Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఇదే జరిగితే మగజాతి అంతం ఖాయం.. ఎందుకంటే?
పెళ్లి అయిన ప్రతి జంట పండంటి బిడ్డను జన్మనివ్వాలని అనుకుంటారు. కొందరు ఆడబిడ్డను కోరుకుంటే, ఇంకొందరు మగబిడ్డను కోరుకుంటారు. అయితే భవిషత్తులో ఈ సమస్య ఉండకపోవచ్చని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పురుషులలోని Y-క్రోమోజోమ్ అంతరించే స్థాయికి వచ్చేసిందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకు ఈ Y-క్రోమోజోమ్‌లు అంతరించిపోతున్నాయి? దానికి గల కారణాలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం..
Y-క్రోమోజోమ్ అంటే ఏమిటంటే?
సాధారణంగా మహిళ గర్భం దాల్చగానే ఆడపిల్లా లేదా మగపిల్లా అనే చర్చ నడుస్తూ ఉంటుంది. అయితే ఆడపిల్లా లేదా మగపిల్లాడా అనేది నిర్ధారించేది క్రోమోజోమ్‌లు. ఆడవారిలో రెండు X క్రోమోజోమ్‌లు.. మగవారిలో ఒకటి X ఇంకోటి Y-క్రోమోజోమ్‌లు ఉంటాయి. స్త్రీ పురుషులు కలిసినప్పుడు రెండు X క్రోమోజోమ్‌లు కలిస్తే ఆడపిల్ల, ఒకటి X, ఒకటి Y-క్రోమోజోమ్ కలిస్తే మగపిల్లాడు పుడతాడు.

అయితే మగవారిలో Y-క్రోమోజోమ్ అంతరించిపోతుంది. గతంలో పోలిస్తే సన్నగా అయిపోవడంతో పాటు Y-క్రోమోజోమ్‌లోని జన్యున్లు కూడా తగ్గిపోతున్నాయని పరిశోధనలో తేలింది. భవిష్యత్తులో భూమిపై కేవలం ఆడపిల్లలు మాత్రమే పుట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. దీనికి గల కారణాలు ఏంటి? ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తుందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దీనికి కారణం ఏంటి?
గతంలో పోలిస్తే ఇప్పుడు పురుషుల్లో Y-క్రోమోజోమ్ సంఖ్య తగ్గుతోంది. మరికొందరిలో ఆ క్రోమోజోమ్ బలహీనంగా మారుతుంది. తాజాగా ఈ క్రోమోజోమ్‌లపై జరిపిన పరిశోధనలో గత 166 మిలియన్ సంవత్సరాల క్రితం Y-క్రోమోజోమ్‌లో 900 క్రియాశీల జన్యువులు ఉండేవట. కానీ ప్రస్తుతం కేవలం 45 మాత్రమే ఉన్నాయని ఆ పరిశోధనలో వెల్లడైంది. ఈ జన్యువుల సంఖ్య మరో 11 మిలియన్ సంవత్సరాల్లో సున్నాకు చేరుతుందని క్రమంగా పురుష జాతి అంతమయ్యే అవకాశం ఉందంటున్నారు.
మళ్ళీ జన్యువులు వస్తాయా?
ప్రముఖ జెనెటిక్స్ శాస్త్రవేత్త జెన్నిఫర్ మార్షల్ గ్రేవ్స్ క్రోమోజోములపై నిర్వహించిన పరిశోధనకు నాయకత్వం వహించారు. పురుషుల్లో క్రమంగా జన్యువుల సంఖ్య తగ్గుకుంటూ వస్తుందని అది వాస్తవమని పేర్కొన్నారు. అయితే Y-క్రోమోజోమ్‌లో జన్యువులు తగ్గినప్పటికీ.. మరో కొత్త జన్యువులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది కొంత వరకు ఊరటనిచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
Y క్రోమోజోములో 1438 జన్యువులు ఉంటాయి. కానీ కాలక్రమేణా ఇప్పటికీ వాటి సంఖ్య దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం 45 జన్యువులు మాత్రమే ఉన్నాయి. అలా ఆ 45 జన్యులు పోవడానికి కొన్ని వేల ఏళ్లు పడుతుంది.
జన్యువులు తగ్గిపోవడానికి కారణాలు ఇవే..
Y-క్రోమోజోమ్‌లో జన్యువులు తగ్గిపోవడానికి కారణం కూడా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా పురుషుల్లో వీర్యకణాలు వృషణాల్లో తయారవుతుంది. దీని కారణంగా తీవ్రమైన మ్యుటేషన్ జరుగుతుంది. ఈ మ్యుటేషన్ కారణంగా వృషణాల్లోని క్రోమోజోమ్‌లు బలహీనమవుతున్నాయని, క్రమంగా వాటిలోని జన్యువులు అంతరించిపోతున్నాయని చెబుతున్నారు. మనుషులు చేసే కొన్ని పనులు, వేడి వస్తువులు తినడం కూడా దీనికి కారణం అని చెబుతున్నారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీని శాస్త్రీయతను మేము నిర్ధారించలేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications