For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Neeraj Chopra Diet Plan:నీరజ్ చోప్రా ఆహారంలో ఇవి కచ్చితంగా ఉండాల్సిందే... ఎందుకో మీరే చూడండి...

టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా డైట్ ప్లాన్, ఆహారపు అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

|

టోక్యో ఒలింపిక్స్ లో భారతదేశం తరపున ఏకైక గోల్డ్ మెడల్ సాధించి కోట్లాది మంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. అంతేకాదు ఈ పతకాన్ని మిల్కాసింగ్ కు అంకితమిచ్చాడు.

Neeraj Chopra Diet Plan: Eating Habits of Tokyo Olympics Gold Medalist in Telugu

దీంతో నీరజ్ ను అందరూ మరింత మెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో నీరజ్ చోప్రాను అందరూ ఆకాశానికెత్తుతూ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్, ప్రధాని మోడీతో పాటు సినిమా స్టార్లు, స్పోర్ట్స్ స్టార్లు తనకు అభినందనలు తెలిపారు.

Neeraj Chopra Diet Plan: Eating Habits of Tokyo Olympics Gold Medalist in Telugu

ఈ నేపథ్యంలో నీరజ్ వ్యక్తిగత సమాచారం గురించి చాలా మంది అన్వేషించారు. ఈ సందర్భంగా క్రీడలతో సంబంధం ఉన్న వ్యక్తులు నీరజ్ చోప్రా డైట్ అండ్ ఫిట్ నెస్ పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఒక అథ్లెట్ కావాలంటే తన ఫిట్ నెస్ తో పాటు ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నీరజ్ చోప్రా కూడా ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకునేవాడు. ఈ సందర్భంగా ఒలింపిక్స్ ఛాంపియన్ నీరజ్ రెగ్యులర్ ఏమి తింటాడు.. తన డైట్ అండ్ ఫిట్ నెస్ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Neeraj Chopra:'నీరజ్ నీకిదే మా సలామ్.. వందేళ్ల కలను సాకారం చేశావు'Neeraj Chopra:'నీరజ్ నీకిదే మా సలామ్.. వందేళ్ల కలను సాకారం చేశావు'

బ్రెడ్ ఆమ్లెట్..

బ్రెడ్ ఆమ్లెట్..

ఒలింపిక్స్ పసిడి వీరుడు నీరజ్ చోప్రాకు ఆమ్లెట్ అంటే చాలా ఇష్టమట. తను ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో బ్రెడ్ ఆమ్లెట్ ను తింటాడట. కొన్నిసార్లు ఎక్కువగా ఇదే ఫుడ్ తింటాడట. జిమ్ కు వెళ్లే వారికి మరియు క్రీడాకారులకు ఆహారంలో గుడ్లు చాలా అవసరం. ఇది ప్రోటీన్ కు ప్రధాన వనరు. అలాగే ఎక్సర్ సైజ్ చేసిన తర్వాత తాజా పండ్ల రసం తాగేందుకు ఆసక్తి చూపుతాడట.

సాల్మన్ చేపలు..

సాల్మన్ చేపలు..

నీరజ్ చోప్రా ఇటీవల తన ఆహారంలో సాల్మన్ చేపలను చేర్చాడు. ఈ రకమైన చేపలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఐరన్, ప్రోటీన్, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు ఇందులో కనిపిస్తాయి. ఇది మన శరీరంలో కండరాల పునరుద్ధరణకు సహాయపడుతుంది. ఈ చేపల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, విటమిన్-బి3, బి1, బి12, సెలీనియం, యాంటీ డయాబెటక్, యాంటీ ఆక్సిడెంట్, ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మన రోగ నిరోధక శక్తిని కూడా బలంగా మారుస్తుంది.

స్వీట్ల విషయంలో..

స్వీట్ల విషయంలో..

సాధారణంగా స్వీట్లంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అయితే నీరజ్ చోప్రా మాత్రం ఈ విషయంలో కొంచెం శ్రద్ధగా ఉంటారు. తాను క్రీడల్లో పాల్గొనే ముందు వీటి జోలికి అస్సలు వెళ్లడట. అయితే ఏదైనా పోటీలలో గెలిచినప్పుడు మాత్రం కచ్చితంగా స్వీట్ తింటాడట. తను తినే తీపి పదార్థాలలో ఎక్కువగా చక్కెర మరియు నెయ్యి ఉంటే పదార్థాలనే ఎంపిక చేసుకుంటాడట. అవంటే బాగా ఇష్టంగా తింటాడట. నీరజ్ చోప్రా ఎక్కువగా చుర్మా తినడానికి ఆసక్తి చూపుతాడట. ఇవి తినడం వల్ల ఎముకలు మరింత బలపడతాయి.

పానీ పూరి..

పానీ పూరి..

నీరజ్ చోప్రాకు రెగ్యులర్ డైట్ ఫుడ్ తో పాటు కొన్నిరకాల జంక్ ఫుడ్ అంటే కూడా బాగా ఇష్టమట. అందులోనూ తనకు పానీపూరి అంటే భలే ఇష్టమట. ఇందులో అత్యధిక నీరు ఉందని మనందరికీ తెలిసిందే. దీని క్రస్టులో చాలా తక్కువ మొత్తంలో పిండి ఉపయోగించబడుతుంది. అంతేకాదు ఇది తింటే త్వరగా కడుపు నిండుతుంది. దీన్ని రెగ్యులర్ గా తినడం వల్ల ప్రత్యేకంగా ఎలాంటి హాని కూడా జరగదు.

చూశారు కదా ఒలింపిక్స్ వీరుడు నీరజ్ చోప్రా డైట్ ప్లాన్.. మీరు కూడా ఓ క్రీడాకారుడిగా మెరుగవ్వాలనుకుంటే మీరు తీసుకునే ఆహారంలో వీటిని చేర్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి. ఫిట్ గా ఉండండి. మీరు అనుకున్నది సాధించండి.

English summary

Neeraj Chopra Diet Plan:Eating Habits of Tokyo Olympics Gold Medalist in Telugu

Tokyo Olympics 2020: We bring you a closer look into the diet of champion javelin thrower Neeraj Chopra
Story first published:Monday, August 16, 2021, 10:02 [IST]
Desktop Bottom Promotion