For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిజంగా ఆక్యుపంక్చర్ బరువు తగ్గడానికి సహాయపడుతుందా?

|

ఈ క్షణం ప్రపంచ జనాభాలో సుమారు 20 శాతం మంది ఏదైనా ఒక అంశం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు అంటే , అది ఖచ్చితంగా బరువును తగ్గించుకోవడమే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కానీ దీనికి ప్రత్యేకించబడిన ఆరోగ్యకర పద్ధతులను ఒక ప్రణాళికాబద్ధంగా అనుసరించవలసి ఉంటుందని గుర్తుంచుకోండి. లేనిచో కొన్ని ప్రతికూలతలను కూడా ఎదుర్కోవలసిన పరిస్థితులు దాపురిస్తుంటాయి. శరీరంలో పేరుకుపోయిన చెడుకొవ్వును, క్రమంగా అధిక బరువును తగ్గించుకోవడానికి ప్రయత్నించడం ఏమాత్రం తప్పు కాదు. కానీ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిపుణుల లేదా అనుభవజ్ఞుల సలహా మీద మాత్రమే కొన్ని పద్దతులను పాటించవలసి ఉంటుంది. క్రమంగా ఆహర ప్రణాళికలు, వ్యాయామం మరియు కొన్ని రకాల సప్లిమెంట్స్, జీవనశైలి విధానాలు ఇటువంటి అనేక అంశాల నడుమ కోరుకున్న రీతిలో శరీరాకృతిని సాధించవచ్చు.

ఇటీవలి కాలాల్లో, ప్రజలు బరువు తగ్గడంలో కొన్ని సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ, అనుసరిస్తూ ఉత్తమ ఫలితాలను సాధించగలుగుతున్నారు కూడా. క్రమంగా, శరీరంలో అదనపు క్రొవ్వు తగ్గడానికి సహాయపడే కొన్ని ప్రత్యేక పద్ధతులకు సాక్ష్యాలుగా నిలుస్తున్నారు కూడా. అంతేకాకుండా, ఇతర సమస్యల నివారణలకు ఉపయోగించే కొన్ని పద్దతులను, వివిధ కోణాల్లో పరిశీలించి అనుసరించడం ద్వారా బరువును తగ్గించవచ్చునని కూడా అనేక సందర్భాలలో తేలింది. అటువంటి విషయాలలో ఆక్యుపంక్చర్ కూడా ఒకటి. ఈ చికిత్సా విధానం, బరువు తగ్గడంలో ఎంతో ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనాలలో తేలింది కూడా.

ఆక్యుపంక్చర్ విధానాన్ని అనేక సంవత్సరాలుగా అనేక నొప్పి నివారణా చికిత్సలలో భాగంగా ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఈ ప్రాచీన చైనీయుల అభ్యాసం ప్రకారం, ఈ చికిత్సా విధానం సూదులను ఉపయోగించి చేయడం జరుగుతుంది. గడిచిన 40 సంవత్సరాల కాలంగా ఈ వైద్య విధానంపై ప్రజాదరణ నిలకడగా పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, దీర్ఘకాలిక నొప్పులు, మైగ్రేన్, డిప్రెషన్, నిద్రలేమి, వంధ్యత్వం, జీర్ణక్రియ సమస్యలు, ఆందోళన వంటి మానసిక మరియు శారీరిక సమస్యలకు చికిత్సగా ఈ ఆక్యుపంక్చర్ చికిత్సా విధానాన్ని అనుసరించడం జరుగుతూ ఉంది. ఇటీవలి కాలంలో ఈ చికిత్సా విధానం బరువు తగ్గడంలో కూడా అత్యంత కీలకపాత్రను పోషిస్తుందని కనుగొనబడింది.

