For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీల నొప్పిని నివారించే 15 అత్యుత్తమ నివారణోపాయాలు

|

మూత్రపిండాలు మన శరీర ముఖ్యమైన అవయవాలలో ఒక భాగం. ఇవి విసర్జన కార్యచరణను నిర్వహిస్తుంటాయి. ఇంతేకాకుండా, ఇవి రక్తపోటును నియంత్రిస్తుంటాయి మరియు మన శరీరంలో ఆమ్ల క్షార సంతులనాన్ని నిర్వహిస్తుంటాయి.

అనేక కారణాల వల్ల మూత్రపిండాల పనితీరు దెబ్బ తింటుంది. పనితీరు దెబ్బతినటం వలన మూత్రపిండాలలో భరించలేని నొప్పి కలుగుతుంది. ఈ నొప్పి ఉపశమింప చేయవచ్చు మరియు గృహవైద్య నివారణోపాయాలతో చికిత్స చేయవచ్చు.

మూత్రపిండాల నొప్పికి ప్రధాన కారణాలు మూత్ర విసర్జన మార్గంలో కలిగే అంటువ్యాధులు, మూత్రపిండాలలో రక్తస్రావం జరగటం, మూత్రపిండాలలో కణితి మరియు రాయి ఉండటం మరియు మూత్రవిసర్జన ఆగిపోవటం. మూత్రపిండాల నొప్పి యొక్క ప్రధాన లక్షణాలు: మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు మంట మరియు మూత్రం విసర్జన చేస్తున్నప్పుడు రక్తస్రావం మరియు పొత్తి కడుపు మరియు క్రింది భాగంలో నొప్పి, వణుకటం, జ్వరం, చలి, అలసట.

మూత్రపిండాల నొప్పి నుంచి ఉపశమనం ఎలా? నేడు, మీరు మూత్రపిండాల నొప్పి నుండి సమర్థవంతంగా గృహవైద్య నివారణల ద్వారా ఉపశమనం ఎలా అని బోల్ద్స్కి మీతో పంచుకుంటుంది.

నిమ్మకాయ రసం

నిమ్మకాయ రసం

నిమ్మకాయ రసంలో సిట్రిక్ యాసిడ్ ఉండటం వలన,మూత్రపిండాలలో కాల్షియం స్థాయి సమానంగా ఉండేట్లుగా సహాయపడుతుంది. మీరు లెమనేడ్ పానీయం తీసుకోవటం వలన, మీలో తరచుగా మూత్రవిసర్జన జరిగటం వలన మీ శరీరం నుండి విషపదార్థాలు బయటకు నేట్టివేయబడతాయి. ఇది మూత్రపిండాల నొప్పిని తొలగించే ఉత్తమ గృహవైద్యాలలో ఒకటి.

దురదగొండి ఆకులు

దురదగొండి ఆకులు

దురదగొండి ఆకులు మూత్రపిండాలు ద్వారా మూత్రవిసర్జన సాఫీగా జరిగేట్లుగా చూస్తుంది. ఇవి యాంటీ బాక్టీరియల్ మరియు శరీరం నుండి రాళ్ళుగా ఏర్పడే స్పటికాకారాలను బయటకు నేట్టివేయటంలో సహాయపడతాయి. మీరు మూత్రపిండాల నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు రోజులో దురదగొండి ఆకుల టీ కనీసం 2 నుంచి 3 సార్లు సేవించాలి.

సంపూర్ణ గోధుమ బ్రెడ్

సంపూర్ణ గోధుమ బ్రెడ్

మూత్రపిండాల లోపల ఆక్సలేట్స్ ఏర్పడకుండ నివారింఛి, ఆరోగ్యంగా ఉంచుతుంది. సంపూర్ణ గోధుమ బ్రెడ్ లో ప్రోటీన్లు, ఫైబర్స్ మరియు మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బ్రెడ్ తో పాటు, మీరు సంపూర్ణ ధాన్యపు సిరీల్స్ కూడా తినవచ్చు. ఇది కూడా మూత్రపిండాల నొప్పి ఉపశమనానికి ఉత్తమ ఆహారం.

కిడ్నీ బీన్స్

కిడ్నీ బీన్స్

బీన్స్ మూత్రపిండాల నొప్పి చికిత్సకు ఉత్తమమైనవి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లతో సహా ఏ రకమైన మూత్రపిండాల ఇన్ఫెక్షన్ లేక నొప్పిని తొలగించే చికిత్సలో చాలా సహాయకారిగా ఉంటాయి. కాయల నుండి బీన్స్ తొలగించండి మరియు అవి మృదువుగా మారేవరకు తక్కువ మంట మీద కొన్ని గంటల వరకు తొక్కలను వేడిచేయండి. ఆ ద్రవాన్నీ వడకట్టండి మరియు దానిని చల్లబరచండి. ఉత్తమ ఫలితాల కోసం రోజులో చాలాసార్లు ఈ పానీయాన్ని తీసుకోండి.

బాసిల్

బాసిల్

బాసిల్, మూత్రపిండాల నొప్పి మరియు అంటువ్యాధులకు ఉత్తమ టానిక్. మీరు సమర్థవంతమైన ఫలితాలు కోసం, తులసి రసం మరియు తేనె సమాన పరిమాణంలో కలిపి ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. ఈ చికిత్సలో కావలసిన ఫలితాలు పొందడానికి కనీసం నాలుగు నెలలపాటు ఈ విధంగా చేయాలి.

