Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
రక్తపోటును అడ్డుకొనే కొన్ని సహజ మార్గాలు
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులోనూ అధికంగా హైబీపీ, లోబీపికి గురిఅవుతున్నట్లు చాలా అధ్యాయాలు పేర్కొన్నాయి. సాధారణంగా ఆరోగ్యవంతుల రక్తపోటు సిస్టోలిక ప్రెషర్ 90 నుండి 120 మి.మీ గాను, డయాస్టోలిక బ్లడ్ ప్రెషర్ 60 నుండి 80 మి.మీగాను నమోదు కావచ్చు. అయితే ఈ బి.పి మనిషి నుండి మనిషికి వయస్సు పెరుగుతున్న కొద్దీ మార్పు చెందుతుంది. అలాగే సాధారణ వ్యక్తిలో రక్తపోటు ఉదయం నుండి సాయంత్రానికి కొన్ని మార్పులు చెందుతుంటుంది. మానసిక ఒత్తిడులు కూడా బి.పిని ప్రభావితం చేస్తాయి.
ముఖ్యంగా ఈమోడ్రన్ లైఫ్ స్టైల్ అనేక వ్యాధులతో సంబంధం కలిగి ఉంది. అధికంగా అలసిపోవుట మరియు స్ట్రెస్ వల్ల బ్లడ్ ప్రెజర్ అధిక మవుతుంది. ఈ మద్యకాలంలో హైబిపికి ప్రధాణ కారణంగా మారుతున్నది ఒత్తిడే, కాబట్టి, ఒత్తిడిని కనుక తగ్గించుకోగలిగినట్లైతే బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.
మరొ ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలంటే మన చుట్టూ ఉన్నచాలా విషయాలను నియంత్రణలో ఉంచుకోవాలి . ఒక్క ఒత్తిడిని మాత్రమే తగ్గించుకోవడం వల్ల మాత్రమే అది సాధ్యం కాదు.
ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. అందులో ముఖ్యంగా ఒత్తిడి తగ్గించుకోవడం అనేది ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, మీరు ఖచ్చితంగా కొన్ని ప్రమాణాలను నియంత్రణలో పెట్టాల్సిందే. జీవిన శైలిలో మార్పులు చేసుకోవడానికి బిపి హెల్త్ టిప్స్ సలహాల్లో వివిధ మార్గాలున్నాయి. మరి అవేంటో చూద్దాం...

రెగ్యులర్ వ్యాయామం:
ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో వ్యాయామాలు చేసేవారే తక్కువైపోయారు. ఎప్పుడు చూడు లాప్ టాప్, కంప్యూటర్స్ ముందుకూర్చొవడం, లేదా ఫోన్లు, ఫేస్ బుక్, ట్విట్టర్లతో కాలక్షేపం చేస్తూ మరింత బద్దకస్తులుగా తయారవుతుంది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యపరంగా
ఎన్నో సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యకరంగా జీవించగలరు. వారంలో కనీసం 5రోజుల వ్యాయామం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది . బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్లో ఉంచడానికి అనుసరించే మార్గాల్లో వ్యాయామం ఉత్తమ మార్గం.

బరువు పెరగడాన్ని కంట్రోల్ చేయడం:
ఎప్పుడైతే మీరు బరువు తగ్గడం ప్రారంభిస్తారు, అప్పుడే మీరు ఒక ఆరోగ్యకరమైన జీవనశైలికి చేరుకుంటారు . కాబట్టి, బరువు తగ్గడానికి ప్రారంభించండి . బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేయడానికి ఇది చాలా ముఖ్యమైన మార్గం.

సమతుల్య ఆహారం:
ఒత్తిడిని కంట్రోల్ చేయాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం చాలా అవసరం. అలాగే టైమ్ కు లచ్ మరియు త్వరగా డిన్న చేయడం కూడా ముఖ్యం. ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు మరియు సంతృప్త కొవ్వు వంటివి తీసుకోవడం వల్ల 14యంయం హెజిని తగ్గిస్తుంది. డైయట్ ప్లాన్ మార్చడం అంత సులభం కాదు. కానీ కొన్ని చిట్కాలు పాటించడం వల్ల హెల్తీ డైయట్ ను పాటించవచ్చు.

