For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైరల్ ఫీవర్ బాధ నుండి ఉపశమనం కలిగించే ఆహారాలు

|

డేంగ్యు తర్వాత, మరో అత్యంత సాధరణ జ్వరం, అందరినీ పట్టి పీడించే జ్వరాల్లో ఒకటి వైరల్ జ్వరం. వైరల్ ఫీవర్ కు కారణం ఒక్కటి కాదు... రెండు కాదు, అనేక వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది. ఈ వైరల్ ఫీవర్ ఒక్కొక్కరిలో ఒక్కొక్క కారణం చేత వైరల్ ఫీవర్ బాధిస్తుంది.

వైరల్ ఫీవర్ కు సంబంధించి డాక్టర్ మొదట కనిపెట్టే లక్షణాలు, పేషంట్స్ లో అలసట, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, ఈ లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం కనిపించినా.. ఏలాంటి ఆలసత్వం కానీ, లేదా నిర్లక్ష్యం కానీ చేయకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. లేదంటే ఈ లక్షణాల వల్ల శరీరంలో మిగిలిన ఇతర అవయవాలకు కూడా వైరల్ ఫీవర్ సోకడం వల్ల అవయవాలు బలహీనపడుతాయి.

వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు సరైన పౌష్టికాహారం తీసుకోవడం చాలా అవసరం.మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వ్యాధినిరోధకత పెరుగుతుంది, దాంతో వైరస్ ను నివారించుకోవచ్చు. READ MORE: డెంగ్యు జ్వరంతో బాధపడుతున్నారా?ఐతే ఇవి తినండి!

వైరస్ మానవ శరీరంలోనికి ఏ సయంలో ప్రవేశిస్తుంది లేదా ప్రవేశించిందనే విషయాన్ని తెలుసుకోవాలి. వైరల్ ఫీవర్ అటాక్ అయిన వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఎందుకంటే వైరస్ శరీరంలో ప్రవేశించిన తర్వాత అంది శరీరంలో పెరుగుదలకు కొంత కాల పండుతుంది కాబట్టి, వెంటనే అది శరీరంలోని ఇతర భాగాలకు విస్తరించకుండా ఉండాలంటే, వెంటనే డాక్టర్ ను సంప్రదించి తగిన చికిత్సను పొందాలి. శరీరంలో ఎప్పుడైతే వైరస్ సోకుతుందో, అప్పుడు పైన తెలిపిన లక్షణాలు కనబడుతాయి.

అందువల్ల, శరీరంలో వైరస్ మరింత విస్తరించకుండా ఉండుటకు ఈ క్రింది తెలిపిన హెల్తీ ఫుడ్స్ ను తీసుకోవాలి. వైరల్ ఫీవర్ పేషంట్స్ కొరకు కొన్ని బెస్ట్ ఫుడ్స్ ఈ క్రింది విధంగా...

నీళ్ళు:

నీళ్ళు:

ఎలాంటి వైరస్ కైనా మీ శరీరం గురైనప్పుడు ‘(లేదా ఇన్ఫెక్ట్ )అయినప్పుడు, దాన్ని వెంటనే బయటకు ఫ్లష్ అవుట్ చేయాలి, అందుకు నీరు ఒక ఉత్తమ ఔషదం . శరీరంలోని టాక్సిన్స్ ను మరియు వైరస్ లను బయటకు నెట్టివేయగల శక్తి కేవలం వాటర్ కే ఉంది. కాబట్టి, సాధ్యమైనంత ఎక్కువ నీరు త్రాగాలి.

తులసి :

తులసి :

వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారా? తులసితో తయారుచేసిన ఏ రకమైన ఫుడ్డైనా తీసుకోవచ్చు లేదా కొన్నితులసి ఆకులను ఒక కప్పు టీలో వేసి బాగా మరిగించిన గోరువెచ్చగా నిద్రలేచిన వెంటనే కాళీ పొట్టతో త్రాగడం వల్ల మంచి ఫలితం ుంటుంది . అలాగే కొన్ని ఆకులను మీరు త్రాగే రెగ్యులర్ వాటర్ లో నానబెట్టి, త్రాగవచ్చు.

