For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

International Yoga Day 2021 : యోగాలో కీలక ఆసనాలు.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు...!

|

మన దేశం కనిపెట్టిన యోగాకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. మనిషి చేయగలిగే అత్యుత్తమ వ్యాయామాల్లో యోగా ప్రథమ స్థానాన్ని సైతం సంపాదించుకుంది.

ఏ వ్యాయామంతో పోల్చి చూసిన యోగా చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఎందుకంటే యోగా అనేది కేవలం మన బాడీపైనే కాదు.. మన మెదడు మరియు ఆత్మ అన్నింటిని శుద్ధి చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

ప్రస్తుతం కరోనా వంటి కాలంలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోడానికి మరియు ఆరోగ్యంగా ఉండాలనుకునేవారంత యోగావైపే చూస్తున్నారు. ఈ సందర్భంగా యోగాలు ఎన్ని రకాలున్నాయి.. ఎలాంటి ఆసనాలు సులభంగా వేయొచ్చు..

ఎవరెవరు ఎలాంటి యోగసనాలు వేస్తే మంచి ప్రయోజనాలుస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

International Yoga Day 2021: యోగాను ప్రపంచానికి పరిచయం చేసిందెవరో తెలుసా...International Yoga Day 2021: యోగాను ప్రపంచానికి పరిచయం చేసిందెవరో తెలుసా...

భుజంగాసనం..

భుజంగాసనం..

ఈ ఆసనంలో భాగంగా రెండు అరచేతులను భూమిని ఉంచి, చాతిని పైభాగంలో ఉంచి గాలి పీలుస్తూ తలను చాతిపైకి నిదానంగా పైకెత్తాలి. పది నుండి ఇరవై నిమిషాల పాటు ఇలా గాలి పీలుస్తూ, వదులుతూ నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఇలా మీ సామర్థ్యం మేరకు మీరు ప్రతిరోజూ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఒక అర నిమిషం పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఈ ఆసనాన్ని రెగ్యులర్ గా చేయడం వల్ల కొవ్వు సులభంగా తగ్గిపోతుంది. స్త్రీలలో గర్భాశయ శుద్ధి జరిగి గర్భాశయంలోని గడ్డలు కరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ వెన్నెముక కూడా బలపడుతుంది.

వృక్షాసనం..

వృక్షాసనం..

యోగా ఆసనాల్లో సులభమైన భంగిమల్లో ‘వృక్షాసనం' ఒకటి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఈ ఆసనాన్ని ప్రారంభించాలి. ఈ ఆసనం చేసే ముందు మీరు ఖాళీ కడుపుతో ఉండాలి. అప్పుడే మీరు బరువు తగ్గేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ ఆసనాన్ని ఒంటి కాలి మీద నిలబడి, మీ చేతులను పైకెత్తాలి. మీ శక్తి ఉన్నంత వరకు నిలబడాలి.

ఒంటె భంగిమ..

ఒంటె భంగిమ..

యోగా చేయడం వల్ల బరువు సులభంగా, వేగంగా తగ్గాలనుకునేవారు ఈ యోగాసనం వేస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఈ యోగా వ్యాయామం ఎలా చేయాలంటే మీ పొట్ట, నడుము, ఛాతీ మరియు భుజాలు మీద ఒత్తిడి పెంచాలి. అప్పుడు మీ బరువు తగ్గిపోయేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది.

ధనురాసం..

ధనురాసం..

ధనుస్సును పోలి ఉన్న ఈ ఆసనాన్ని ధనురాసనం అంటారు. ఈ ఆసన ప్రక్రియ కొద్దిగా క్లిష్టంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రారంభంలో అందరూ చేయలేరు. పూర్తి ఆసన స్థితిని కాకుండా మొదట సులభమైన స్థితిని ప్రయత్నించి, సాధన తరువాత పూర్ణస్థితిని చేరుకోవచ్చు. రాలేదు అని అనుకోకుండా మొదట అర్ధ ధనురాసనమును ప్రయత్నించి తరువాత పూర్ణ ధనురాసనం చేయవచ్చు. ఉదరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ ఎక్కువ జరిగి, అన్ని అవయవాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.

కోణాసనం..

కోణాసనం..

ఈ ఆసనంలో మీరు నిటారుగా నిలబడాలి. ముందుగా ఒక చేయిని పైకెత్తి.. ఒకవైపుకు బెండ్ అవ్వాలి. అలా మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు చేయాలి. ఆ తర్వాత రెండు చేతులు పైకెత్తి జోడించాలి. అప్పుడు ఓ వైపుకు మీ బాడీని వంచాలి. ఇలా చేయడం వల్ల మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలగనున్నాయి.

హస్తపాదాసనం..

హస్తపాదాసనం..

ఈ ఆసనంలో భాగంగా మీరు ముందుగా నిటారుగా నిలబడాలి. మీ బరువును రెండు పాదాలకు సమానంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ముందుగా ఊపిరి పీల్చుకోండి. మీ చేతులను ఓవర్ హెడ్ వరకు విస్తరించండి. నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ.. పాదాల వైపు ముందుకు కిందకు బెండ్ అవ్వాలి. ఈ భంగిమలో 20 నుండి 30 సెకన్ల పాటు ఉండి, లోతైన శ్వాస తీసుకోండి. ఆ తర్వాత మీ కాళ్లు మరియు వెన్నెముక నిటారుగా ఉంచాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల మీకు ఒత్తిడి తగ్గుతుంది.

English summary

Different Types Of Yoga Asanas And Their Benefits in Telugu

Here are the different types of yoga asanas and their benefits in Telugu. Have a look