For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సూర్య హీరోయిన్ సాయేషా సైగల్ డెలివరీ తర్వాత భారీగా బరువు తగ్గింది.. అదెలా సాధ్యపడిందంటే...

|

అమ్మ కావాలని ప్రతి ఒక్కడ ఆడవారు కోరుకుంటారు. తొమ్మిది నెలలు కన్నబిడ్డను కడుపులో మోసి తమ చేతుల్లోకి తీసుకున్న వెంటనే అప్పటివరకు పడిన కష్టాన్ని అంతా మరచిపోతుంది. అప్పటి నుండి తన జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. తాను బిడ్డకు జన్మనిచ్చిన సమయం నుండి బేబీ సంరక్షణలోనే సమయమంతా గడిచిపోతుంది.

ఈ నేపథ్యంలో తన బాడీ గురించి, పెరుగుతున్న బరువు గురించి పెద్దగా పట్టించుకోదు. దీంతో ప్రెగ్నెన్సీ సమయంలో పెరిగిన బరువు.. ఆ తర్వాత కూడా పెరుగుతూనే ఉంటుంది. అయితే డెలివరీ తర్వాత కూడా బరువు తగ్గొచ్చు... వీటన్నింటి సంగతి పక్కనెబడితే.. ప్రసవం తర్వాత బరువు పెరుగుతున్నామని వెంటనే వెయిట్ లాస్ వంటి ప్రయత్నాలు చేయకూడదు.

కనీసం నెలన్నర లేదా రెండు నెలల పాటు రెస్ట్ తీసుకోవాలి. ఇదే విషయాన్ని దక్షిణాది అందాల భామ సాయేషా సైగల్ కూడా చెబుతోంది. 'డెలివరీ తర్వాత బరువు తగ్గడం అంత సులభం కాదు. ఎక్సర్ సైజుపై ఎంత ఎక్కువ ఫోకస్ పెడితే..అంత మంచి ఫలితం ఉంటుంది. మీరు స్థిరంగా ఉండటం ద్వారా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క స్త్రీ అందంగా ఉండాలని కోరుకుంటుంది. ప్రతి ఒక్కరి బాడీ మరియు ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉంటుంది' అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

ఈ అందాల భామ గత సంవత్సరం జూన్ 25న ఓ పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది. సాధారణంగా ప్రసవం తర్వాత చాలా మంది అమ్మాయిలు బరువు పెరిగిపోతూ ఉంటారు. అయితే సాయేషా సైగల్ కేవలం ఒక్క ఏడాదిలోనే ప్రసవం తర్వాత భారీగా బరువు తగ్గింది. ఎందుకంటే తను ఎప్పుడూ ఫిట్ నెస్ పై ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. ఈ సందర్భంగా ప్రసవం తర్వాత బరువు ఎలా తగ్గొచ్చు.. ఎలాంటి వర్కవుట్లు చేస్తే వెయిట్ లాస్ ఈజీగా మారుతుంది.. మీరు కూడా డెలివరీ తర్వాత బరువు తగ్గాలనుకుంటే..సాయేషా డైట్ అండ్ ఫిట్ నెస్, వర్కవుట్లను ఫాలో అవ్వండి.. సులభంగా బరువు తగ్గిపోండి.

అంత ఈజీ కాదు..

అంత ఈజీ కాదు..

దక్షిణాది అందాల భామ సాయేషా ఇటీవల ఆర్య జిమ్ లో వివిధ రకాల వ్యాయామాలు చేస్తున్న ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకున్నారు. అయితే డెలివరీ తర్వాత వెయిట్ లాస్ అవ్వడం అంత ఈజీ కాదని చెబుతోంది ఈ అమ్మడు.

తొందరపడొద్దు..

తొందరపడొద్దు..

డెలివరీ తర్వాత ఒకేసారి వెయిట్ లాస్ అవ్వాలనే ప్రయత్నాలు అస్సలు చేయకూడదని చెబుతోంది ఈ బ్యూటీ. యోగా నిపుణులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో 9 నెలల పాటు మహిళల బాడీలో అనేక మార్పులు జరుగుతాయి. అవి తిరిగి మామూలు స్థితికి రావాలంటే కొంత సమయం పడుతుంది.

శరీరాన్ని బట్టి..

శరీరాన్ని బట్టి..

డెలివరీ తర్వాత వెయిట్ లాస్ అయ్యేందుకు కొందరికి 9 నుండి 12 సంవత్సరాల సమయం పడుతుంది. మరికొందరికి ఇంకా కాస్త ఎక్కువ సమయమే పట్టొచ్చు. ఈ నేపథ్యంలో మీ బాడీ ఎక్సర్ సైజ్ చేసేందుకు అనుకూలంగా ఉంటేనే మీరు వెయిట్ లాస్ ప్రయత్నాలు చేయాలి.

ఆ సామర్థ్యాన్ని పెంచుకోవాలి..

ఆ సామర్థ్యాన్ని పెంచుకోవాలి..

మీరు డెలివరీ అయిన తర్వాత బరువు తగ్గేందుకు అవసరమైన శారీరక, మానసిక సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అందుకే డెలివరీ తర్వాత కనీసం 40 రోజుల వరకు ఎలాంటి వ్యాయమాలు చేయకూడదు. ఈ సమయంలో వర్కవుట్లు చేసేలా మీ బాడీని రెడీ చేసుకోవాలి. అదే సమయంలో తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గాలనుకోవడం కూడా ఏ మాత్రం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి మెల్లగా బరువు తగ్గేందుకు ప్రాధాన్యమివ్వాలి.

వైద్యుల సలహా..

వైద్యుల సలహా..

డెలివరీ తర్వాత మీరు రెస్ట్ తీసుకునే సమయం పూర్తయ్యాక.. వ్యాయమాలు చేయొచ్చు. అయితే బరువు తగ్గాలనుకుంటే మాత్రం వైద్యుల సలహా మేరకు ముందుకు పోవాలి. మీ బాడీ ఎక్సర్ సైజ్ చేసేందుకు సిద్ధంగా ఉంటేనే మీరు ఈ విషయంలో ముందడుగు వేయాల్సి ఉంటుంది. ఎప్పుడు, ఎంత మేరకు వ్యాయామం చేయాలో కూడా మీ బాడీ మీకు సంకేతాలు ఇస్తుంది.

నెమ్మదిగా వాకింగ్..

నెమ్మదిగా వాకింగ్..

డెలీవరి తర్వాత బరువు తగ్గాలనే ఉద్దేశ్యంతో వేగంగా వాకింగ్ చేయకండి. ముందుగా నెమ్మదిగా ప్రారంభించండి. ఆ తర్వాత మీడియం స్పీడ్ లో వాకింగ్ చేయండి. మీ పొట్టను తగ్గించుకోవాలనే లక్ష్యంతో మాత్రం కాకుండా.. కేవలం ఎక్కువ బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయండి.

డెలివరీ తర్వాత బరువు తగ్గేందుకు కనీసం ఎంత కాలం విశ్రాంతి తీసుకోవాలి?

ప్రసవం తర్వాత బరువు పెరుగుతున్నామని వెంటనే వెయిట్ లాస్ వంటి ప్రయత్నాలు చేయకూడదు. కనీసం నెలన్నర లేదా రెండు నెలల పాటు రెస్ట్ తీసుకోవాలి. యోగా నిపుణులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో 9 నెలల పాటు మహిళల బాడీలో అనేక మార్పులు జరుగుతాయి. అవి తిరిగి మామూలు స్థితికి రావాలంటే కొంత సమయం పడుతుంది.

English summary

South Indian Actress Sayesha Saigal Lose weight after Childbirth

Here we are talking about the South Indian Actress Sayesha Saigal lose weight after childbirth. Have a look