Latest Updates
-
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా.. -
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.? -
భక్తులకు అలర్ట్.. పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. రద్దీలో మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి.? -
రోజూ 20 నిమిషాలు చాలు.. ఈ సింపుల్ యోగాసనాలతో మీ రోజు మారిపోతుంది.! -
2వ తరగతి హిందూ విద్యార్థికి 'కల్మా' హోంవర్క్..హైదరాబాద్ లో ముస్లిం టీచర్ చేసిన పనికి.. -
కుబేరుడి అనుగ్రహం కావాలా? ఆఫీసులో ఈ దిశగా కూర్చుంటే అదృష్టం మీ వెంటే! -
గాలిలో అధిక తేమ బీపీని పెంచుతుందా.?.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలివే.!
Summer exercising tips: ఎండాకాలంలో వ్యాయామం చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
వేసవికాలంలో వ్యాయామం చేయాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి నియమాలు పాటిస్తే సమ్మర్‌లో వర్కవుట్స్ సాఫీగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వర్కవుట్స్ కాలంతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా చేయాల్సిందే. చలికాలమైనా, ఎండాకాలమైనా శరీరానికి ఎప్పుడూ తగిన శ్రమ కల్పించినప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. అయితే చాలా మంది చలికాలం రాగానే జిమ్‌లకు వెళ్లడం ప్రారంభిస్తారు, కండలు పెంచాలని వర్కవుట్స్ చేసేస్తుంటారు, ఉదయమే లేచి బ్యాడ్మింటన్ లాంటివి ఆడుతుంటారు. అయితే చలికాలంలో కండలు పెంచాలనుకునే వారు జిమ్ లకు వెళ్తే.. ఎండాకాలంలో బరువు తగ్గాలనుకునే వారు జిమ్‌లకు వెళ్తారని అనుకుంటారు.

ఏది ఏమైనా మీరు సమ్మర్ లో వ్యాయామాలు చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఔట్ డోర్ వర్కవుట్స్ చేసే వారు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే అన్ని రకాలుగా వ్యాయామం సాఫీగా సాగిపోతుంది.
వేసవికాలంలో వ్యాయామం చేయాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి నియమాలు పాటిస్తే సమ్మర్‌లో వర్కవుట్స్ సాఫీగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సరైన దుస్తులు ఎంచుకోవాలి:
ఎండాకాలంలో చెమట ఎక్కువగా వస్తుంది. అందుకే వీలైనంత సౌకర్యంగా ఉండే దుస్తులు ధరించాలి. కాటన్ దుస్తులు అయితే చెమటను పీల్చుకుంటాయి. చాలా మంది కాటన్ దుస్తులు వేసుకోవాలని చెబుతుంటారు. అయితే కాటన్ దుస్తులు చెమటను పీల్చుకుని బరువుగా మారతాయి. అందుకే వదులుగా ఉండే దుస్తులు ధరించి ఎప్పటికప్పుడు చెమటను తుడుచుకోవాలి.

హైడ్రేట్‌గా ఉండాలి:
శరీరంలో 50-70 శాతం నీరు ఉంటుంది. వేసవిలో శరీరం సరిగ్గా పని చేయడానికి నీరు చాలా అవసరం. శరీరం నుండి వ్యర్థాలు చెమట, మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతుంది. అలా శరీరంలో నీరు తగ్గుతుంది. దానిని భర్తీ చేయకపోతే డీహైడ్రేషన్ కు గురవుతాం. అలా కావొద్దంటే రోజూ తగినంత నీరు తాగాలి. చేసే పనిని బట్టి నీరు తాగుతుండాలి.
వ్యాయామం చేసేటప్పుడు కూడా మధ్య మధ్యలో నీరు తాగుతుండాలి. వికారం, వాంతులు, మూత్రపిండ వైఫల్యం వంటి డీహైడ్రేషన్ యొక్క కొన్ని తీవ్రమైన ప్రభావాలను నివారించడానికి ఇది సాయం చేస్తుంది.

శరీరం చెప్పేది వినాలి:
ఎండాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండ వేడిమిని తట్టుకోవడం కొంత మందికి చాలా కష్టంగా ఉంటుంది. మీరు వ్యాయామం చేస్తున్నప్పుడైనా శరీరం చూపించే కొన్ని సూచనలను చాలా జాగ్రత్తగా గమనించాలి. విపరీతమైన దాహం, వికారం, తిమ్మిర్లు, నోరు పొడిబారడం లాంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే వర్కవుట్స్ ఆపేసి చల్లని ప్రదేశంలో కాసేపు సేదతీరాలి. నిమ్మరసం, గ్లూకోజ్ వాటర్ లాంటివి తాగిన తర్వాత తిరిగి తేలికపాటి వర్కవుట్స్ చేయవచ్చు.

ఎక్కువ సేపు ఎండలో ఉండొద్దు:
వేసవి కాలంలో వేడి చాలా తీవ్రంగా ఉంటుంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలో ఉండకుండా జాగ్రత్త పడండి. ఆ సమయంలో సూర్యుడి వేడి అత్యంత ఎక్కువగా ఉంటుంది. సూర్యక్రాంతి నేరుగా పడే చోట వ్యాయామం చేయకపోవడం చాలా మంది. ఉదయం పూట, సాయంత్రం పూట కొద్ది సేపు ఎండలో వ్యాయామం చేసినా పర్లేదు. కానీ ఎక్కువసేపు చేయకూడదు. ఎండ తక్కువగా ఉన్నప్పుడు ఆరుబయట వ్యాయామం చేయడం ఉత్తమం.

వర్కవుట్స్ ముందు ప్రోటీన్ తినొద్దు:
లీన్ ప్రోటీన్ అనేది శక్తికి గొప్ప మూలం. అయితే వేడిలో వ్యాయామం చేసే ముందు ఇది మంచిది కాదు. వ్యాయామం చేసే ముందు ప్రోటీన్ తినడం వల్ల బేసల్ ఉష్ణోగ్రత పెరుగుతుందని సైన్స్ చెబుతోంది.
వ్యాయామం తర్వాత ప్రోటీన్ తీసుకోవడం మంచిది. దీని వల్ల కండర కణజాలం పునర్నిర్మితమవడంలో సహాయపడుతుంది. వ్యాయామానికి ముందు, వర్కవుట్స్ చేస్తున్నప్పుడు నీరు తాగడం మంచిది.



Click it and Unblock the Notifications