ఆరెంజ్ జ్యూస్.:

ఆరెంజ్ జ్యూస్.:

వైరల్ ఫీవర్ ఉన్నప్పుడు ద్రవాలు ఒక ఉత్తమ బలాన్నిచ్చే ద్రవాలు. ఆరెంజ్ జ్యూస్ తయారుచేసి, పగటి పూట త్రాగడం వల్ల వ్యాధినిరోధకత పెరుగుతుంది.

అల్లం జ్యూస్:

అల్లం జ్యూస్:

ఒక కప్పు బ్లాక్ టీ తయారుచేసి అందులో కొద్దిగా అల్లం ముక్కలు వేసి, అందులోనే కొద్దిగా తేనె మిక్స్ చేసి తీసుకోవాలి. ఈ గోరువెచ్చని అల్లం టీ గొంతు నొప్పి, తలనొప్పి తగ్గిస్తుంది.

 ఉడికించిన వెజిటేబుల్స్:

ఉడికించిన వెజిటేబుల్స్:

కారం లేకుండా ఉడికించిన లేదా ఆవిరి మీద ఉడికించిన వెజిటేబుల్స్ కు కొద్దిగా ఉప్పు, పెప్పర్ పౌడర్ వేసి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది, బలాన్ని అందిస్తాయి.

గంజి:

గంజి:

వైరల్ ఫీవర్ కు మరో బెస్ట్ ఫుడ్ గంజి .బియ్యం, లేదా బార్లీతో తయారుచేసిన గంజి వ్యాధినిరోధకత పెంచుతుంది. మరియు ఎనర్జిని అందిస్తుంది.

ద్రాక్ష:

ద్రాక్ష:

ఎండు ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా సరే పోరాడి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

 వెల్లుల్లి:

వెల్లుల్లి:

యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వైరస్ ను వెంటనే నాశనం చేయవచ్చు. వైరల్ ఫీవర్ ఉన్నవారి డైలీ డైట్ లో వెల్లుల్లిని చేర్చాలి . ఇవి ఇన్ఫెక్షన్ ను నాశనం చేస్తుంది.

ఇండియన్ హెర్బ్స్:

ఇండియన్ హెర్బ్స్:

వైరల్ ఫీవర్ ను నివారించడానికి ఇండియన్ హెర్బ్స్ చాలా మేలు చేస్తాయి. పుదీనాతో తయారుచేసిన ఏ ఆహారమైనా వ్యాధినిరోధకతను పెంచుతాయి. ఇవి ఇన్ఫెక్షన్స్ తో నేచురల్ గా పోరాడుతాయి.

    ప్రోబయోటిక్ ఫుడ్స్:

    ప్రోబయోటిక్ ఫుడ్స్:

    రెగ్యులర్ డైట్ లో ప్రోబయోటిక్ ఫుడ్స్ ను చేర్చుకోవాలి. ఇవి అధిక టెంపరేచర్ ను తగ్గిస్తాయి. యాంటీబయోటిక్ వాడకాన్నితగ్గిస్తాయి.

    వెజిటేబుల్ సూప్:

    వెజిటేబుల్ సూప్:

    వైరల్ ఫీవర్ నుండి ఉపశమనం కలిగించడంలో వెజిటేబుల్ సూప్ కూడా ఒకటి. ఈ సూప్ ను లంచ్ సమయంలో త్రాగడం వల్ల ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. మరియు ఇన్ఫెక్షన్స్ విడిపోవడానికి సహాయపడుతాయి.

    తొక్క ఉన్న ఆహారాలు:

    తొక్క ఉన్న ఆహారాలు:

    వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నప్పుడు, పీల్డ్ ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. ఆరెంజ్, స్వీట్ లెమన్ మరియు విటమిన్ సి అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వైరల్ ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు.

English summary

Best Foods For Viral Fever Patients: Health Tips in Telugu

Eating the right foods during a viral fever is important as it helps to boost your immunity and thereby gets rid of the virus. You should know that when this virus enters human body, it takes its incubation period to multiply itself to such number that causes infection. When the body is infected by the virus, the following symptoms mentioned above are seen.
Story first published: Thursday, September 10, 2015, 17:47 [IST]
Desktop Bottom Promotion