For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రైమరీ హెడ్ఏక్ కు తక్షణ ఉపశమనం కలిగించే సులభ చిట్కాలు

|

తలనొప్పి మన జీవిత కాలంలో ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే ఆరోగ్య సమస్య. ప్రతి ఒక్కరూ ఈ సమస్యకు గురి అవుతుంటారు. ముఖ్యంగా ఈ సమస్యకు కారణం మాత్రం ప్రస్తుత రోజుల్లో ఎక్కువ ఒత్తిడితో కూడిన పనులు, నిద్రలేమి, మరియు కుటుంబ సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు మరియు ఆరోగ్య సమస్యలు. కారణం ఏదైనా, ఈ టెన్షన్ తలనొప్పి వల్ల మన దైనందిన కార్యక్రమాలు, మరియు దినచర్యలకు అంతరాయం కలిగిస్తుంటుంది.

తలనొప్పి రెండు రకాలుగా ఉంటుంది. అందులో ప్రైమరీ హెడ్ ఏక్. ఇది తలలో ఎక్కువ నొప్పిని కలిగించేది, ఒత్తిడికి దారితీస్తుంది. దాని వల్ల తలనొప్పికి కారణం అవుతుంది. అందుకు ముఖ్యంగా ఆల్కహాల్, రెడ్ మీట్ , నిద్రలేమి అలవాట్లు మరియు ఒత్తిడినే ప్రధాణ కారణాలు. సెకండరీ హెడ్ ఏక్ -కణుతుల వంటి అంతర్లీన వ్యాధుల వల్ల తలనొప్పి.

పార్శ్వతలనొప్పి నివారణకు సహాయపడే 8 యోగాసనాలు:క్లిక్ చేయండి

ప్రైమరీ హెడ్ ఏక్ అనేది ప్రతి రోజూ ఏదో ఒకరకంగా ఎదుర్కొంటున్న సమస్య, ముఖ్యంగా టెన్షన్ వల్ల. ఈ టెన్షన్ వెంటనే తగ్గించుకోవడానికి కానీ లేదా టెన్షన్ ఉన్న ప్రతి సారి డాక్టర్ ట్రీట్మెంట్ అవసరం కాని తీసుకోవడానికి కష్టమైనది. అందువల్ల ఈ టెన్షన్ హెడ్ ఏక్స్ తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలను తెలుసుకోవడం చాలా అవసరం.

మీకు తలనొప్పి కారణం అయ్యే ఆహారాలు: క్లిక్ చేయండి

తలనొప్పిని తగ్గించుకోవడానికి కొన్ని పద్దతులు అంటే యోగా వెళ్లడం వల్ల టెన్షన్ ను మ్యానేజ్ చేయవచ్చు మరియు ఒత్తిడి తగ్గించుకోవచ్చు. టెన్షన్ వల్ల వచ్చే హెడ్ ఏక్ తక్షణం తగ్గించుకోవడానికి ఇటువంటి సులభమైన చిట్కాను లేదా మార్గాన్ని అనుసరించాలి. ప్రైమరీ హెడ్ ఏక్ ను తగ్గించుకోవడానికి మరికొన్ని సులభమైన మార్గాలు మీకోసం...

నీళ్ళు:

నీళ్ళు:

తలనొప్పికి ప్రధాన కారణం డీహైడ్రేషన్. కాబట్టి, తలనొప్పికి మాత్రమింగే ముందు ఎక్కువగా నీళ్ళు త్రాగి డిఫరెన్స్ ను మీరే గమనించండి.

తలకు మసాజ్ చేయడం:

తలకు మసాజ్ చేయడం:

టెన్షన్ తో వచ్చే తలనొప్పి నివారణకు తలస్నానం మరియు తలకు మసాజ్ చేయడం వంటివి చాలా మంచిది. టెన్షన్ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించుకోవడానికి ఇది ఒక ఉత్తమ మార్గం. దీనికి ఒక బేసిక్ ఐడియా ఏంటంటే, మీ అంతట మీరు విశ్రాంతిపొందడం.

మెడ, భుజాలను మసాజ్ చేయడం:

మెడ, భుజాలను మసాజ్ చేయడం:

ఇంట్లో ఎవరితోఅయినా మెడ, మరియు భుజాలను మసాజ్ చేయించుకోవడం. ఇలా చేయడం వల్ల తలలో బ్లడ్ సర్కులేషన్ మెరుగుపడి, తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

ముక్కును మసాజ్ చేయడం:

ముక్కును మసాజ్ చేయడం:

చాలా సున్నితంగా ముక్కును మసాజ్ చేయడం వల్ల , టెన్షన్ తో వచ్చే మైగ్రేన్ తలనొప్పిని నివారించుకోవచ్చు.