బరువు తగ్గడంలో ఆక్యుపంక్చర్ ప్రభావం :

ఈ ప్రాచీన చైనీయుల చికిత్సా విధానం, బరువు తగ్గడంలో ఈ ఆక్యుపంక్చర్ విధానం కీలకపాత్రను పోషిస్తుందని ఇటీవలి అధ్యయనాలు సైతం నొక్కి చెబుతున్నాయి. ఈ పద్ధతి అనేక కోణాల నుండి బరువు నష్టాన్ని ప్రోత్సహిస్తుందని ఉపాసకులు వెల్లడిస్తున్నారు. క్రమంగా ఇది మీ జీవక్రియలు మరియు జీర్ణక్రియలు మెరుగుపడడంలో సహాయం చేయడమే కాకుండా, శరీరంలోని హార్మోనులను మరియు ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్దీకరించడంలో కూడా సహాయపడుతుంది. తద్వారా బరువు తగ్గడంలో సమర్థవంతమైన పాత్రను పోషించగలుగుతుంది.

సాంప్రదాయిక చైనీయుల వైద్య విధానాల ప్రకారం, మీ శరీరంలోని అసమతుల్యతల ఫలితంగా బరువు పెరగడం జరుగుతుంటుంది. క్రమంగా ఇది కాలేయం, ప్లీహం, మూత్రపిండాలు, థైరాయిడ్ గ్రంధి మరియు ఎండోక్రైన్ వ్యవస్థల పనితీరు మందగించడం మూలంగా బరువు పెరగడం జరుగుతుందని తేలింది.

ఆక్యుపంక్చర్ మీ శరీరంలో శక్తి ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. తద్వారా మీ జీవక్రియలను పెంచి, ఆకలి మరియు ఒత్తిడిని తగ్గించడం ద్వారా బరువు పెరగడాన్ని అదుపు చేయగలుగుతుంది. అంతేకాకుండా తరచుగా ఆహార పదార్ధాల మీదకు మనసు వెళ్ళకుండా మెదడును నియంత్రించడంలో కూడా తోడ్పాటునందిస్తుంది.

ఈ ప్రక్రియ నేరుగా అదనపు కొవ్వును కరిగిస్తుందని గమనించాలి. కానీ నిజానికి, మీకు ఆకలి కోరికలను పెంచే మెదడులోని ఒక భాగాన్ని ప్రభావితం చేయడం ద్వారా బరువును కోల్పోవడంలో సహాయాన్ని అందివ్వగలదు. అలాగే, ఇది న్యూరోట్రాన్స్మిటర్లను ఉత్తేజపరిచి, ఒత్తిడిని, ఆందోళనా స్థాయిలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఇది కూడా బరువు కోల్పోవడంలో కీలకంగా పనిచేస్తుంది. క్రమంగా ఆందోళన, డిప్రెషన్స్ కారణంగా బరువు పెరుగుతారు అనే వాదనకు ఈ చికిత్సా పద్దతి ఊతమిచ్చింది. ఆక్యుపంక్చర్ అంతిమ లక్ష్యం ఒకటే అయినప్పటికీ, ఈ ప్రక్రియ మాత్రం సమస్యల ప్రకారం వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటుంది.

80 మంది ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తులపై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, బరువు తగ్గడంలో ఆక్యుపంక్చర్ విధానం అత్యంత సమర్ధనీయమైన ఫలితాలను అందిచాయని వెల్లడించింది. క్రమంగా ఆ వ్యక్తుల బరువు కోల్పోవడంలో కీలకంగా సహాయం చేసిందని వెల్లడించింది. అయితే, ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక, జీవన శైలిలో ఆరోగ్యకర మార్పుల పరంగా కూడా ఈ అధ్యయనం జరిగింది. క్రమంగా ఆరోగ్య నిపుణులు, ఆక్యుపంక్చర్ అభ్యాసనతో పాటుగా, బరువు నష్టాన్ని ప్రేరేపించడానికి ఆరోగ్యకరరీతిలో జీవనశైలి నియమాలను కూడా అనుసరించాలని సూచిస్తున్నారు.

క్రమంగా ఆక్యుపంక్చర్ అభ్యాసంలో, ఈ దిగువ పొందుపరచిన మార్గాలను అనుసరించడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవడంలో ఉత్తమంగా సహాయపడగలదు :

• ఇది ఒక యాంటీ డెస్పరెంట్ అయిన మెదడు హార్మోన్ సెరటోనిన్ విడుదలను పెంచడం ద్వారా, ఆహారం అధిక వినియోగాన్ని అరికట్టేందుకు తోడ్పాటుని అందిస్తుంది.

