For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

థైరాయిడ్ తో నిద్రలేమి సమస్యలు: లక్షణాలు-జాగ్రత్తలు

|

ప్రస్తుతం చాలా మందిని పీడిస్తున్న సమస్య నిద్రలేమి. దీనినే వైద్య పరిభాషలో 'ఇన్‌సోమ్నియా' అంటారు. అయితే థైరాయిడ్‌తో బాధపడే వారిలో నిద్రలేమి సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్‌గ్రంథి నాలుకకు మొదట్లో గొంతు భాగంలో సీతాకొక చిలుక ఆకారంలో ఉంటుంది. మానవ శరీరంలో ఈ గ్రంథి అతి ప్రధానమైనది. ఇది శరీరంలోని జీవక్రియలన్నింటిపైనా ప్రభావం చూపుతుంది. పిట్యూటరీ గ్రంథి ఆధీనంలో ఉండే ఈ గ్రంథి ముఖ్యంగా థైరాక్సిన్‌, ట్రైఐడో థైరోనిన్‌, కాల్సిటోనిన్‌ అనే మూడు రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి జీవ క్రియల సమతుల్యతను కాపాడటంలో ప్రధానపాత్ర వహిస్తాయి. హర్మోన్‌ల సమతుల్యత లోపించినప్పుడు మానసిక ఒత్తిడి పెరిగి, నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. ఈ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నవారు ప్రతి నలుగురిలో ఒకరు ఉన్నారని ఇటీవలి సర్వేలు చెబుతున్నాయి. వినడానికి పెద్ద సమస్యగా అనిపించకపోయినా నిద్రలేమి అనేది వ్యక్తిని కృంగదీస్తున్న వాటిలో ముఖ్యంగా ఉంటోంది.

కారణాలు
మానసిక ఆందోళన ఎక్కువగా ఉండటం. సరైన ఆహారం తీసుకోకపోవడం. దాంపత్య జీవితం సరిగ్గా లేకపోవడం, నెగెటివ్‌ ఆలోచనలు పెరిగిపోవటం వంటి సమస్యలు థైరాయిడ్‌, నిద్రలేమికి దారితీస్తాయి. అసహజ వాంఛలు, దీర్ఘ కాలిక వ్యాధులు. ఆత్మన్యూనతా భావం వంటివి కారణం అవుతాయి..
థైరాయిడ్‌ గ్రంథిలో ముఖ్యంగా రెండు తేడాలు చోటు చేసుకుంటాయి. ఒకటి టి3, టి4 తగ్గి, టి.ఎస్‌.హెచ్‌ పెరగడం. దీనినే ప్రైమరీ హైపోథైరాయిడిజమ్‌ అంటారు. అలాగే టి.ఎస్‌.హెచ్‌. తగ్గడం లేదా నార్మల్‌గా ఉండి టి3, టి4 తగ్గడం దీనినే సెకండరీ హైపోథైరాయిడిజం అంటారు. రెండోది టి3, టి4 పెరగడంవల్ల హైపర్‌ థైరాయిడిజం వస్తుంది. ఇలా థైరాయిడ్‌ హార్మోన్‌ల అసమతుల్యత ఏర్పడటంవల్ల నిద్రలేమి సమస్య ఉత్పన్నం అవుతుంది.

లక్షణాలు
కంటి చుట్టూ నలుపు వలయాలు ఏర్పడతాయి. ఆయాసం, గుండె దడగా అనిపించడం, మానసికంగా ఆత్మన్యూనతతో బాధ పడటం వంటి సమస్యలు ఉంటాయి. వీరు నిద్రకు ఉపక్రమించిన తర్వాత కొంత సేపటికే నిద్ర నుండి మేల్కొని మళ్లీ ఎంత ప్రయిత్నించినా నిద్ర పట్టదు. నీరసం, బద్దకం, బరువు పెరగటం, ముఖం వాచినట్లుండటం, జుట్టు రాలడం, స్త్రీలలో రుతుక్రమం తప్పటం, చర్మం పొడిబారినట్లుండటం, మలబద్దకం, వంటి లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి, చిరాకు, ద్వేషం, కోపం ఎక్కువగా ఉంటాయి. ఏ పనిపైనా శ్రద్ధ పెట్టకపోవడం, పనుల్ని వాయిదా వేయడం, ఏకాగ్రత లోపించడం, ఆకలి తగ్గిపోవడం, చదువుపై శ్రద్ధ తగ్గడం, నీరసంగా ఉండటం, తమలో తామే బాధ పడటం వంటి లక్షణాలు కనబడతాయి.
జాగ్రత్తలు

మొదటగా మానసిక ఒత్తిడి నివారణకు యోగా, మెడిటేషన్‌, ప్రాణాయామం నిత్యం చేయాలి. ఇలా చేస్తే మానసిక ప్రశాంతత కలిగి నిద్రలేమి తీవ్రత తగ్గుతుంది. పడుకోవడానికి రెండు గంటల ముందుగానే మంచి ఆహారం తీసుకోవాలి. ఫాస్ట్‌ఫుడ్స్‌, మసాలా పదార్థాలు, వేపుళ్లకు స్వస్తి పలికి పౌష్టికరమైన ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలకు, వెజిటేబుల్స్‌, తాజా పండ్లు తీసుకోవటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వేళకు ఆహారం తీసుకుంటూ, సమయానికి నిద్ర పోతూ ఉండాలి. ప్రతిరోజూ వేకువజామున లేచి 45 నిమిషాలపాటు నడవటం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరిగి, మనస్సు ఉత్తేజ పూరితంగా ఉంటుంది. నిద్రలేమితో బాధపడేవారు తమ చుట్టూ ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. అంతర్మథనాలకు దూరంగా ఉండటం, భావోద్వేగాలను, ఆలోచనలను, అభిప్రాయాలను అణిచిపెట్టకుండా ఎప్పటికప్పుడూ ఆత్మీయులతో పంచుకోవడం వంటివి చేస్తే నిద్రలేమి నుండి తొందరగా బయటపడవచ్చు.

English summary

Thyroid sleep deprivation symptoms and prevention

Have you suffered with several symptoms leading to the diagnosis of an under active thyroid gland? Is one of the symptoms that compelled you to seek a diagnosis sleep deprivation? Are you suffering from complete exhaustion, sweating all the time and have noticed you have a horse voice all the time? All of these are symptoms of having an under active thyroid. People who have sleep deprivation and an under active thyroid are depressed and lack enthusiasm for life.
Desktop Bottom Promotion