For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి రోజూ ఉదయం రెండు ఉడికించిన గుడ్లు తింటే బరువు తగ్గొచ్చంట!!

బరువు తగ్గడానికి ప్రతి రోజూ ఉదయం రెండు ఉడికించిన గుడ్లు తినండి!

|

బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇక్కడ ఒక శుభవార్త ఉంది. ఇప్పుడు బరువు తగ్గడం అల్పాహారం ఎంపికకు మారినంత సులభం. అల్పాహారంలో గుడ్లు తినే వారు చాలా చురుకుగా ఉంటారని మరియు రోజంతా బరువు తగ్గడానికి సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఓబేసిటి ఈ విషయాలను నివేదించింది. ఈ అధ్యయనం ప్రకారం వరుసగా ఐదు రోజులు ఉదయం అల్పాహారంలో రెండు గుడ్లు చొప్పున తిన్న వ్యక్తులు వెన్నరాసిన బన్ తినేవారి కంటే 65% బరువు తగ్గే అవకాశం ఉన్నట్లు కనుగొన్నారు.

Two boiled Eggs in the Morning Can Help You Lose Weight

నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (ఎన్‌సిబిఐ)అనే సంస్థ నిర్వహించిన మరో అధ్యయనంలో ఇదే ఫలితాలు వచ్చాయని తేలింది. ఈ పరిశోధనలో పాల్గొన్న వారు ఉదయం అల్పాహారంలో గుడ్డు తిన్న వారు , మధ్యాహ్నం మరియు రాత్రి భోజనంలో ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని తీసుకోవడం తగ్గించారని గుర్తించబడినది. ఆహారంలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల, బరువు తగ్గే ప్రమాణం సులభంగా పెరుగుతుంది. వాస్తవానికి, గుడ్డును అల్పాహారంగా తిన్న వారు వచ్చే ముప్పై ఆరు గంటలు అధిక కేలరీలున్న ఆహారాన్ని తీసుకోవడం తగ్గించారని గమనించబడింది.

ఇంతకూ అల్పాహారంలో గుడ్లు ఎందుకు? దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి

ఇంతకూ అల్పాహారంలో గుడ్లు ఎందుకు? దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి

సంతృప్తికరమైన ఆహారాల జాబితాలో గుడ్డు అధిక స్థానంలో ఉంది. ఈ ఆహారాలు తీసుకున్న తర్వాత రోజంతా పొట్ట నిండిన అనుభూతిని మీరు చెందుతారని దీని అర్థం. గుడ్లలో అతి తక్కువ క్యాలరీలు మరియు తక్కువ కొవ్వు మరియు ఎక్కువ శాతంలో ప్రోటీన్ ఉంటుంది. అంటే సుమారు ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. జతకు సుమారు తొమ్మిది రకాల ముఖ్యమైన అమైనో ఆమ్లాలు, అలాగే ఇనుము, సల్ఫర్, సెలీనియం, విటమిన్ ఎ, సి మరియు బి 12 వంటి ముఖ్యమైన పోషకాలు ఉత్తమ ప్రమాణంలో ఉన్నాయి.

ఇది చాలా ఆరోగ్యకరమైన ఆహారం

ఇది చాలా ఆరోగ్యకరమైన ఆహారం

ఇది చాలా ఆరోగ్యకరమైన ఆహారం మరియు ఇది ప్రపంచంలో అత్యంత సమృద్ధిగా, చౌకగా మరియు సులభంగా లభించే ఆహారాలలో ఒకటి. అల్పాహారం కోసం, గుడ్లను ఆమ్లెట్ రూపంలో తినవచ్చు, కానీ ఇతర రుచికరమైన పద్ధతుల ద్వారా కూడా తినవచ్చు.

గుడ్డు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భ్రమ?

గుడ్డు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భ్రమ?

గుడ్డు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భ్రమను మనం చాలా కాలంగా వింటున్నాం. కానీ వాస్తవానికి, ఆహారం నుండి పొందిన కొలెస్ట్రాల్‌కు శరీరానికి సంబంధించిన కొలెస్ట్రాల్‌తో సంబంధం లేదు. కాబట్టి గుడ్డులో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ, అది మన శరీరం ఉత్పత్తి చేసే కొలెస్ట్రాల్ స్థాయిని పెంచదు. మీ కొలెస్ట్రాల్ స్థాయి ఇప్పటికే ఎక్కువగా ఉంటే, మీరు పెద్ద మొత్తంలో గుడ్లు తినకూడదు.

క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ అందించిన డేటా ప్రకారం

క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ అందించిన డేటా ప్రకారం

క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ అందించిన డేటా ప్రకారం, ఏదైనా ఆహార నియంత్రణ ఆరోగ్యకరమైనది, మితిమీరి తింటే అది విషంగానే మారుతుంది. గుడ్డు విషయంలో కూడా అంతే, రోజుకు రెండు గుడ్లు అల్పాహారంలో తినడం ఆరోగ్యకరం. కానీ దీని కంటే ఎక్కువ తినకూడదన్న విషయం గుర్తుంచుకోండి.

ఒక వేళ మీకు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంటే

ఒక వేళ మీకు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంటే

ఒక వేళ మీకు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంటే, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించి, మీ అల్పాహారంలో సరైన మార్పు చేయండి.

English summary

Two boiled Eggs in the Morning Can Help You Lose Weight

Research has shown that eating eggs for breakfast can help fight weight gain all day long. In a study published by the International Journal of Obesity, researchers found that dieters who consumed two eggs for breakfast five days out of the week lost 65 percent more weight than dieters who consumed a bagel in the morning.
Story first published:Friday, November 15, 2019, 17:53 [IST]
Desktop Bottom Promotion