• మద్యం తీసుకోవడం మరియు క్యాలరీలను తగ్గించడం కొరకు డోపమైన్ విడుదల చేయడం ద్వారా ఆకలి కోరికలను తగ్గించడంలో సహాయం చేయగలుగుతుంది.

• ఆందోళన, మరియు డిప్రెషన్ తగ్గించడం ద్వారా కూడా ఆహారం మీద తరచూ కోరికలు వెళ్ళకుండా నిరోధించగలుగుతుంది.

• బీటా ఎండోర్ఫిన్స్ మరియు సెరటోనిన్ హార్మోన్ల విడుదల కారణంగా జీవక్రియలు పెరగడంలో సహాయం చేస్తుంది.

• అంతేకాకుండా ఈ బీటా ఎండోర్ఫిన్స్ మరియు సెరోటోనిన్ ఆకలిని హరించివేయడంలో కూడా సహకరిస్తాయి.

• శారీరిక నొప్పులను తగ్గించడం ద్వారా, తరచుగా వ్యాయామం చేయడానికి కూడా ఊతమందిస్తుంది.

ఆక్యుపంక్చర్ నేరుగా స్థూలకాయం హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. క్రమంగా ఇది ఘ్రెలిన్ మరియు లెప్టిన్ హార్మోనులను క్రమబద్దీకరించడం ద్వారా, ఆహారం మీదకు మనసు వెళ్ళకుండా చేయగలుగుతుంది. లెప్టిన్ శరీరంలో కొవ్వు నిక్షేపాలను మరియు జీవక్రియలను సవ్యంగా సాగేలా చేస్తుంది. ప్రాథమికంగా, ఆకలిని హరించడం మరియు ఆహారం మీద కోరికలను తగ్గించడం, జీవక్రియలను పెంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, ఊబకాయం సంబంధిత హార్మోనులను నియంత్రించే పోషకాల శోషణ మరియు వినియోగాన్ని మెరుగుపరచడం ద్వారా ఈ చికిత్సా విధానం పూర్తిస్థాయిలో ప్రభావాన్ని చూపగలుగుతుంది., క్రమంగా బరువు తగ్గడం ప్రారంభిస్తుంది. అదేవిధంగా కాలేయం యొక్క విధిని మెరుగుపరచడం ద్వారా, ఆక్యుపంక్చర్ కొవ్వును కరిగించి మీరు ఆశించిన ఫలితాలను వేగవంతం చేస్తుంది.

వ్యక్తి జీవక్రియల మీద నేరుగా ప్రభావం చూపడం ద్వారా, ఆక్యుపంక్చర్ బరువు నష్టాన్ని మరింతగా ప్రేరేపిస్తుంది. ఎందుకంటే బరువు నష్టం అనేది, ఆరోగ్యకర రీతిలో సమర్థవంతంగా జరగాల్సిన అవసరం ఉంది. లేనిచో శక్తి స్థాయిలను కోల్పోయి, కొన్ని ప్రతికూల అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశాలు లేకపోలేదు. తద్వారా బరువును కోల్పోవడం కష్టంగా ఉంటుంది.

ఊబకాయం తగ్గడంలో కేవలం ఆక్యుపంక్చర్ చికిత్సలనే కాకుండా ఆహార ప్రణాళిక, వ్యాయామం, జీవనశైలి వంటి అంశాలలో ఆరోగ్యకర మార్పులను పాటించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

బరువు తగ్గడం కోసం చెవి మీద అనుసరించే ఆక్యుపంక్చర్ విధానం :

ఈ ఆక్యుపంక్చర్ విధానంలో, మీ చెవి మీద సూదులతో గుచ్చడం కొద్దిగా నొప్పిగా ఉండవచ్చు. అయితే, ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం బరువు తగ్గడం దృష్ట్యా ఈ పద్దతి ఉత్తమంగా పనిచేస్తుందని చెప్పబడింది. అలాగే, ఈ చెవి మీద చేసే ఆక్యుపంక్చర్ విధానాన్ని ఆరిక్యులర్ ఆక్యుపంక్చర్ విధానంగా వ్యవహరించడం జరుగుతుంది. చెవి వెలుపలి భాగం (ఆరికల్) ఈ చికిత్సలో అత్యంత కీలకంగా పనిచేస్తుంది. చెవిమీద కొన్ని పాయింట్లమీద సూదులతో గుచ్చి చికిత్స చేయడం ద్వారా, ఒక వ్యక్తి యొక్క ఆహార కోరికలను నియంత్రించవచ్చునని ఆక్యుపంక్చర్ అభ్యాసకులు సూచిస్తున్నారు.

ఈ ఆరిక్యులర్ ఆక్యుపంక్చర్ విధానంలో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒక రకం ఆరిక్యులర్ ఆక్యుపంక్చర్ విధానంలో, ఆకలి మరియు ఆకలి కోరికలతో ముడిపడి ఉన్న ప్రాంతంలో ఒక సూదిని చొప్పించడడం ద్వారా చికిత్స చేయడం జరుగుతుంది. మరియు మరొక పద్ధతి ప్రకారం, చెవిలో వివిధ కీలక బిందువుల దగ్గర ఐదు సూదులను చొప్పించడం జరుగుతుంటుంది. ఈ సూది పద్ధతి పొట్ట చుట్టూ చేరిన కొవ్వును తగ్గించుకునే క్రమంలో ఉపయోగించడం జరుగుతుంది. ఐతే ఈ ఐదు సూదుల పద్ధతిని ప్రధానంగా స్థూలకాయులైన వ్యక్తుల విషయంలో అనుసరించడం జరుగుతుంటుంది. ఈ ఐదు సూదుల పద్ధతిలో, ఈ సూదులను గుచ్చే ప్రాంతాలు ప్రధానంగా మీ శరీరంలోని ప్లీహం, జీర్ణాశయం, ఆకలి, ఎండోక్రైన్, మరియు షెన్ మెన్ (మాస్టర్ పాయింట్ అని కూడా పిలుస్తారు) సంబంధించిన బిందువులు ఉంటాయి.

బరువు తగ్గించడంలో చెవి ఆక్యుపంక్చర్ విధానం మీద దృష్టి కేంద్రీకరించిన ఒక అధ్యయనంలో, ఈ ఐదు సూదుల పద్దతిలో 6.1 శాతం అధికంగా బరువు తగ్గుదలను, మరియు ఒక పాయింట్ సూది విధానంలో 5.7 శాతం బరువు తగ్గినట్లు తెలిపారు. క్రమంగా ఈ ఆరిక్యులర్ ఆక్యుపంక్చర్ విధానం, బరువు తగ్గడంలో కీలకమైన ప్రభావాన్ని కలిగి ఉందని తేల్చిచెప్తున్నారు. ప్రధానంగా ఈ అధ్యయనంలో పొట్ట చుట్టూ చేరిన కొవ్వును తగ్గించడంలో ఎంతగానో దోహదపడిందని చెప్పడం జరిగింది.

ప్రధానంగా వ్యక్తి జీవక్రియలను వేగవంతం చేయడం ద్వారా ఆరిక్యులర్ ఆక్యుపంక్చర్ పనిచేస్తుందని చెప్పబడింది. అనగా, జీవక్రియల పనితీరును పెంచడం ద్వారా, శరీరంలోని కొవ్వు జీవక్రియలు పెరగడంలో సహాయం చేస్తుంది. ఒక సూదితో కూడిన పద్దతితో, అయిదు సూదుల విధానాన్ని పోల్చి చూసినప్పుడు., 5 సూదుల విధానమే అత్యంత ప్రభావవంతంగా పనిచేసిందని అధ్యయనంలో చూపింది.

మార్గదర్శకాలు :

మీరు బరువు కోల్పోవడం కోసంగా ఆక్యుపంక్చర్ విధానాన్ని పరిగణనలోకి తీసుకున్నవారైతే, మీరు కింది విషయాలను గుర్తుంచుకోవలసి ఉంటుంది.

• సరైన సర్టిఫికేషన్ కలిగి ఉన్న ఆక్యుపంక్చర్ ప్రాక్టీషనర్ను ఎంచుకోవడం ఉత్తమం..

