For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Vicky Kaushal:విక్కీ కౌశల్ లా ఫిట్ గా ఉండాలంటే.. ఇలా ట్రై చేయండి...!

|

బాలీవుడ్ హీరో, నటుడు విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ తో కలిసి మరికొన్ని గంటల్లో ఏడడుగులు నడిచి.. తనను మనువాడనున్నాడు. ఇందుకోసం రాజస్థాన్ లోని చారిత్రకమైన కోటలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. విక్కీ కౌశల్ తన నటనా నైపుణ్యంతోనే కాకుండా, మంచి ఫిట్ నెస్, వర్కౌట్లతోనూ తన అభిమానులను ఆకట్టుకుంటుకున్నాడు.

ప్రస్తుతం విక్కీ కౌశల్ తన పెళ్లి వల్ల ట్రెండింగ్ గా నిలబడ్డాడు. మరికొద్ది గంటల్లో కత్రినా కైఫ్ ను అధికారికంగా పెళ్లి చేసుకోనున్నాడు. వీరిద్దరినీ మనం గమనిస్తే.. ఇద్దరూ చాలా ఫిట్ గా ఉన్నారు. మనోడి కంటే కత్రినా నాలుగేళ్లు పెద్దది. అయినా వీరి ప్రేమ మధ్య వయసు ఏ మాత్రం సమస్య కాలేదు. అందుకే పెళ్లిపీటలెక్కేశారు. ఈ సందర్భంగా విక్కీ కౌశల్ తను ఈ వయసులోనూ ఫిట్ గా ఉండేందుకు ఎలాంటి వర్కౌట్లు చేస్తాడు.. తను ఎలాంటి డైట్ పాటిస్తాడనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

జిమ్ వర్కౌట్స్..

విక్కీ కౌశల్ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా జిమ్ లో చేసే వర్కౌట్ల సెషన్ల ఫొటోలు మరియు వీడియోలను షేర్ చేసుకుంటాడు. తను వెయిట్ ట్రైనింగ్, పుష్ అప్స్, ట్రెడ్ మిల్ రన్, బ్యాటిల్ రోప్స్ చేస్తూ కనిపించాడు. మసానలో తన నటనా జీవితం ప్రారంభించినప్పటి నుండి ఉరి - ది సర్జికల్ స్ట్రైక్ వరకు, తన శరీర పరివర్తన ఆశ్చర్యపరచడమే కాకుండా మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తుంది.

కార్డియో నుండి డెడ్ లిఫ్టుల వరకు..
విక్కీ కౌశల్ ప్రతిరోజూ జిమ్ నుండి తన దినచర్యను మొదలుపెడతారు. అందులో కార్డియో ట్రైనింగ్ నుండి డెడ్ లిఫ్టుల వరకు అన్నీ ఉంటాయి. ఇటీవల పోస్టులో తన ట్రైనర్ ముస్తఫా అహ్మద్ సహాయంతో బెంచ్ పై సిట్-అప్ లు చేస్తూ కనిపించాడు. ఇలాంటి వ్యాయామం చేయడం వల్ల పొత్తి కడుపు మాత్రమే కాకుండా మీ కోర్ కండరాలన్నీ బలంగా మారతాయి.

ఫుడ్ విషయంలోనూ కేర్ ఫుల్..
విక్కీ కౌశల్ అనునిత్యం అంత ఫిట్ గా ఉండేందుకు కారణం తన ఫుడ్ కూడా. ఎందుకంటే తన చాలా కఠినమైన డైట్ ను ఫాలో అవుతాడు. భారీ ట్రైనింగుతో పాటు సరైన ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటామని నమ్ముతాడు. అందుకే పోషకాలు ఎక్కువగా ఆహారం విషయంలో ఎప్పటికీ రాజీ అనేది పడడు. ఇటీవలే తన బ్రేక్ ఫాస్ట్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. 'ఇది చాలా రుచికరమైనది' అని రాశాడు. గుడ్లు, ఓట్స్, వేరుశనగ, వెన్న, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ మరియు చాలా చాక్లెట్లు అందులో కనిపించాయి.

స్వయంగా కష్టపడతాడు..
విక్కీ కౌశల్ కేవలం వెయిట్ లిఫ్టింగ్ మరియు కార్డియో వంటివే కాకుండా తరచుగా బ్రెజిలియన్ మార్షల్ ఆర్ట్స్ అయిన zynga Capoeira, డ్యాన్స్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ మరియు మరెన్నో వర్కౌట్లు చేస్తూ అందరినీ అలరిస్తున్నాడు. మీరు కూడా ఏదైనా పెళ్లిలో ఇతర కార్యక్రమాల్లో విక్కీ మాదిరిగా అందంగా మరియు ఫిట్ గా కనిపించాలనుకుంటే.. మీరు కూడా జిమ్ కి వెళ్లి తన వర్కౌట్స్ మరియు డైట్ ను ఫాలో అవ్వొచ్చు.

విక్కీ కౌశల్ ఏ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నాడు?

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్.. అందాల భామ.. కత్రినా కైఫ్ ను కళ్యాణం చేసుకోనున్నాడు. రాజస్థాన్ లోని చారిత్రక కోటలో పెళ్లి నిమిత్తం మూడు రోజుల వేడుకలను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు.

English summary

Vicky Kaushal's Fitness Regime in Telugu

Here we talking about Actor Vicky Kaushal fitness regime and workout plan for keeping his muscles tighter and core stronger. Read on.
Story first published: Tuesday, December 7, 2021, 20:44 [IST]