For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొగరాయుళ్ళూ....మీ ఊపిరితిత్తును శుభ్రం చేసుకుంటున్నారా...

|

ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న క్యాన్సర్ మరణాల్లో మూడోవంతు ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగానే కలుగుతున్నాయి. రొమ్ము, పెద్దపేగు, ప్రోస్టేట్ క్యాన్సర్‌లు.. ఈ మొత్తాన్ని కలుపుకున్నా, వాటన్నిటికంటే ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో సంభవించే మరణాలే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అంటే దీని తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు అనేక అంశాలు దోహదపడతాయి. మన దేశంలో 90 శాతం కేసుల్లో క్యాన్సర్ వ్యాప్తికి పొగాకు వాడకమే ప్రధాన కారణం. సాధారణ వ్యక్తితో పోలిస్తే పొగతాగేవారిలో ఈ వ్యాధి రావడానికి అవకాశాలు 2.5 రెట్లు ఎక్కువ. అయితే పొగతాగడం అలవాటు లేని ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్లలో 65 శాతం మహిళలు కాగా... కేవలం 35 శాతం మంది మాత్రమే పురుషులున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటున్న వివరాల మేరకు వాతావరణ కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణం.

శ్వాసకోస వ్యాధులలో అస్తమా కన్నా చాలా భయంకరమైనది ఈ సిఒపిడి వ్యాధి, భారతదేశంలో ప్రతీ 10 మందిలో ఒకరికి ఈ వ్యాధి ఉంటుందని, 40 సంవత్స రాలు పైబడిన వారిలో ఈ వ్యాధి లక్షణాలు చాలా మటుకు కనిస్తాయన్నారు. సిగరేట్స్‌ త్రాగడం, వాతావరణ కాలుష్యం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వస్తుందని ఈ వ్యాధి వచ్చిన మొదటి దశలో దగ్గు, ఆయసం ఉంటుందని, దానిని మనం నిర్లక్ష్యం చేస్తే మనిషి చాలా నీరసపడి తన పనులు తాను చేసుకునే శక్తి కూడా కొల్పోతాడు. దీనంతటికి కారణం పొగాకులో ఉండే నికోటిన్. కాబట్టి, రక్తంలో నికోటిన్ తొలగించాలన్నా మరియు ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవాలన్నా కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. ఈ టిప్స్ ను అనుసరిస్తే జీవిత కాలం పాటు ఆరోగ్యంగా జీవించవచ్చు.

మరి ఆయుష్యును పెంచే ఊపిరితిత్తులను ఎలా శుభ్రపరుచుకోవాలో చూద్దాం...

1. యోగ:

1. యోగ:

లంగ్స్ శుభ్రపరచడంలో యోగా గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖ్యంగా డీప్ బ్రీతింగ్ ఇన్ అండ్ అవుట్ వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేయబడుతాయి . కాబట్టి, రెగ్యులర్ గా యోగా చేస్తే ఊపిరితిత్తులను శుభ్ర పరుచుకోవచ్చు . యోగా వల్ల కూడా లంగ్స్ ప్యూరిఫై అవుతాయి.

2. తులసి:

2. తులసి:

పుదీనా: స్మోక్ చేవారు, సీరియస్ గా లంగ్స్ శుభ్రపరుచకోవాలనుకుంటున్నట్లైతే, ఒక్క మంచి మార్గంలో మీ రెగ్యులర్ డైట్ లో పుదీనా చేర్చుకోవడమే . పుదీనాలో దాగి ఉండే ఔషధగుణాలు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి హాని చేసే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా నివారిస్తుంది.

3. ఓరిగానో:

3. ఓరిగానో:

ముఖ్యంగా స్మోకర్స్ కు ఇది చాలా గ్రేట్ గా పనిచేస్తుంది. స్మోకర్స్ యొక్క డైట్ లో తీసుకొనే ఆహారాల్లో గార్నిష్ లేడా టాపింగ్ గా వేసుకొని తినవచ్చు . దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల లంగ్స్ ను శుభ్రం చేస్తుంది. మరియు పొగను శుభ్రంగా తొలగిస్తుంది. ఎలాంటి సమస్య లేకుండా శ్వాసనాళాన్ని శుభ్రపరుస్తుంది.

4. పైనాపిల్:

4. పైనాపిల్:

యాంటీఆక్సిడ్స్ మరియు విటమిన్ సి అధికంగా ఉండే పైనాపిల్ ను రెగ్యులర్ గా తీసుకుంటే లంగ్స్ ను శుభ్రపరుచుకోవచ్చు . ఈ రెండు పోషకాంశాలు డైట్ లో చేర్చుకోవడం వల్ల లంగ్స్ ఆటోమ్యాటిక్ గా శుభ్రపడుతాయి. పైనాపిల్ తో పాటు క్రాన్ బెర్రీ జ్యూస్ ను కూడా డైలీ డైట్ లో చేర్చుకోవడం మంచిది.