సోడియంను తగ్గించుకోవాలి:
మనకు రోజుకు ఒక వ్యక్తికి 6 గ్రాముల ఉప్పు అవసరం. పళ్లు, కూరగాయల్లో సహజసిద్దంగా ఉప్పు ఉంటుంది. ఇది మన శరీరం పనిచేయడానికి తోడ్పడుతుంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఉప్పును తగ్గించుకోవచ్చు. నిల్వ ఉన్న, బయట దొరికే ప్రాసెస్ ఫుడ్స్ పూర్తిగా మానాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిలో ఉప్పు ఎక్కువుంటుంది. ఆహారం తినే సమయంలో ఉప్పు డబ్బా పెట్టుకోకూడదు. ఉప్పుకు బుదులు రుచికలిగించేవి, సుగంధద్రవ్యాలు, నిమ్మరసం, వెనిగర్, మిరియాలపొడి, ఉల్లిపాయలు వాడాలి.

ఆల్కహాల్ ను మితంగా తీసుకోవాలి:
ఆల్కహాల్ వల్ల ఆరోగ్యానికి మంచి మరియు చెడు రెండు ఉన్నాయి. అతి తక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల రెండు నుండి నాలుగు mm Hgద్వారా రక్త పోటును తగ్గింస్తుంది. ఆల్కహాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం కంటే హనీ ఎక్కువ కలుగ జేస్తుంది. కాబట్టి ఆల్కహాల్ కు దూరంగా ఉండటమే మంచిది. పురుషులు ఒకటి లేదా రెండు పెగ్గులు తీసుకుంటే, మహిళలు ఒక్కటికి పరిమితం చేసుకోవాలి.

రెడ్ బైట్:
ఆల్కహాల్ హానికరం, అయితే రెడ్ వైన్ హెల్ప్ ఫుల్ గా ఉంటుంది. కాబట్టి ధమనులు ఓదార్పుకు మరియు రక్తపోటు తగ్గించడం కోసం మితంగా రెడ్ వైన్ తీసుకోవచ్చు.

పొగాకు ఉత్పత్తులు మరియు సెకెండ్ హ్యాండ్ స్మోకింగ్:
ధూమపానం వల్ల శరీరానికి అన్నిరకాలుగాను నష్టం వాటిళ్లితుంది. పొగాకులో ఉన్న నికోటిన్ ఊపిరితిత్తులను పాడు చేయడం మాత్రమే కాదు, 10mm Hg స్థాయి రక్తపోటును కూడా పెంచుతుంది. ప్రతి రోజూ ధూమపానం చేసే వారికి తప్పని సరిగా రక్తపోటు లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే పొగతాగేవారికి దూరంగా ఉండాలి. ఇతరుల నుండి పొగ పీల్చడం కూడా అధిక రక్తపోటు మరియు గుండె జబ్బులు, మరియు ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

బిపిని కంట్రోల్ చేయడానికి ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు చేయించుకోవడం ఉత్తమం:
క్రమబద్ధమైన ఆరోగ్యకర వైద్యపరీక్షలకోసం మీ కుటుంబ వైద్యుడిని సంప్రదించడం వల్ల ప్రమాదకర రోగాల నుండి, అనారోగ్యాల నుండి దూరంగా ఉండవచ్చు. ఒక క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ఆరోగ్యకరమైన జీవితానికి ఖచ్చితమైన మూలం. మీ ఆహారం, జీవనశైలిలో చిన్న మార్పులు తీసుకురావడం వల్ల మీ మొత్తం శ్రేయస్సు కు విపరీత౦గా సహాయపడగలదు. చిన్న వయసులోనే ఈ విషయాలపట్ల శ్రద్ధ పెడితే, భవిష్యత్తులో ఎటువంటి ఆరోగ్య సమస్యలను౦డైనా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.



Click it and Unblock the Notifications