కాఫీ:

కాఫీ:

తలనొప్పిని నివారించుకోవడానికి, మరో సులభ మార్గం ఇది. వేడిగా కాఫీ త్రాగడం వల్ల తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు . అయితే ఎక్కువగా తీసుకుంటే మాత్రం డీహైడ్రేషన్ కు గురికాకతప్పదు.

బాదం:

బాదం:

తలనొప్పి నుండి ఉపశమనం కలిగించే మరో ఆహారం, బాదం. ఎందుకంటే వీటిలో ఉండే మెగ్నీషియం బ్లడ్ వెజల్స్ రిలాక్స్ అవ్వడానికి సహాయపడటంతో పాటు, తలనొప్పిని తగ్గిస్తాయి.

ఐస్ ప్యాక్:

ఐస్ ప్యాక్:

చలా చల్లగా ఉండే ఐస్ క్యూబ్స్ తీసుకొని ఫోర్ హెడ్ మీద మసాజ్ చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది . ఒత్తిడి మరియు టెన్షన్ తో వచ్చే తలనొప్పిని తగ్గించుకోవడానికి ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.

రిలాక్స్ టెక్నిక్స్:

రిలాక్స్ టెక్నిక్స్:

టెన్షన్ వల్ల వచ్చే తలనొప్పిని నివారించుకోవడానికి ఇది ఒక ఉత్తమ మార్గం. యోగ, మెడిటేషన్ మరియు ధ్యానం వంటి విశ్రాంతి పొందే టెక్నిక్స్ ను ఉపయోగించాలి.

హాట్ వాటర్:

హాట్ వాటర్:

హాట్ వాటర్ ప్యాక్ ను బాక్ నెక్ మీద ఉపయోగించడం వల్ల తలనొప్పిని తగ్గించుకోవడనాకి సహాయపడుతుంది. ఇది కండరాలు రిలాక్స్ అవ్వడానికి మరియు గుచ్చుతున్న నొప్పి తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.

తమలపాకులు:

తమలపాకులు:

టెన్షన్ హెడ్ ఏక్ తగ్గించుకోవడానికి ఇది ఒక ఉత్తమ మార్గం. తమలపాకులో కూలింగ్ లక్షనాలు అధికంగా ఉన్నాయి, కాబట్టి, ఇది చాలా తక్కువ సమయంలోనే తలనొప్పిని నివారిస్తుంది.

ఆరోమాథెరఫీ:

ఆరోమాథెరఫీ:

తలనొప్పిని నివారించడంలో కొన్ని రకాల సెంట్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ముఖ్యంగా ల్యావెండర్, చమోమెలి, మరియు రోజ్మెరీ ఆయిల్స్ వంటివి బాడీరిలాక్సేషన్ మరియు తలనొప్పిని నివారించడంలో ప్రభావం చూపుతాయని నిరూపించబడ్డాయి.

ఆపిల్స్:

ఆపిల్స్:

ఉదయం సమయంలో వీటిని తీసుకోవడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. గోరువెచ్చగా పాలు త్రాగిన తర్వత ఆపిల్ ను తీసుకోవడం వల్ల తలనొప్పిని మ్యానేజ్ చేయవచ్చు.

యూకలిప్టస్ ఆయిల్:

యూకలిప్టస్ ఆయిల్:

ఇది ఒక పెయిన్ రిలీఫ్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్నది. ఈ నూనెతో తల మరియు మెడను మసాజ్ చేయడం వల్ల ఇన్ స్టాంట్ రిలీఫ్ పొందవచ్చు.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

తలనొప్పిని నివారించడం కోసం ఈ మూలికను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దాల్చిన చెక్క పొడిని పేస్ట్ చేసి దీన్ని తలకు అప్లై చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది.

పెప్పర్ మింట్:

పెప్పర్ మింట్:

పుదీనాలో విశ్రాంతి పరిచే గుణగణాలు పుష్కలంగా ఉండటం వల్ల తలనొప్పి ట్రీట్మెంట్ లో దీన్ని ఉపయోగించడం చాలా సహాయకారిగా ఉంటుంది.

Desktop Bottom Promotion