• మీ ప్రాక్టీషనర్ యొక్క ప్రాంతం, వారి స్పెషాలిటీ మరియు బరువు తగ్గడం గురించి అతనికి ఉన్న పేరు గురించి పూర్తి స్థాయిలో అవగాహనకు రండి.

• రెండు పక్షాల (ప్రాక్టీషనర్ మరియు రోగి) కు లాభదాయకంగా ఉండేలా ఇన్సూరెన్స్ (భీమా) ఉండాలని గుర్తుంచుకోండి.

• ట్రీట్మెంట్ రూమ్ శుభ్రంగా మరియు సురక్షితంగా ఉన్నదో లేదో పరిశీలించండి.

• మీ చికిత్సా ప్రక్రియలో భాగంగా మీ ప్రాక్టీషనర్ కోసం కనీసం ఒక గంట సమయమైనా కేటాయించండి. ఈ సమయం ఈ ఆక్యుపంక్చర్ ప్రక్రియను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మరియు అభ్యాసాలను గుర్తించడంలో మీకు సహాయపడుతుంది.

• విధానాలకు సంబంధించిన ప్రశ్నలను అడగండి., క్రమంగా ఇతరులు పొందిన లాభనష్టాల పరంగా మీకంటూ ఒక అవగాహన వస్తుంది.

• మీ పరిస్థితి గురించి ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకునేలా, అభ్యాసకుడు ఉండాలని గుర్తుంచుకోండి. మీ ప్రశ్నలకు మరియు సందేహాలకు అతడు/ఆమె సమాధానం చెప్పగలుగుతున్నారా లేదా అన్న విషయం కూడా మీకు తెలిసిపోతుంది.

• ప్రాక్టిషనర్ మీమీద పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి. అనగా, వారు మీ బరువును తగ్గించడం మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించకుండా, మీ ఆరోగ్య పరిస్థితి, ఇతర రోగాలు, ప్రమాదాలు, గాయాలు మొదలైన ఇతర కారకాల గురించిన అవగాహనను కూడా కలిగి ఉండాలి.

• సమర్థవంతమైన ప్రాక్టీషనర్ ఎల్లప్పుడూ మంచి నేర్పుతో వ్యవహరిస్తూ, స్వీయ సంరక్షణల దిశగా మిమ్మల్ని ప్రోత్సహిస్తారు.

• చికిత్సల సంఖ్య మరియు సమయం గురించిన వివరాలను పూర్తి స్థాయిలో తెలుసుకోండి.

• మీ ఆరోగ్య భీమా ఆక్యుపంక్చర్ చికిత్సలను కలిగి ఉన్నదో లేదో తెలుసుకోండి.

• చికిత్సల పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండండి. ప్రతికూల దృక్పధాలు, మీ నమ్మకాన్ని సైతం దెబ్బతీస్తాయి. ఫలితంగా దృష్టి సారించడం తగ్గి, ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు.

మీకు సుమారుగా ఎన్ని సెషన్ లు అవసరం అవుతాయి :

బరువు తగ్గడం కోసం ఆక్యుపంక్చర్ విధానం మీద నిర్వహించిన అధ్యయనాల ప్రకారం, 10 నుండి 15 పౌండ్ల బరువు తగ్గేందుకు, నికరంగా ఆరు నుండి ఎనిమిది వారాల సమయం పట్టవచ్చునని చెప్పబడింది. అయితే, కార్యక్రమాలను బట్టి, అభ్యాసాలను అనుసరించి, చికిత్సల సంఖ్యలో మార్పులు ఉండవచ్చు.

