Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. మీ ర్యాంక్ అంచనా వేసుకోవడం ఎలా? -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ క్రిస్పీ సొరకాయ దోశ ఉండాల్సిందే! -
ఎండల వేడికి తట్టుకోలేకపోతున్నారా? ఈ పానీయాలతో శరీరాన్ని చల్లబరచుకోండి! -
వైశాఖ అమావాస్య రోజున ఈ పనులు చేస్తే పితృదేవతల ఆశీస్సులు! -
కమ్మని పెరుగు సేమియా..ఆహా ఏమి రుచి, తినరా మైమరచి.. -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. లక్ష్మీ కటాక్షం మీకేనా? - శుక్రవారం, 17 ఏప్రిల్ 2026 -
బ్రోకోలీ నిజంగా క్యాన్సర్ ను తగ్గిస్తుందా? డాక్టర్ చెప్పిన ఈ సీక్రెట్ తెలుసుకోండి! -
డీప్‌ఫేక్ ఫోటోలతో వేధిస్తున్నారా? 2 గంటల్లోనే డిలీట్ చేయించే మార్గమిదే! -
కర్ణాటక స్పెషల్ కుకుంబర్ అవలక్కి..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్!
స్వైన్ ఫ్లూ గురించి మీరు తెలుసుకోవలసిన 15 వాస్తవాలు
మీకు స్వైన్ ఫ్లూ లక్షణాల గురించి తెలుసా? మీరు స్వైన్ ఫ్లూ మరియు దాని లక్షణాల గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఇటీవలే ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వ్యాప్తి చెందింది. ఈ వైరస్ మొదట మెక్సికోలో కనపడి,ఆ తర్వాత ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు పాకింది. నేడు, వ్యాధి సోకిన వారి సంఖ్య బాగా పెరిగింది. పరిస్థితిని చూసి భయాందోళనలకు గురి కాకుండా మొదట దాని నివారణ గురించి తెలుసుకోవాలని నిపుణులు చెప్పుతున్నారు.
READ MORE: గర్భిణీలు స్వైన్ ఫ్లూ బారిన పడితే తీసుకోవల్సిన జాగ్రత్తలు
మీరు స్వైన్ ఫ్లూ వంటి వైరస్ సోకిన ప్రాంతాలలో ఉన్నట్లయితే, ఆ వ్యాధి మీకు వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. మీరు పెద్ద పెద్ద సమూహాలుగా ఉన్న ప్రజల మధ్య ఉన్నప్పుడు ఈ వైరస్ సులభంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుందో తెలిస్తే చాలా ఆశ్చర్యపోతాం. స్వైన్ ఫ్లూ లక్షణాలు ఏమిటి? దాన్ని నిరోదించటం ఎలా? మేము ఈ వ్యాసం లో స్వైన్ ఫ్లూ గురించి ఇలాంటి నిజాలను చర్చిస్తున్నాం.

స్వైన్ ఫ్లూ అంటే ఏమిటి?
ఇన్ఫ్లుఎంజా అనే వైరస్ శ్వాస కోశ ఇన్ ఫెక్షన్ కి కారణం అవుతుంది. సాదారణంగా ఈ రకమైన వైరస్ పందులలో వ్యాపించి ఉంటుంది. ఆ తర్వాత అది మానవులకు వ్యాప్తి చెందుతుంది.

ఇది ఒక అంటువ్యాధి
ఈ వ్యాధి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపిస్తుంది. ఈ అంటు వ్యాధి చాలా వేగంగా పరిసరాలను మరియు ఇతరులను ప్రభావితం చేయవచ్చు. సరైన జాగ్రత్తలను క్రమం తప్పకుండా తీసుకుంటే దీనిని నివారించవచ్చు.

ఇది ఎలా వ్యాపిస్తుంది
ప్రస్తుతం,శాస్త్రవేత్తలు వ్యాధి సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు వ్యాప్తి చెందుతుందని అభిప్రాయపడుతున్నారు. లాలాజలంలో ఉండే క్రిములు దగ్గు లేదా తుమ్ము ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతాయి. మీరు కలుషితమైన ఉపరితలం తాకినపుడు కూడా వ్యాప్తి చెందుతుంది.

