For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూత్రాశయ సమస్యలను నివారించుకోవడానికి సహాయపడే కొన్నిహోం రెమెడీస్

By Super
|

మీకు తరచుగా మూత్ర విసర్జనకి వెళ్ళాలనిపిస్తోందా??పొత్తి కడుపు లో ఏదోపొడుస్తున్నట్లు నెప్పి వస్తోందా?? "ఇంటర్ స్టీషియల్ సిస్టిటిస్" ఒక దీర్ఘకాలిక వ్యాది. దీనివల్ల విపరీతమయిన అసౌకర్యం మరియు నెప్పి కలుగుతాయి.కొన్ని తీవ్రమైన కేసులలో అయితే కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ లేదా రుమటాయిడ్ ఆర్ధరైటిస్ తో బాధపడే వారిలా జీవితం అయిపోతుంది.

వింటుంటేనే భయంకరం గా ఉంది కదూ?? అసలు ఈ వ్యాధి ఎలా వస్తుంది దీని నివారణా మార్గాలేమిటి?? కొన్ని అతి సామాన్య పదార్ధాలనుపయోగంచి ఈ వ్యాధి ని దూరం పెట్టవచ్చా?? తెలుసుకోవాలనుందా, అయితే చదవండి.

"ఇంటర్ స్టీషియల్ సిస్టిటిస్" లేదా "ఐ.సీ" గా పిలవబడే ఈ వ్యాధి మూత్రాశయానికి సంబంధించినది.మన శరీరం లో మూత్రాశయం ఒక బెలూన్ లా ఉంటుంది. శరీరం నుండి మూత్రం విసర్జింపబడటానికి ముందు ఇక్కడ నిలువ చేయబడుతుంది.మూత్రాశయ గోడలు కండరాలతో చెయ్యబడటం వల్ల మూత్రాశయం నిండగానే కండరాలు వ్యాకోచించి, ఖాళీ అయినప్పుడు సంకోచిస్తాయి.ఈ గోడలకి వేల కణాలు పూత(లైనింగ్)గా ఉండటం వల్ల ప్రత్యక్షం గా మూత్రం మూత్రాశయ గోడలని తాకదు.

ఇంటర్ స్టీషియల్ సిస్టిటిస్ వ్యాధి లో మూత్రాశయ గోడల లైనింగ్ వాచడం వల్ల మూత్రం నిండగానే మూత్రాశయం సాధారణం గా వ్యాకోచించినట్లు వ్యాకోచించదు.అందువల్లనే మూత్ర విసర్జన సమయం లో లోపలనుండి పొడుస్తున్నట్లున్న నెప్పి.

ఈ ఐ.సీ. ని యూటీఐ(యూరినరీ ట్రాక్ ఇన్ ఫెక్షన్) అనుకుని పొరపడుతుంటారు. ఐ.సీ అసలు బాక్టీరియా వల్ల కలగదు అందువల్ల మీరు తీసుకునే యాంటీబయోటిక్స్ కూడా నిరుపయోగం.మొట్టమొదట ఐ.సీ. వ్యాధి లక్షణాలు హార్మోనులు లేదా వ్యాధి నిరోధక శక్తి లక్షణాలయిన "ఎండోమెట్రోసిస్" లేదా ట్యూమర్ లక్షణాలయిన "యుటెరిన్ ఫైబ్రాయిడ్స్" లా ఉంటాయి.

ఈ వ్యాధి కలగడానికి ఇదీ ఫలానా కారణం అని తెలీదు. ఒక్కోమనిషిలో ఒక్కో కారణం వల్ల కలుగుతుంది. కానీ ఈ వ్యాధికి సంబంధించిన కొన్ని ముందస్తు లక్షణాలని లేదా ఈ వ్యాధి కలగచేసే రుగ్మతలని మాత్రం పరిశోధకులు కనుగొన్నారు. ఇప్పటివరకు ఐ.సీ అంటే ఏమిటి,ఎలా వస్తుందనీ తెలుసుకొన్నారు. మూత్రాశయ సమస్యలను నివారించుకోవడానికి సహాయపడే కొన్నిహోం రెమెడీస్ చూద్దాము....

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా:

ఐ.సీ కి బేకింగ్ సోడా చిట్కా చాలా ప్రసిద్ధి.సోదా కి ఉన్న క్షార గుణం వల్ల శరీరం లోని ఆంల స్థాయిలని తగ్గించి,మంట మరియు ఇతర ఐ.సీ. వ్యాధి కాంప్లికేషన్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.ఒక 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా గ్లాసుడు నీళ్ళల్లో కలిపి రోజుకు నాలుగైదు సార్లు తాగాలి