సెలేరి

సెలేరి

మూత్రపిండాల నొప్పి నుంచి ఉపశమనం ఎలా? సెలేరి రసం ఆక్సలేట్స్ ఏర్పడటానికి కారణం అయిన విషాన్నిశరీరం నుండి బయటకు తొలగించటంలో సహాయపడుతుంది. సెలేరి క్రిమినాశక లక్షణాలను కలిగియున్నది. సెలేరి రసం తీసుకోవటం వలన మీ మూత్రపిండాల నొప్పికి ఉపశమనం కలుగుతుంది. సెలేరి రసం కూడా మూత్రవిసర్జన యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుతుంది మరియు మూత్రపిండాల్లో రాళ్లు తొలగించడంలో సహాయపడుతుంది.

దానిమ్మలు

దానిమ్మలు

దానిమ్మ రసాలు మూత్రపిండాల నొప్పి మరియు వ్యాధులు చికిత్సలో సహాయపడతాయి. వీటిలో రక్తస్రావ నివారిణి ప్రభావాలు ఉండటం వలన మూత్రపిండాల్లో రాళ్లను తొలగించే చికిత్సలో సహాయపడతాయి. మీరు ప్రతి రోజు దానిమ్మ రసం ఒకటి లేదా రెండు గ్లాసులు తీసుకున్నందువలన లేదా ప్రతి రోజూ ఒక దానిమ్మ తినటం వలన మూత్రపిండాల సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంచవచ్చు.

పుచ్చకాయ

పుచ్చకాయ

పుచ్చకాయలో నీరు అత్యధిక స్థాయిలో ఉంటుంది మరియు మీ శరీరాన్ని సార్ద్రతగా ఉంచుతుంది మరియు పనికిరాని పదార్థాలను బయటకు నేట్టివేయతంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ పండును రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే మూత్రపిండాల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. పుచ్చకాయలో పొటాషియం అధికంగా ఉంటుంది మరియు రాళ్ళను తొలగించటంలో ఉపయోగకరంగా ఉంటుంది.

టమోటో రసం

టమోటో రసం

నీటితో కలిపిన టమోటా రసాన్ని ఒక గ్లాసు తీసుకోండి. ఇది నొప్పి నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. టొమాటోలను కోసి మరియు ఒక మందపాటి కాటన్ గుడ్డలో చుట్టండి. దీనిని నొప్పితో బాధపడుతున్న వారి వెనుకభాగం మీద ఉపశమనం కోసం ఉంచండి.

వర్జిన్ ఆలివ్

వర్జిన్ ఆలివ్

ఆలివ్ నూనె మూత్రపిండాల నొప్పి ఉపశమనానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆలివ్ నూనె (వర్జిన్), నిమ్మ రసం సమాన పరిమాణంలో కలిపి త్రాగండి.

వార్మ్ కంప్రెస్

వార్మ్ కంప్రెస్

బాధగా ఉన్న ప్రాంతంలో వేడి నీటితో నింపిన వార్మ్ కంప్రెస్ ను ఉంచండి. ఇలా చేయటం వలన రక్త ప్రసరణ పెరిగి మూత్రపిండాల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

డాండెలైన్ రూట్ టీ

డాండెలైన్ రూట్ టీ

డాండెలైన్ రూట్ టీ తీసుకోవటం వలన మూత్రవిసర్జన (మూత్రవిసర్జన) స్థాయి పెరుగుతుంది మరియు మూత్రపిండాలను శుభ్రపరుస్తుంది, అందువలన నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

నీరు

నీరు

మూత్రపిండాలకు నీరు అవసరం ఎందుకంటే మీ శరీరం నుండి విషాన్ని బయటకు నెట్టివేయటంలో నీరు సహాయపడుతుంది. మీరు రోజులో నీటిని కనీసం 8-10 గ్లాసులు త్రాగటం చాలా అవసరం.

బెల్లడోనా

బెల్లడోనా

మీరు మూత్రపిండాల నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు బెల్లడోన పిప్పి తీసుకోవాలి. ఇది నెత్తుటి మూత్రం యొక్క చికిత్సలో ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని కూడా మూత్రపిండాల నొప్పి ఉపశమనం ఔషధంగా వర్గీకరించవచ్చు.

పార్స్లీ టీ

పార్స్లీ టీ

పార్స్లీ, మూత్రవిసర్జన బాగా జరిగేట్లు పనిచేస్తుంది. ఇది మీ శరీరం నుండి విషాన్ని బయటకు నెట్టివేయటంలో సహాయపడుతుంది. దీనిని మూత్రపిండాల మరియు పిత్తాశయ సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు. ప్రభావిత ప్రాంతంలో పార్స్లీ పేస్ట్ వర్తింపచేయటం వలన వాపు మరియు బాధాకరమైన మంట తగ్గుతుంది. ఇది కూడా యాంటి-వైరల్ మరియు ఇన్ఫెక్షన్ నయం చేయటంలో సహాయపడుతుంది.

English summary

15 Effective Home Remedies For Kidney Pain

Kidneys are one of the important organs in our body. It performs the function of excretion. Besides, it regulates blood pressure and maintains acid-base balance in our body.
Story first published: Tuesday, January 20, 2015, 16:19 [IST]
Desktop Bottom Promotion