5. జింజర్:

5. జింజర్:

ఈ మసాలా దినుసు అదనపు రుచి మరియు ఆరోగ్యాన్ని పెంచటానికి మీ భోజనంలో దీనిని పొందుపరచటం చాలా సులభం. శోథ నిరోధక చర్య ద్వారా మీ ఊపిరితిత్తులను క్లియర్ చేయటం మరియు అనేక అనారోగ్య సమస్యలకు దారితీసే కాలుష్యం నుండి లంగ్స్ ను కాపాడుతుంది. ముఖ్యంగా నాజల్ బ్లాకేజ్ ను అరికడుతుంది . కాబట్టి, అల్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అలాగే పచ్చిది తినడం కూడా మంచిదే . శ్వాససంబంధిత సమస్యలను నివారించుకోవచ్చ. లంగ్స్ లోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేయడానికి ఉపయోగపడుతుంది.

6. క్యారెట్స్:

6. క్యారెట్స్:

కెరోటినాయిడ్స్ ఉన్న ఆహారాలు క్యారట్,చిలకడదుంప,ముదురు ఆకుపచ్చని కూరలు,టమాటా వంటి కొన్ని పండ్లు మరియు కూరగాయలలో కెరోటినాయిడ్స్ ఉంటాయి. కెరోటినాయిడ్స్ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే ఒక ఉత్తమ యాంటిఆక్సిడెంట్ ను కలిగి ఉంటుంది. ఉబ్బసం రోగులకు మంచి ఉపశమనంను కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కోసం కెరోటినాయిడ్ ఉన్న కూరగాయలను తీసుకోవాలి.

7. నిమ్మరసం:

7. నిమ్మరసం:

నిమ్మరం ఆరోగ్య పరంగా ఒక దివ్వౌషది. ఎందుకంటే , ఇది అన్ని రకాల అనారోగ్య సమస్యలను ఏదో ఒక రంగా నివారిస్తుంది . కాబట్టి ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు నిమ్మరసం త్రాగి లంగ్స్ ను శుభ్రపరచుకోవడంతో పాటు, ఊపిరితిత్తులను నేచురల్ గా బలోపేతం చేసుకోండి.

8. గ్రీన్ టీ:

8. గ్రీన్ టీ:

స్మోకర్స్ కు గ్రీన్ టీ కూడా ఒక మంచి ఔషధి. ఈ పవర్ ఫుల్ టీ టాక్సిన్స్ ను నివారిస్తుంది మరియు ప్రేగులను శుభ్రపరిచి,మలబద్దక సమస్య లేకుండా చేస్తుంది మరియు ఇతర అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. ప్రతి రోజూ గ్రీన్ టీ త్రాగడం వల్ల లంగ్స్ ను ఫ్యూరిఫై చేస్తుంది.

9. డైరీ ప్రొడక్ట్స్ కు దూరంగా:

9. డైరీ ప్రొడక్ట్స్ కు దూరంగా:

ఊపిరితిత్తులను శుభ్రం చేసుకొనే ప్లాన్ లో ఉన్నప్పుడు డైరీప్రొడక్ట్స్ కు దూరంగా ఉండండి. ఈ డైరీ ఫ్రొడక్ట్స్ మీ క్లెన్సింగ్ ప్లానింగ్ లో ఇంటర్ ఫియర్ అయ్యే అవకాశం ఉంది.

10. సిగరెట్స్:

10. సిగరెట్స్:

ప్రతి రోజూ స్మోకింగ్ చేయుట వలన ఊపిరితిత్తులు దారుణముగా మారతాయి. ధూమపానం విషయానికి వస్తే ఏటువంటి సురక్షితమైన స్థాయి లేదు. ఎక్కువ స్మోక్ చేయుట వలన దీర్ఘకాల బ్రోన్కైటిస్,ఎంఫిసెమా, COPD, ఊపిరితిత్తుల కాన్సర్ వంటి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. స్మోక్ చేయటం చాలా హానికరం. స్మోక్ చేయుట వలన కేవలం వాతావరణంనకు మాత్రమే కాకుండా ప్రక్కన ఉన్న వారికీ కూడా చాలా ప్రమాదకరం. సిగరెట్లను మాత్రమే మానివేస్తే సరిపోదు. గంజాయి,పైపులు లేదా సిగార్లు కూడా మీ ఊపిరితిత్తులకు ఇదే విధంగా హాని చేయవచ్చు.

English summary

Simple Ways Smokers Can Purify Their Lungs

For those of you who are addicted to the butt, there is hope after all...... A recent study shows that smokers can now cleanse their lungs in the most simplest of ways. Keeping this study in mind, Boldsky has come up with a handful of things smokers can now follow if they want to get rid of the nicotine in their blood and the smoke from their lungs.
Desktop Bottom Promotion