ఇది ప్రమాదకరం?
భారతదేశంతో సహా కొన్ని దేశాల్లో దీని వలన మరణాలు నమోదు అయ్యాయి. కాబట్టి, ఈ వ్యాధికి మంచి చికిత్స లేకపోవుట వలన ప్రాణాలకు హాని కలిగించవచ్చు.

స్వైన్ ఫ్లూ సంకేతాలు
దగ్గు,జ్వరం,గొంతు పుండు,నొప్పులు,అలసట, తలనొప్పి వంటివి స్వైన్ ఫ్లూ లక్షణాలుగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో,వాంతులు మరియు డయేరియా కూడా నమోదు అయ్యాయి.

ఎలా నిరోదించాలి
మీ ముక్కు మరియు నోటిని కవర్ చేయటానికి ఒక రుమాలును ఉపయోగించటం ముఖ్యం. మీరు కొన్ని గాయాల ఉపరితలంను టచ్ చేసినప్పుడు , మీరు పూర్తిగా మీ చేతులను శుభ్రంగా కడగాలి. సాధ్యమైతే వ్యాధి సోకిన వ్యక్తుల కంపెనీని నివారించండి.

ఒక మాస్క్ సహాయం చేస్తుందా?
ఒక మాస్క్ ధరిస్తే స్వైన్ ఫ్లూ ను కొంతవరకు నిరోదించవచ్చు. కానీ మీరు ఒక బహిరంగ ప్రదేశంను సందర్శించిన తర్వాత, ఇంటికి వచ్చి మీ చేతులను శుభ్రంగా కడగడం మరింత ముఖ్యం.

మందులు సహాయం చేస్తాయా?
అవును,మందులు స్వైన్ ఫ్లూ లక్షణాలను నియంత్రించడంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. లక్షణాలు ఒకసారి నయం అయ్యాక, అది తిరిగి సాధారణ స్థితికి పొందేందుకు సులభంగా ఉంటుంది.

స్వైన్ ఫ్లూ టీకా ఉందా?
నివారణ చర్యగా టీకా వంటివి ఏమి లేవు. కానీ ఆరోగ్య నిపుణులకు రాబోయే సంవత్సరాలలో వస్తుందని ఒక ఆలోచన మరియు విశ్వాసం ఉన్నాయి.

పంది మాంసం తినటం హానికరం?
స్వైన్ ఫ్లూ రావటానికి పంది మాంసం తినటం కారణం కాదు. మీరు మాంసంను శుభ్రంగా కడగటం ముఖ్యం. ఇతర సమస్యలను నిరోధించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రభావితం అయినప్పుడు ఏమి చేయాలి?
ముందుగా,ఒక వైద్యుడుని సంప్రదించటం ముఖ్యం. తరువాత, ఇది ఇతర కుటుంబ సభ్యులకు ప్రభావితం కాకుండా చూసుకోవాలి. అంతేకాక పనికి వెళ్ళకుండా,డాక్టర్ సూచించిన మందులను వాడాలి. త్వరలోనే పరిస్థితులు చక్కబడి మెరుగు అవుతారు.

పిల్లల్లో లక్షణాలు ఏమిటి
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,నీరు త్రాగటంలో ఇబ్బంది,చర్మం నీలంగా మారటం మరియు జ్వరం వంటి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉంటాయి.

పెద్దవారిలో
వాంతులు,గందరగోళం,మైకము,పొత్తికడుపు నొప్పి మరియు శ్వాస సమస్యలు వంటి స్వైన్ ఫ్లూ లక్షణాలు కనపడతాయి.

అవసరమైన చర్యలు
వైద్యుడు సూచించిన విధంగా మందులను ఉంచుకోవటం ముఖ్యం. రోగికి స్వైన్ ఫ్లూ లక్షణాలు నయం అయ్యే వరకు విశ్రాంతి అవసరం.

ఇంటి నివారణలు ఉన్నాయా?
స్వైన్ ఫ్లూ చికిత్స ఇంటిలో సాధ్యం కాదు. ఈ చికిత్స కోసం తప్పనిసరిగా ఆసుపత్రికి వెళ్ళాలి. అవకాశాలను చేతిలోకి తీసుకోవటం అంత మంచిది కాదు.



Click it and Unblock the Notifications











