For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL 2022:యోయో టెస్టు అంటే ఏమిటి? ఎవరెవరు ఎంత స్కోరు సాధించారంటే...

|

ఐపిఎల్ క్రికెట్ అంటేనే అందరికీ సిక్సర్ల హోరు.. బౌండరీల జోరు.. కళ్లు చెదిరే క్యాచులు.. రెప్పపాటులో పడే వికెట్లు ఛీర్ గర్ల్స్ టక్కున గుర్తొస్తాయి.

అయితే ఈ క్రికెట్ గేమ్ లో నిలదొక్కుకోవాలన్నా.. ఎక్కువ కాలం మైదానంలో నిలబడాలన్నా.. ఫిట్ నెస్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే బ్యాట్ తో బంతిని బలంగా బాదాలన్నా.. బాల్ తో బ్యాట్స్ మెన్ లను బోల్తా కొట్టించాలన్నా.. రోప్ ల దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నా.. మైదానంలో పాదరసంలా కదలుతూ ఉండాలన్నా.. వికెట్ల మధ్య చిరుతపులిలా వేగంగా పరుగెత్తాలన్నా.. చాలా యాక్టివ్ గా ఉండాలి.

అందుకే ప్రపంచంలోని ప్రతి ఒక్క క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు గేమ్ తో పాటు వారి ఫిట్నెస్ ను టెస్టు చేస్తుంటాయి. వాటిని బట్టే వారి బ్యాటింగ్ సామర్థ్యానికి మరియు బౌలింగ్ నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇస్తుంటాయి.

ఈ నేపథ్యంలో యో-యో టెస్ట్ అనేది ఆటగాళ్ల ఫిట్నెస్ ను తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. దీన్ని కేవలం క్రికెట్లోనే కాకుండా ఇతర క్రీడల్లోనూ వినియోగించుకుంటున్నారు. యోయో టెస్టు అంటే ఒక రకమైన ఎరోబిక్ ఎక్సర్ సైజ్. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఆటగాళ్ల సామర్థ్యం, వేగం, ఇతర విషయాలను నిర్ధారిస్తారు.

ఇంతకుముందు జాతీయ క్రికెట్ అకాడమీలో కొందరు ప్లేయర్లకు ఈ టెస్టు నిర్వహించగా.. వారిలో ఢిల్లీ ప్లేయర్ ప్రుద్వీ షా ఫెయిల్ అయ్యాడట. మరోవైపు కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాపర్ గా నిలిచాడట. విరాట్ కోహ్లీ కంటే మెరుగైన స్థానంలో ఉన్నాడట. ఈ సందర్భంగా ఐపీఎల్ లో పాల్గొనే క్రీడాకారుల్లో ఏయే ప్లేయర్లు ఎంత ఫిట్ గా ఉన్నారు.. ఎంత ర్యాంకు సాధించారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

టైటాన్స్ కెప్టెన్ టాప్..

టైటాన్స్ కెప్టెన్ టాప్..

ఐపిఎల్ లో కొత్త టీమ్ గుజ్జు గల గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య యోయో టెస్టులో 19 స్కోరును సాధించాడట. అద్భుతమైన ఆల్ రౌండర్ గా పేరు సంపాదించుకున్న హార్దిక్ మైదానంలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ ఎలా అయితే ఫిట్నెస్ కు ప్రియారిటీ ఇస్తారో తను కూడా అలాగే జాగ్రత్త పడతాడట.

కింగ్ కోహ్లీ..

కింగ్ కోహ్లీ..

క్రికెట్ కింగ్, రన్నింగ్ మషిన్ గా పేరు సంపాదించుకున్న విరాట్ కోహ్లీ టీమిండియాలో అడుగుపెట్టినప్పటి నుండి ఫిట్నెస్ పై ఎంత కేర్ తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈసారి బెంగళూరు టీమ్ కెప్టెన్సీ నుండి తప్పుకున్న కోహ్లీ యోయో టెస్టులో 19 మార్కులను సాధించాడు.

జడ్డూ..

జడ్డూ..

మహేంద్ర సింగ్ ధోనీ అకస్మాత్తుగా కెప్టెన్సీ నుండి తప్పుకోవడంతో అనూహ్యంగా చెన్నై సారథ్య బాధ్యతలు చేపట్టిన రవీంద్ర జడేజా యోయో టెస్టులో స్కోరును 19 దాకా సాధించాడు. గ్రౌండ్లో చిరుతలా పరుగెత్తి.. బంతిని బలంగా బాదుతాడు.. బౌలింగులోనూ బ్యాట్స్ మెన్లను బోల్తా కొట్టించే జడ్డూ ఫిట్నెస్ విషయానికొచ్చేసరికి చాలా కేరింగ్ తీసుకుంటాడట.

మనీష్ పాండే..

మనీష్ పాండే..

సన్ రైజర్స్ హైదరాబాద్ లో కీలక ఆటగాడైన మనీష్ పాండే ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడట. ఈ ఆటగాడు యోయో టెస్టులో జడ్డూ, హార్దిక్, కోహ్లీని అధిగమించాడట. వారి కంటే కొంచెం ఎక్కువగా అంటే 19.2 మార్కులను సాధించాడట.

ఇంకా ఎవరంటే..

ఇంకా ఎవరంటే..

మనీష్ పాండేతో పాటు యోయో టెస్టులో 19.2 స్కోరును సాధించిన వారిలో దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబాడా కూడా ఉన్నాడు. చెన్నై తరపున బరిలోకి దిగుతున్న శ్రీలంకకు చెందిన మహేష్ తీక్షణ కూడా ఇదే స్కోరును సాధించగా.. ఇంగ్లాంగ్ బ్యాటర్ బెయిర్ స్టో ఈ జాబితాలో అందరి కంటే టాపర్ గా నిలిచాడు. తన స్కోరు ఏఖంగా 21.8గా ఉండటం గమనార్హం.

English summary

IPL 2022: Check out fittest cricketers and their yo-yo test scores

Here we are talking about the IPL 2022: Check out fittest cricketers and their yo-yo test scores. Have a look
Story first published: Saturday, March 26, 2022, 18:07 [IST]
Desktop Bottom Promotion