోవలసి ఉంటుంది. మెరుగైన ఫలితాల కోసం ప్రతిరోజూ తీసుకోండి.

3. ఆపిల్ సైడర్ వెనిగర్, తేనె మరియు నీరు :

3. ఆపిల్ సైడర్ వెనిగర్, తేనె మరియు నీరు :

ఊబకాయం తగ్గించడంలో ఈ రెసిపీ అత్యుత్తమంగా పనిచేస్తుందని చెప్పబడింది. 2 టీస్పూన్ల ముడి తేనెను 16 ఔన్సుల నీటికి చేర్చి 2 టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి. భోజనానికి అరగంట ముందు సేవించాలి. మెరుగైన ఫలితాల కోసం రోజుకొకసారి అనుసరించండి.

4. ఆపిల్ సైడర్ వెనిగర్ , రసాలు :

4. ఆపిల్ సైడర్ వెనిగర్ , రసాలు :

ఆపిల్ సైడర్ వెనిగర్‌ను పండ్ల రసాలలో కూడా జోడించవచ్చు. 8 ఔన్సుల గోరు వెచ్చని నీటిలో, 8 ఔన్సుల కూరగాయలు లేదా పండ్ల రసాన్ని మరియు 2 టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి మిక్స్ చేయండి. రోజులో రెండు మార్లు క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించగలరు.

5. సలాడ్ మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ :

5. సలాడ్ మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ :

మీ సలాడ్‌లో ఆపిల్ సైడర్ వెనిగర్ జోడించడం ద్వారా సమర్థవంతంగా మరియు వేగవంతంగా ఊబకాయం తగ్గించుకోవడంలో దోహదపడుతుందని చెప్పబడింది. ఈ రెసిపీకి 50 మిల్లీలీటర్ల నీటికి, 50 మిల్లీలీటర్ల ఆపిల్ సైడర్ వెనిగర్, ¼ టీస్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, ¼ స్పూన్ ఉప్పు, మీకు నచ్చిన కూరగాయలు అవసరమవుతాయి. ఒక గిన్నెలో ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపిన నీళ్ళను తీసుకుని, అందులో తరిగిన కూరగాయలను మరియు మిగిలిన పదార్ధాలను జోడించి కలపండి. ఈ సలాడ్ బరువు తగ్గడంలో ఉత్తమంగా సహాయపడగలదు.

6. ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు గ్రీన్-టీ :

6. ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు గ్రీన్-టీ :

గ్రీన్-టీ మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గే విషయంలో ఒక పవర్ ప్యాక్డ్ కాంబో అని చెప్పబడుతుంది. గ్రీన్ టీ తయారుచేసుకున్న తర్వాత, దానిలో రెండు టీస్పూన్ల తేనె మరియు ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ జోడించి సేవించండి. ఈ మిశ్రమాన్ని రోజులో పలుమార్లు తీసుకోండి.

7. ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు చామంతి-టీ :

7. ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు చామంతి-టీ :

గ్రీన్-టీ మాదిరిగానే, చామంతి-టీలో కూడా ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తీసుకోవచ్చు. బరువు తగ్గడంలో ఇది కూడా అత్యుత్తమంగా సహాయం చేస్తుంది. 3 టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్, 2 టీస్పూన్ల తేనెను ఒక కప్పు తాజా చామంతి- టీలో కలిపి సేవించండి. ఉత్తమ ఫలితాల కోసం ప్రతిరోజూ తీసుకోవచ్చు.

8. మాపుల్ సిరప్ మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ :

8. మాపుల్ సిరప్ మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ :

మాపుల్ సిరప్ సహజ సిద్దమైన స్వీటెనర్‌గా పరిగణించబడుతుంది. మరియు చక్కర కన్నా ఆరోగ్యకరమైన స్వీటెనర్‌గా ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ తటస్థీకృతం చేయడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఒక గ్లాసు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ మాపుల్ సిరప్ మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి సేవించండి. బరువు తగ్గే క్రమంలో భాగంగా రోజులో మూడు సార్లు తీసుకునేలా ప్రణాళిక చేసుకోండి.

9. ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు వెల్లుల్లి రసం :

9. ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు వెల్లుల్లి రసం :

ఒక బౌల్ తీసుకొని అందులో 2 టీస్పూన్ల తేనె, 2 టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్, కొన్ని చుక్కల వెల్లుల్లి రసం, ¼ స్పూన్ నిమ్మ రసం మరియు ఒక చిటికెడు కాయన్నే పెప్పర్లను ఒక గ్లాసు నీటికి జోడించి కలిపి తీసుకోండి. ఇది మీకు ఆహారం మీద కోరికలను తగ్గించి, బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది.

10. ఆపిల్ సైడర్ వెనిగర్ మాత్రలు :

10. ఆపిల్ సైడర్ వెనిగర్ మాత్రలు :

నిజం, కొన్ని స్టోర్స్‌లో రెడీమేడ్ ఆపిల్ సైడర్ వెనిగర్ మాత్రలు కూడా లభిస్తున్నాయి. బ్రాండ్ అనుసరించి పోషకాలలో తేడాలు గమనించవచ్చు.

ఆపిల్ సైడర్ వెనిగర్ - ప్రధాన ఉపయోగాలు :

ఎ. కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది :

ఎ. కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది :

ఆపిల్ సైడర్ వెనిగర్ జీవ క్రియలను మెరుగుపరచడంలోనే కాకుండా, క్యాలరీలను వేగంగా కరిగించడంలో కూడా సహాయపడుతుంది. దీని వలన శరీరంలో కొవ్వు పేరుకుపోవడం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మంచి కొలెస్ట్రాల్ నిర్వహించడానికి, మరియు చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి సహాయపడుతుంది.

బి. మధుమేహాన్ని నియంత్రిస్తుంది :

బి. మధుమేహాన్ని నియంత్రిస్తుంది :

ఇన్సులిన్ స్థాయిలు, రక్తంలో చక్కెర స్థాయిలు కూడా శరీరంలో కొవ్వు పేరుకుపోయేందుకు కారకాలుగా ఉండవచ్చు. మీ దైనందిక ఆహార ప్రణాళికలో భాగంగా తరచుగా ఆహారంలో ఆపిల్ సైడర్ వెనిగర్ చేర్చడం వల్ల శరీరంలో రక్తంలోని చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. క్రమంగా మధుమేహాన్ని, ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ నియంత్రించడానికి సహాయపడుతుంది.

సి. డీటాక్స్ గా పనిచేస్తుంది :

సి. డీటాక్స్ గా పనిచేస్తుంది :

శరీరంలో హానికరమైన బ్యాక్టీరియా లేదా వైరస్లు లేనప్పుడు మాత్రమే జీర్ణక్రియ ప్రక్రియలు సజావుగా సాగుతాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ విషతుల్యాలను శోషించుకోవడం ద్వారా ప్రేగు కదలికలను నిర్వహించడంలో, క్రమంగా మలవిసర్జన సజావుగా సాగడంలో సహాయపడుతుంది. అలాగే శరీరం నుండి వెలువడే హానికరమైన విష పదార్ధాలను బయటకు నెట్టివేయడంలో సహాయం చేస్తుంది. క్రమంగా బరువు తగ్గడంలో అత్యుత్తమంగా సహాయపడగలదు.

డి. ఆకలిని అణిచివేస్తుంది :

డి. ఆకలిని అణిచివేస్తుంది :

ఆపిల్ సైడర్ వెనిగర్ ఆకలి కోరికలను తగ్గించడంలో ఉత్తమంగా పనిచేస్తుంది. ముఖ్యంగా దీనిలో బీటా కెరోటిన్ ఉంటుంది, ఇది కొవ్వు కణాలను వేగంగా విచ్ఛిన్నం చేయడానికి దోహదపడుతుంది.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Apple Cider Vinegar For Weight Loss

Apple cider vinegar can be used for weight loss along with cinnamon, lemon, honey, etc. Read to know how to use apple cider vinegar for weight loss.