ప్రోబయోటిక్స్

ప్రోబయోటిక్స్

ప్రోబయోటిక్స్ తీసుకోవడం వల్ల చాలా రకాల వాపు కి సంబంధించిన వ్యాధులు తగ్గుముఖం పడతాయని నిరూపించబడింది. మూత్రాశయం వాపు మరియు ఉబ్బటం లాంటి సమస్యలపై ప్రోబయోటిక్స్ పోరాడతాయి. వాపు నిరోధకం గా నిరూపించబడి ఫ్లేవనాల్ గ్రూపు కి చెందిన "క్వెర్సెటిన్" అనే యాంటీ ఆంక్సిడెంట్ ప్రోబయోటిక్స్ లో ఉంటుంది. క్వెర్సెటిన్ దేహం లో ఎలర్జీల ప్రతిస్పందనలని తగ్గిస్తుంది.క్వెర్సెటిన్ ఉన్న పదార్ధాలు లేదా దాని అనుబంధ పదార్ధాలు "ఐ.సీ" లక్షణాలని చాలావరకూ తగ్గిస్తాయి.

పడని ఆహార పదార్ధాలని గుర్తించడం:

పడని ఆహార పదార్ధాలని గుర్తించడం:

ఇంటర్ స్టీషియల్ సిస్టిటిస్ నుండి, వాపు నుండి ఉపశమనాన్ని పొందాలంటే ఆమ్ల ఆహార పదార్ధాల పట్టిక తయారు చేసుకుని వాటి బదులుగా క్షార గుణాలు లేదా అటు ఆమ్ల లేదా క్షార గుణం లేని పదార్ధాలని తీసుకోవడం ద్వారా వాపు ని తగ్గించవచ్చు.కొన్ని పదార్ధాలు తీసుకోవడం వల్ల మీ శరీరం ఎలర్జీ ద్వారా ప్రతిస్పందన తెలియచేస్తుంది.ఆ పదార్ధాల వల్ల మీకు మాత్రమే ఎలర్జీ రావచ్చు. అలాంటి కొన్ని పదార్ధాలేవంటే -సిట్రస్ జాతికి చెందిన నిమ్మ, ఆరెంజ్, గ్రెనడయిన్ పళ్ళు -బుస బుసమని బుడగలు వచ్చే కూల్ డ్రింక్స్, ముఖ్యం గా డయట్ వెరైటీలు -కమర్షియల్ గా పండించిన టమాటాలు -సాంద్రీకరించబడ్డ లేదా ప్రాసెస్ చేసిన పండ్ల రసాలు -ఆల్కాహాలు -కాఫీ(ఆమ్లం అధికం గా ఉన్న పదార్ధం) -క్రాన్ బెర్రీలు -చాక్లెట్లు -యోగర్ట్ -చీజ్ -ప్రాసెస్ చేసిన మాంసం వీటిలో మీకు ఎలర్జీ కలిగించే పదార్ధాలని కనుక్కుని అలాంటి ఆమ్ల పదార్ధాల నుండి దూరం గా ఉండాలి.

పాలకూర:

పాలకూర:

ఐరన్, ఫోలేట్, ఫాస్ఫరసు మరియు విటమిన్-ఈ అధికం గా ఉన్న పాలకూర లో ఫైటో న్యూట్రియెంట్స్ కూడా పుష్కలం గా ఉంటాయి. ఫైటో న్యూట్రియెంట్స్ శరీరం లోని కణాలకి ప్రత్యక్షం గా శక్తినిచ్చి నిరోధక శక్తిని పెంచుతాయి.పాలకూరలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరం లోని ఫ్రీ రాడికల్స్ ని నిరోధించి వాపుని తగ్గిస్తాయి.

మెలాటోనిన్

మెలాటోనిన్

మెలాటోనిన్ అనేది సప్లిమెంట్ రూపం లో దొరికే యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీరం లోని ఫ్రీ రాడికల్స్ ని నిరోధించడంలో ఉపయోగపడుతుంది.2003 లో ఎలుకల మీద జరిపిన అధ్యయనం ప్రకారం మెలాటొనిన్ మూత్రాశయం యొక్క లైనింగ్ ని ఇబ్బంది పెట్టే కణాల నుండి కాపాడుతుందని నిరూపించబడింది. ఈ అధ్యయనాన్ని ఆధారం చేసుకునే శాస్త్రవేత్తలు మెలాటొనిన్ కి ఇంటర్ స్టీషియల్ సిస్టిటిస్ కి ప్రత్యామ్నాయ ఔషధం కాగలదని వక్కాణిస్తున్నారు.

కొలోడియల్ సిల్వర్:

కొలోడియల్ సిల్వర్:

యాంటీ ఆక్సిడెంట్ మరియు వాపు నిరోధకమైన కొలోడియల్ సిల్వర్ "మైకో ప్లాస్మా","కాండి డా" లాంటి ఇంటర్ స్టీషియల్ సిస్టిటీస్ ని కలిగించే ఇతర ఇన్ ఫెక్షన్లని నిర్మూలిస్తుంది.

English summary

7 Effective Home Remedies To Treat Interstitial Cystitis

Interstitial cystitis or IC is a chronic inflammatory disease of the bladder. The urinary bladder is a balloon like organ that collects urine from the kidneys and stores it for expulsion.
Desktop Bottom Promotion