For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైరల్ ఫీవర్ & జాయింట్ పెయిన్స్ నివారించే హోం రెమెడీస్

|

గాయాల వల్ల జాయింట్ పెయిన్స్ రావడం చాలా సాధారణం, అదే విధంగా నిరంతర వాపులు వల్ల కూడా శాస్వతంగా కీళ్ళనొప్పులు బాధిస్తుంటాయి. ఇంకా వయస్సు పైబడే కొద్ది జాయింట్ పెయిన్స్ బాధించడం సహజం.

ఇక అథ్లెటిక్స్ వారికి నిరంతరం బాధిస్తుంటాయి. అలాగే జిమ్ కు వెళ్ళే వారికి కూడా జాయింట్ పెయిన్స్ అడిక్షన్ గా ఉంటాయి.

అయితే, ప్రస్తుతం జాయింట్ పెయిన్ (కీళ్ళ నొప్పుల)యొక్క బాధితిలో ప్రతి సెకనుకొకరు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా వైరల్ ఫీవర్ వచ్చిన వారు ఖచ్చితంగా కీళ్ళనొప్పుల బారిన పడుతున్నారు. ఈ కీళ్ళనొప్పులు, చేతులు, మోచేతులు, మనికట్టు, వేళ్ళు, మోకాళ్ళు, భుజాలు కొన్ని సందర్భాల్లో తొడల వద్ద కూడా ఎక్కువ నొప్పులకు గురిఅవుతున్నారు.

ఈ రకమైన వైరల్ ఫీవర్ జాయింట్స్ మీద ప్రభావం చూపుతున్నది. ఇలా కీళ్ళ నొప్పులతో బాధపడే వారి శరీరంలో ఏదో కొన్ని క్రిములు శరీరంను తొలచి వేస్తున్నంత బాధను కలిగిస్తున్న భావన కలిగి ఉంటారు . వైరల్ పీవర్ తగ్గినా కూడా కీళ్ళ నొప్పులు కొద్ది రోజుల వరకూ బాధిస్తూనే ఉంటాయి. ఇలా వైరల్ ఫీవర్ వల్ల వచ్చిన కీళ్ళనొప్పులను తగ్గించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటిని కనుక వెంటనే ప్రారంభించినట్లైతే కొంత ఉపశమనం కలిగిస్తాయి.

కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలిగించే సింపుల్ అండ్ నేచురల్ హోం రెమెడీస్ ...

మసాజ్ :

మసాజ్ :

కీళ్ళనొప్పులు నుండి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కా బాడీ మసాజ్. అందులోనూ హేర్బల్ మసాజ్ చేయించుకొన్నట్లైతే మరింత ఎఫెక్టివ్ గా త్వరగా ఉపశమనం పొందవచ్చు . సలూన్స్ లో వివిధ రకాల హేర్బల్ మసాజ్ లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, వైరల్ ఫీవర్ తర్వాత సలూన్ ను సందర్శించడం మంచిది.

హాట్ అండ్ కోల్డ్ కంప్రెసర్:

హాట్ అండ్ కోల్డ్ కంప్రెసర్:

మీ పాదాలను మరియు చేతులను హాట్ వాటర్ లో కొద్దిసేపు ఉంచడం వల్ల ఉపశమనం కలుగుతుంది. అలాగే హాట్ టవల్ ను పాదాలు మరియు చేతులకు, మోకాళ్ళకు చుట్టుడటం వల్ల ఉపశమనం కలుగుతుంది. 15 నిముషాల తర్వాత చల్లటి నీటిలో ముంచిన టవల్ ను చుట్టాలి.

