Latest Updates
-
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి!
మీ లివర్ డేంజర్ జోన్ లో ఉన్నది తెలిపే కొన్ని లక్షణాలు
మన శరీరంలో అత్యంత పెద్ద అవయవం కాలేయం(లివర్). మన శరీరం ఆరోగ్యంగా ఉంచడానికి అనేకవిధాలుగా ముఖ్య విధులను నిర్వర్ధిస్తుంది. మన శరీరంలో అతిపెద్ద అవయవం లివరే..!లివర్(కాలేయం) పెద్ద అవయవమే కాదు అతి ప్రత్యే కమైన అవయవం కూడా! శరీరంలో ఐదుకి పైగా పనుల్ని నిర్వర్తిస్తోంది. వెయ్యికి పైగా ఎంజైమ్స్‌ని లివర్ తయారు చేస్తుంటుంది. శరీరంలో ఎక్కడైనా గాయం అయినప్పుడు రక్తం కొద్దిసేపు కారి, అక్కడ గడ్డకట్టి, రక్తం కారిపోతోందంటే అందుకు అవసరమైన ఎంజైమ్స్‌ని లివరే ఉత్పత్తిచేస్తుంది. అనారోగ్యాలు కలిగినప్పుడు, వాటినుంచి తట్టుకోవడానికి అవసరమైన ‘యాంటిబాడీస్‌ని కాలేయమే(లివర్) ఉత్పత్తి చేస్తుంది.
మద్యపానం ఒక్కటే లివర్ డ్యామేజ్ కు కారణం కాదు. మేము మద్యం త్రాగము కాబట్టి మాకు లివర్ డ్యామేజ్ సమస్యలు ఏం ఉండవనుకోవడం చాలా పొరపాటు. కొన్ని సార్లు మీరు తీసుకొనే ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల కాలేయం చుట్టూ అధికంగా క్రొవ్వు చేరుతుంది. దీన్ని ఫ్యాటీ లివర్ సిండ్రోమ్ అంటారు. అంతే కాదు దీన్ని లివర్ డ్యామేజ్ గా కూడా వర్గీకరిస్తారు. అంతే కాదు కాలేయ వ్యాధులు వివిధ రకాలుగా ఉన్నాయి.
READ MORE: లివర్ (కాలేయ)వ్యాధులను ఉత్తమ చికిత్సనందించే 14 హోం రెమెడీస్
చిన్న వయస్సులోనే లివర్ డ్యామేజ్ అయితే అది ప్రాణానికే ప్రమాధంగా గుర్తించాలి . అందుకు లివర్ డ్యామేజ్ లక్షణాలను వెంటవెంటనే గుర్తించాలి. ఎందుకంటే ఎటువంటి సంకేతాలు లేకుండా లివర్ డ్యామేజ్ అవుతుంటాయి. సడన్ గా బయటపడుతుంటాయి. కాబట్టి, మనకు తెలియకుండా లివర్ డ్యామేజ్ కు కారణం అయ్యే కొన్ని లక్షణాలు ఈ క్రింది విధంగా గుర్తించండి...ఆరోగ్యాన్ని కాపాడుకోండి......

లివర్ ఫైబ్రోసిస్:
లివర్ డ్యామేజ్ అవ్వడం వల్ల కణజాలాల్లో ఫైబ్రయోస్ స్కార్స్ వల్ల కాళ్లల్లో కొద్దిగా వాపులు కనబడుతాయి.

కామెర్లు:
చర్మంలో పసుపుపచ్చవర్ణంలో మరియు కళ్ళు లేత పసుపు రంగులోకి మారినట్లైతే అది జాండీస్ (కామెర్ల)కు చిహ్నంగా గుర్గించాలి. పాలిపోయిన చర్మం, కళ్ళు పచ్చరంగులో మారడం దెబ్బతిన్న కాలేయానికి లక్షణాలు. పచ్చని చర్మం, తెల్లని కళ్ళు బిలిరుబిన్ (బిల్ పిగ్మేంట్) వలె రక్తంలో పెరుగుతుంది, ఇది శరీరం నుండి మలినాలను తొలగించ లేదు.

లివర్ సిస్ట్:
కాలేయంలో సిస్టులు (గడ్డలు)వంటివి ఏర్పడినప్పుడు నొప్పి మెలిపెడుతుంటుంది. పరిస్థితి తీవ్రమైనప్పుడు లక్షణాలు బయటపడుతాయి. పొత్తికడుపు, ప్రత్యేకంగా పొత్తికడుపు పైన కుడివైపు మూలన లేదా పక్కటేముకకు కింద కుడి భాగంలో నొప్పి ఉంటే అది కాలేయం దెబ్బతిన్న లక్షణాన్ని సూచిస్తుంది.

హెపటైటిస్:
లివర్ సమస్యలు తీవ్రమైనప్పుడు, అలాంటి పరిస్థితిని హెపటైటిస్ గా పిలుస్తారు . ఇలాంటి స్థితిలో వాంతులు, అలసట, జ్వరం, కళ్ళు తిరగడం, మరియు జలుబు వంటి లక్షణాలుతో రోగి బాధపడుతారు.

ఆల్కహాల్ తీసుకోవడం
జీవక్రియలు సరిగా పనిచేయనప్పుడు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది. మగతగా ఉండటం మరియు గందరగోళం వంటి లక్షణాలు కాలేయ సమస్యలను సూచిస్తుంది.

వికారం:
కాలేయం సరిగా పనిచేయనప్పుడు, వికారంగా అగుపించవచ్చు. తిన్నది సరిగా జీర్ణం అవ్వని పరిస్థితిలో వెంటనే డాక్టర్ ను సంప్రదించి, చికిత్స చేయించుకోవాలి.

మూత్రం ముదురు రంగులో ఉండటం:
కాలేయ వ్యాధులకు మరో సూచన డార్క్ ఎల్లో యూరిన్ . ఇలాంటి పరిస్థితిలో మెడికల్ చెకప్ తప్పనిసరి.

అలసట:
దీర్ఘకాలం పాటు, తరచూ అలసటకు గురి అవుతున్నట్లైతే అది కాలేయ వ్యాధిలకు సూచన. ఇలాంటి వాటికి కేవలం వైద్యపరమైన టెస్ట్ లు మాత్రమే నిర్ధారించగలవు.

ఫ్యాటీ లివర్:
ఫ్యాటీ లివర్ వ్యాధులకు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కూడా కారణం అవుతుంది . ఆరోగ్యకరమైన ఆహారం మరియు సరైన నిద్ర పొందడం ద్వారా కాలేయం యొక్క ఆరోగ్యానికి చిరకాలం కాపాడుకోవచ్చు.



Click it and Unblock the Notifications