బరువు తగ్గడంలో ఆక్యుపంక్చర్ వలన కలిగే దుష్ప్రభావాలు :

ఆక్యుపంక్చర్ చేయించుకోవాలని నిర్ణయించుకున్న సమయంలో దృష్టి సారించాల్సిన మొదటి విషయం, మీ ఆక్యుపంక్చరిస్టు సర్టిఫైడ్ అయి ఉండాలి. మరియు అనుభవజ్ఞులై ఉండాలి. లేనిచో కొన్ని దుష్ప్రభావాలు తలెత్తడం జరుగుతుంది. అవయవాలు దెబ్బతినడం, అంటు వ్యాధులు కేంద్ర నాడీ వ్యవస్థ సమస్యలు, మరియు ఊపిరితిత్తుల సమస్యలు, అలసట, పుండ్లు, చర్మ సమస్యలు, కొన్ని మానసిక సమస్యలు ఆక్యుపంక్చర్ యొక్క ఇతర దుష్ప్రభావాలుగా ఉన్నాయి.

ఆక్యుపంక్చర్ యొక్క దుష్ప్రభావాలు మరియు ప్రతికూల ప్రభావాల గురించి మరింత తెలుసుకోవడం ద్వారా, మీ శరీరం మరియు మానసిక అంశాల మీద జాగ్రత్త వహించవచ్చు.

చివరిగా ....

బరువు తగ్గడం కోసం ఆక్యుపంక్చర్ సమర్థవంతమైన కొలమానమా ? అంటే, అవును అనే చెప్పాలి. అయితే, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మరియు సరైన జీవనశైలిని కొనసాగించడంతో పాటుగా, వ్యాయామాన్ని కూడా క్రమం తప్పక అనుసరించవలసి ఉంటుంది. అధ్యయనాల ప్రకారం, మీ జీవక్రియలను మెరుగుపరచడం ద్వారా మీరు బరువు కోల్పోవటానికి (ముఖ్యంగా పొట్ట చుట్టూ చేరిన చెడు కొవ్వును తొలగించడంలో సహాయం చేస్తుంది). ఎంపికను పరిగణనలోనికి తీసుకోడానికి ముందుగా, దాని లాభ నష్టాలను మీ వైద్యునితో పూర్తి స్థాయిలో చర్చించండి. మరియు ముఖ్యంగా, లైసెన్స్ కలిగిన మరియు బాగా శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన ప్రాక్టీషనర్ని ఎంచుకోండి. మరియు ఆక్యుపంక్చర్ విధానంలో కేవలం చెవి దగ్గర మాత్రమే కాకుండా, మీ ఆరోగ్య పరిస్థితుల ప్రకారం దేహంలో పలుచోట్ల పలువిధానాలను అనుసరించవలసి ఉంటుంది. వాటిలో ముఖ్యంగా చెవి దగ్గర పాటించే విధానం బరువు తగ్గడంలో కీలకంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి.

అంతేకాకుండా ఆక్యు ప్రెషర్, ఆక్యు పంక్చర్ విధానాలు ఒకటి కాదని గుర్తుంచుకోండి. ఆక్యు ప్రెషర్ కొన్ని స్థానాల మీద ఒత్తిడిని కలగజేయడం ద్వారా, జీవక్రియలు సవ్యంగా సాగడంలో సహాయం చేస్తుంది, మరియు మానసిక స్థితిగతులను మెరుగుపరచడానికి ఎక్కువగా సహాయం చేస్తుంది. క్రమంగా ఆక్యుప్రెషర్ సంబంధిత చెప్పులు, పరికరాలు మార్కెట్లో దర్శనమిస్తుంటాయి. కానీ ఆక్యుపంక్చర్ విధానంలో సూదులతో గుచ్చడం ద్వారా చికిత్సను అనుసరించవలసి ఉంటుంది. ఆ సూదులు కూడా ప్రత్యేకించి తయారుచేయబడుతాయి, మరియు వాటిని ఉపయోగించే విధానంలో కూడా మెళకువలు పాటించవలసి ఉంటుంది. కావున, ప్రాక్టిషనర్ ఎంపికలో నిర్ణయం సరిగ్గా ఉండాలని గుర్తుంచుకోండి. క్రమంగా ప్రాక్టిషనర్ ఎంపికలో నలుగురితో సంప్రదించి ముందుకు సాగడం మంచిది.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Does Acupuncture Really Help In Weight Loss?

Acupuncture (ear) is an effective method for weight loss. It increases your metabolism, thereby reducing appetite and affecting the part of the brain that feels hunger.
Story first published: Thursday, March 14, 2019, 13:00 [IST]