.ఆపిల్ సైడర్ వెనిగర్ :

.ఆపిల్ సైడర్ వెనిగర్ :

వైరల్ ఫీవర్ తర్వాత జాయింట్ పెయిన్ నివారించుకోవాలనుకుంటే ఈ రెండు పద్దతులను ప్రయత్నించండి. మొదట మీ పాదాలను ఆలివ్ ఆియల్ తో మసాజ్ చేయాలి. 15 నిముషాల తర్వాత ఆపిల్ సైడర్ వెనిగర్ ను అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత ఒక గ్లాసు నిమ్మరసం మరియు వెనిగర్ ను మిక్స్ చేసిన నీటిని త్రాగాలి. జాయింట్ పెయిన్ నివారించుకోవడానికి ఇది ఒక నేచురల్ పెయిన్ కిల్లర్ .

పసుపు:

పసుపు:

జాయింట్ పెయిన్ తో బాధపడుతున్నట్లైతే ఆ ప్రదేశంలో కొద్దిగా పసుపును అప్లై చేసి మర్ధన చేయాలి. పసుపులో ఉండే ఇన్ఫ్లమేషన్ లక్షణాలు నొప్పులను తగ్గిస్తాయి.

బెర్రీస్:

బెర్రీస్:

బెర్రీస్ లో విటమిన్ సి అధికంగా ఉంది. ఇది ఎలాంటి నొప్పినైనా తగ్గిస్తాయి . వీటి ప్రభావం ఆలస్యం అయినా, చాలా ఎఫెక్టిగా పనిచేస్తాయి.

ఎప్సమ్ సాల్ట్:

ఎప్సమ్ సాల్ట్:

వైరల్ ఫీవర్ తర్వాత జాయింట్ పెయిన్స్ తో బాధపడుతున్నట్లైతే ఎప్సమ్ సాల్ట్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల ఎప్సమ్ సాల్ట్ ను స్నానం చేసే నీటిలో వేసి ఆ నీటిలో చేతులు, కాళ్ళు డిప్ చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

అల్లం టీ:

అల్లం టీ:

జాయింట్ పెయిన్ నివారించుకోవడానికి మరో మార్గం, టీ ఒక కప్పు హాట్ జింజర్ టీని త్రాగాలి . ఇందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తీసుకోవాలి. ఈ జింజ్ టీ చర్మం మీద ఏర్పడే దద్దుర్లను నివారిస్తుంది . శరీరం మీద కనపడకుండా మాయం చేస్తుంది.

వెల్లుల్లి నొప్పిని నివారిస్తుంది:

వెల్లుల్లి నొప్పిని నివారిస్తుంది:

అల్లం మాదిరే , వెల్లుల్లి కూడా చాలా ఎఫెక్టివ్ హేర్బల్ రెమెడీ. ఇది ఎలాంటి నొప్పినైనా త్వరగా తగ్గిస్తుంది. మీరు వండే వంటల్లో వెల్లుల్లిని చేర్చడం మంచిది. అలాగే వెల్లుల్లిని పేస్ట్ లా చేసి, జాయింట్ పెయిన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తే నొప్పిని నేచురల్ గా తగ్గిస్తుంది.

మెంతులు:

మెంతులు:

శరీరంలో నొప్పులను నివారించడంలో మెంతులు చాలా గ్రేట్ గా సహాయపడుతాయి . కొద్దిగా మెంతులను నీటిలో వేసి రాత్రంగా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపుతో నీటిని త్రాగేసి, మెంతులను కూడా మింగేయాలి . మెంతులు మరియు నానబెట్టిన నీరు నొప్పులను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

విటమిన్ కె ఫుడ్స్:

విటమిన్ కె ఫుడ్స్:

విటమిన్ కె ఫుడ్స్ లో మినిరల్స్ మరియు క్యాల్షియం అధికంగా ఉన్నాయి . ఇవి మీ జాయింట్స్ నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి మీ డైలీ డైట్ లో విటమిన్ కె ఫుడ్స్ ను చేర్చుకోవాలి .

English summary

Put An End To Joint Pain After Viral Fever With Home Remedies: Health Tips in Telugu

But, today almost every second person is down with joint pain especially after viral fever. The advanced type of fever which is raging in the city brings upon pain in the wrist, knees, ankles, shoulders, elbow and even the hips.
Story first published: Wednesday, September 16, 2015, 16:44 [IST]
Desktop Bottom Promotion