For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ను నివారించే 8 నేచులర్ యాంటీ బయోటిక్స్

|

హిప్పోక్రేట్స్ యొక్క మాటలలో ‘మీ ఆహారమే మీ ఔషదం, మరియు మీ ఔషధం మీ ఆహారం'. అంటే మీరు తీసుకొనే ఆహారమే మీ శరీర ఆరోగ్యానికి ఔషధాలాంటివని తన మాట్లో ఇలా తెలిపాడు. ఈ విలువైన విషయాన్ని గుర్తుంచుకుంటే మీ జీవితాంతం మీరు ఆరోగ్యంగా జీవించగలుగుతారు!

మన శరీరంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్స్ ను చికిత్సనందించడానికి లేదా నివారించడానికి యాంటీబయోటిక్స్ ను ఉపయోగిస్తుంటాము . ముఖ్యంగా స్టొమక్ ఇన్ఫెక్షన్స్, ఇయర్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో మరియు మరికొన్ని ఇతర ఆరోగ్య సమస్యలను నివారించడానికి యాంటీబయోటిక్స్ ను ఎక్కువగా తీసుకుంటుంటారు.

మనం యాంటీబయాటిక్స్ వాడినన్ని రోజులూ చాలా ఎఫెక్టివ్ గా బ్యాక్టీరియా పెరుగుదలను నాశనం చేయడం లేదా నిరోధించడం జరుగుతుంది. అయితే ఈ క్రింది లిస్ట్ లో ఇచ్చిన యాంటీబయోటిక్స్ దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వైరస్ కు కారణం అయ్యే వీటిని నేచురల్ యాంటీబయోటిక్స్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడలేవు.

ఈ నేచురల్ యాంటీబయోటిక్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కు వ్యతిరేకంగా కూడా పోరాడలేవు. స్టొమక్ ఇన్ఫెక్షన్స్ మరియు ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడానికి పోరాడటానికి ఈ క్రింది లిస్ట్ లోని యాంటీబయోటిక్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. మరి ఈ నేచురల్ యాంటీ బయోటిక్స్ ఏంటో చూద్దాం...

1. వెల్లుల్లి:

1. వెల్లుల్లి:

ప్రతి రోజు ఉదయం కాలీ పొట్టతో రెండు, మూడు వెల్లుల్లిపాయలను నేరుగా తీసుకోవాలి లేదా మీరు తయారుచేసే వంటకాల్లో జోడించుకోవచ్చు. ఈ నేచురల్ యాంటీ బయోటిక్ స్టొమక్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

2. తేనె:

2. తేనె:

శరీరంలో వ్యాధినిరోధకశక్తిని పెంచే నేచురల్ యాంటీ బయోటిక్ తేనె . తేనె మరియు దాల్చిన చెక్క యొక్క పొడిని సమంగా తీసుకొని, బ్రౌన్ బ్రెడ్ కు అప్లైచేసి ఉదయం అల్పాహారంగా తీసుకోవాలి. స్టొమక్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో ఈ యాంటీబయోటిక్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.

3. ఓరిగానో:

3. ఓరిగానో:

ఓరిగానోలో కార్వక్రోల్ అనే కాంపోనెంట్ ఉండటం వల్ల , చెవి ఇన్ఫెక్షన్ నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . ఈ నేచురల్ యాంటీబయోటిక్ నొప్పి నివారించడానికి కూడా సహాయపడుతుంది.

4. ఆలివ్ లీఫ్:

4. ఆలివ్ లీఫ్:

ఆలివ్ ఆకు ఒక ఉత్తమ నేచురల్ యాంటీబయోటిక్ ఇది, వివిధ రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. ఆలీవ్ ఆకలు రసాన్ని తీయడానికి గుప్పెడు ఆకులను తీసుకొని సన్నగా తరిగి ఒక గ్లాసు నీళ్ళలో వేయాలి. అలాగే ఆకుల మీద కోడ్కను వేసి ఆకులు పూర్తిగా కవర్ అయ్యేలా వేసి తర్వాత మూత పెట్టాలి . దీన్నిచీకటి ప్రదేశంలో ఉంచి, 4-5వారాలపాటు ఉంచి, తర్వాత తీసి మరో గ్లాసులోనికి మార్చుకొని తీసుకోవాలి. హోం మేడ్ ఆలివ్ లీఫ్ ఎక్స్ టాక్ట్ రెడీ.

5. పసుపు:

5. పసుపు:

వ్యాధుల వల్ల పొట్టలో ఏర్పడే బ్యాక్టీరియాను నివారించడానికి ఈనేచురల్ యాంటీబయోటిక్ ను ఉపయోగించవచ్చు . ఒక చెంచా పుసుపులో , 6చెంచాల తేనె మిక్స్ చేసి, మూత గట్టిగా ఉండే డబ్బాలో స్టోర్ చేయాలి . అరచెంచాను రోజుకు రెండు సార్లు తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

6. అల్లం:

6. అల్లం:

సాల్మొనెల్లా వంటి ఫుడ్ బార్న్ పాతోజెనిస్ తో పోరాడే యాంటీబయోటిక్ బెస్ట్ నేచురల్ ఫ్రెష్ జింజర్ గ్రేట్ గా సహాయపడుతుంది . అందుకు డ్రై లేదా ఫ్రెష్ జింజర్ ను మీ వంటల్లో చేర్చాలి.

7. గ్రేప్ ఫ్రూట్:

7. గ్రేప్ ఫ్రూట్:

స్కిన్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేప్ ఫ్రూట్ ఎక్స్ ట్రాక్ట్ నేచురల్ యాంటీబయోటిక్ అన్న విషయం చాలా మందికి తెలియదు . అందుకు మీరు చేయాల్సింది 10-15 చుక్కల రసాన్ని గ్లాసులో తీసుకొని అందులో నీళ్ళు పోసి దీన్ని రోజుకు రెండు మూడు సార్లు తీసుకోవాలి.

8. వేప:

8. వేప:

మరో యాంటీబయోటిక్ మెడిసిన్ . దీన్ని ఫ్రెష్ గా నమిలి తీసుకోవడం వల్ల పొట్ట ఇన్ఫెక్షన్స్ మాత్రమే కాదు , శరీరంలోని టాక్సిన్స్ మొత్తం బయటకు నెట్టివేస్తుంది.

English summary

8 Natural Antibiotics For Bacterial Infections

Antibiotics are medicine used to treat and prevent bacterial infections. We intake antibiotics to treat stomach infections, ear infections and other several health problems.
Story first published: Monday, April 20, 2015, 18:31 [IST]
Desktop Bottom Promotion