Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
ఈ డైట్ ఫాలో అయితే.. సంతానలేమి సమస్యకు చెక్.. ఫర్టిలిటీ సెంటర్లు అవసరమే లేదు..!
సంతానలేమి సమస్యలు ఇప్పుడు విపరీతంగా పెరిగిపోాయ్. అధికారిక మెడికల్ లెక్కల ప్రకారం 40 శాతం మందికి పిల్లలు కలగడం లేదని రిపోర్టులు వస్తున్నాయ్. సమస్య వుందని తెలియగానే చాలా మంది పదుల సంఖ్యలో ఆసుపత్రులకు తిరిగి లక్షలు ఖర్ఛు చేస్తున్నారు. ఒక్కో జంట సంతానలేమి సమస్యకు సుమారు 5 నుంచి 6 లక్షల వరకు ఖర్ఛు చేస్తున్నారంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మార్కెట్లో కూడా మీకు సంతానం కలిగేటట్లు చేస్తామని అనేక ఫర్టిలీటీ సెంటర్లు ఇబ్బడి ముబ్బడిగా యాడ్లు ఇస్తున్నాయ్. మందులతో, ల్యాబరేటరీలతో కాకుండా సహజంగా సంతానలేమి సమస్యను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఆహార అలవాట్లను, జీవన విధానాన్ని కొంత వరకు మార్చుకుంటే గనుక సంతానలేమి సమస్యను తగ్గించుకోవచ్చు.

అధిక బరువు పెరగడం కూడా సంతానలేమికి కారణంగా చెబుతున్నారు. బరువు ఎక్కువగా వుంటే ఈస్ట్రోజెన్ హార్మోన్ వున్నా పనిచేయకుండా అయిపోతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వుండడం వల్ల, ఈస్ట్రోజెన్ రెసిస్టెన్స్ వుండడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. బరువు ఎక్కువగా వున్న వారికి వీర్య కణాలు వంకరగా అయిపోతాయ్. సరైన పరిమాణంలో వీర్యం వుండదు. జీవిన విధానాన్ని మార్చుకుంటే న్యాచురల్ పద్ధతిలో ఈ సంతానలేమి సమస్యకు చెక్ పెట్టువచ్చు.
ఉదయం లేవగానే గ్యాప్ తీసుకుంటే లీటరునర నీళ్లు తాగి రెండు సార్లు మోషన్ వెళ్లే విధంగా చూసుకోవాలి. దంపతులిద్దరూ కాఫీ, టీలు తాగే అలవాటు వుంటే మానివేయాలి. కాఫీ టీలకు బదులుగా వెజిటేబుల్ జ్యూస్ లేదంటే పళ్ల రసాన్ని తీసుకోవాలి. ఈ జ్యూస్‌లు అటు మహిళలల్లో ఓవరీస్‌కు, ఇటు పురుషుల్లో టెస్టికల్స్‌ను మంచి పోషకాలను అందిస్తుంది. ఉదయం 7 నుంచి 9 మధ్యలో ఇలాంటి ఫ్రూట్ లేదంటే కూరగాయల జ్యూస్‌లను కచ్ఛితంగా తీసుకోవాలి.
జ్యూస్‌లు తాగిన తరువాత మొలకెత్తిన గింజలను తీసుకోవాలి. మొలకెత్తిన విత్తనాల్లో పోషకాలు మెండుగా వుంటాయ్. మెలకెత్తిన పెసర్లు, మొలకెత్తిన చెనగలను తీసుకోవాలి. గుప్పెడు మొలకెత్తిన పెసర్లు తింటే పోషకాలు కావలసినంతగా అందుతాయ్. రోజూ ఇలాగే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను తీసుకోవాలి. సంతానం కలిగే వరకు ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్ ను తినడం ఆపివేయాలి.
ఇక మధ్యాహ్నం భోజనంలో రెండు పుల్కాలను ఆకుకూరతో, మరో కూరగాయల కూరతో తీసుకోవాలి. సోయా చిక్కుడు గింజలను ఉడకబెట్టి కూరలో వేసుకొని తినడం వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయి పెరుగుతుంది. మధ్యాహ్నం అన్నాన్ని తినకుండా పుల్కాలు, ఆకుకూరలను మాత్రమే తీసుకోవాలి. దీంతో పాటు ఒక కప్పు పెరుగును తీసుకోవచ్చు.
సాయంత్రం 5 నుంచి 5.30 మధ్యలో ఒక గ్లాసు పళ్ల రసాన్ని తీసుకోవాలి. ఇక రాత్రి 7 నుంచి 7.30 మధ్యలో డ్రై ఫ్రూట్స్‌ను గుప్పెడంత తీసుకోవాలి. మీకు వీలు కలిగితే వీటిని ఉదయాన్నే నీళ్లల్లో నానబెట్టుకొని సాయంత్రం 7 గంటల సమయంలో తినవచ్చు. ఇలా చేయడం వల్ల పురుషుల్లో వీర్యకణాలు కూడా బాగా పెరుగుతాయ్.
ఇలా ఆహార నియమాలు పాటించడం వల్ల బరువు తగ్గడమే కాకుండా శరీరానికి కావాల్సిన పోషకాలు, సంతాన కలగడానికి కావాల్సిన పోషకాలు కూడా మెండుగా అందుతాయ్. బయట ఫర్టిలిటీ సెంటర్లకు లక్షలు ఖర్చు చేయకుండా ఇలా సహజమైన పద్ధతిని ఒక ఆరునెలలు పాటిస్తే 1 సంవత్సరం లోపే కచ్ఛితంగా మీకు సంతానం కలుగుతుంది. ఈ సహజమైన పద్ధతిలో కూడా ఫెయిల్ అయితే అప్పుడు ఔషదాల ద్వారా సంతానాన్ని కలిగించుకునే ప్రయత్నం చేయాలి. మంచి హార్మోనల్ డైట్ తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి నష్టం కలగదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











