Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
లేడీస్ స్పెషల్: ఆ సమయంలో నిప్పి నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్..!
మహిళలను వేధించే సమస్య పిరియడ్ ప్రాబ్లమ్... ప్రతినెల నెలసరి సమయంలో తప్పకుండా వచ్చే కడుపు నొప్పి తట్టుకోలేక విలవిలాడుతారు. మహిళలో వచ్చే పిరియడ్ నొప్పులను బహిష్టు నొప్పి అని కూడా అంటారు. ఈ రకమైన నొప్పి మీకు లేకుంటే కనుక మీరు అదృష్టవంతులైన యువతులే. చాలామంది యువతులకు ఈ నొప్పి ప్రతినెలా నెలసరి సమయంలో వస్తుంది. పీరియడ్స్ అయ్యే ముందు, అయిన తర్వాత కూడా యువతులు ఈ నొప్పితో ఎక్కువగా బాధ పడతారు.
కొంత మందికి నెలసరికీ నెలసరికీ మధ్యలోనూ రక్తస్రావం అవుతుంది. నెలసరి సమయంలో గానీ లేదా అంతకు ముందు గానీ తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. కొంతమందిలో నెలసరి ఈ నొప్పి మరింత తీవ్రదశలో ఉంటుంది. ఋతువు ప్రారంభానికి ఒక రోజు ముందు పొత్తికడుపులో కండరాలు ఎవరో గట్టిగా పట్టుకుని సలుపుతున్నట్లుగా మొదలై అది ఋతు సమయంలో మరింత ఎక్కువగా ఏర్పడుతుంది. దీనితో పాటే కడుపులో వికారం, సొమ్మసిల్లిపోవడం వంటి లక్షణాలు ఏర్సడుతాయి.
కడుపులో మెలిపెట్టినట్టు వుండటం, చికాకు, తీవ్ర అసౌకర్యం వుంటాయి. అపుడపుడూ ఈ నొప్పి మరింత అధికంగా వుంటుంది. గుచ్చుకున్న అనుభూతి పొట్ట అంతా మరియు ప్రత్యేకించి పొత్తికడుపు భాగంలో వస్తుంది. కొంతమంది యువతులకు కళ్ళు బైర్లు కమ్మటం, వాంతులు, డయోరియా, వంటివి కూడా వుంటాయి. ఇవి ఎపుడైతే ఏర్పడుతాయో అపుడే మీరు ఈ నొప్పి చాలాతీవ్రంగా వుందని గ్రహించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం ఏవేవో చిట్కాలు పాటిస్తుంటారు కానీ, ఎలాంటి ప్రయోజనాలుండవు. తిరిగి అదే సమస్య...
ఈ పరిస్ధితికి ఆందోళన చెందాల్సింది లేదు. ఈ పిరియడ్ నొప్పులు నియంత్రించేందుకు అనేక మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే...

1. నిద్ర:
ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉండరో అప్పుడు ఆరోగ్యానికి ఒక బెస్ట్ అండ్ రెడిమేడ్ రెమెడీ నిద్ర. నిద్రసమయంలో శరీరంలోని మజిల్స్, ఇతర ఆర్గాన్స్ రిలాక్స్ అండ్ రికవర్ అవుతాయి. పీరియడ్స్ సమయంలో నొప్పినివారణకు మ్యాజిక్ నిద్ర ఒక మంచి మార్గం . ఎక్కువ సమయం నిద్రించి బెటర్ గా రిలాక్స్డ్ గా నిద్రలేచి చూడండి మార్పు మీకే తెలుస్తుంది.

2. మసాజ్:
పీరియడ్స్ లో పొట్టనొప్పిగా ఉన్నప్పుడు తేలికగా సున్నితమైన మసాజ్ వల్ల పొట్ట కండరాలు వదులై రిలాక్స్ అవుతాయి. దాంతో మీకు నొప్పి నుండి రిలీఫ్ అవుతుంది. పొట్ట కండరాలను రిలాక్స్ చేసినప్పుడు మీరు మరింత బెటర్ గా ఫీలవుతారు.

3. హాట్ ప్యాడ్స్:
హాట్ ప్యాడ్స్ లేదా హాట్ వాటర్ బాటిల్స్ ను ప్లేస్ చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది . కానీ మెలుకుగా ఉన్నంత వరేకే హాట్ ప్యాడ్ ఉపయోగించాలి. నిద్రవస్తుందనుకొన్నప్పుడు హాట్ ప్యాడ్ ను దూరంగా ఉంచాలి.

4. వేడిగా స్నానం:
హాట్ ప్యాడ్స్ ఇచ్చిన రిలీఫ్ నే వార్మ్ బాత్ కూడా ఇస్తుంది . వామ్ గా షవర్ బాగ్ తీసుకోవడం వల్ల పెయిన్ ఫుల్ పీరియడ్ ఎక్కువ సమయం మిమ్మల్ని వేధించదు.

5. ఫ్రీక్వెంట్ గా లైట్ మీల్స్ :
పీరియడ్స్ లో నొప్పి ఉన్నప్పుడు, లైట్ మీల్స్ తీసుకోవాలి. ఫుల్ మీల్స్ తీసుకోవడం వల్ల అసౌకర్యంగా ఉంటుంది. అందుకోసం చిన్నపోర్షన్ లేదా లైట్ మీల్స్ తీసుకోవడం ఉత్తమం . అది కూడా గ్యాప్ ఇచ్చి ప్రతి నాలుగు గంటలకొకసారి తీసుకోవడం మరింత మంచిది . ఇలా తీసుకోవడం వల్ల ఎలాంటి అసౌకర్యం లేకుండా చేస్తుంది

6. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్:
పీరియడ్స్ సమయంలో రిఫైండ్ ప్లేవర్స్ కు దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు నిపుణులు. రిఫైండ్ ఫ్లోర్స్ జీర్ణం అవ్వడానికి కష్టం అవుతుంది. మరియు ఇతర నొప్పులకు దారితీస్తుంది.

7. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ :
మీ శరీరం ఎలాంటి సమస్యలను ఎదుర్కుంటున్నది అన్నదాంతో సంబంధం లేదు, ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ ఎల్లప్పుడూ ఆరోగ్యానికి మేలు చేసేవే . అదే విధంగా పీరియడ్స్ సమయంలో కూడా ఇదే విధంగా పనిచేస్తాయి . ఇవి పొట్టలలో తేలికగా ఉంటాయి. మరియు షుగర్ కంటెంట్ తక్కువ. ఫ్లూయిడ్స్ మరియు విటమిన్స్ తో నిండి ఉంటుంది.

8. కాఫీ నివారించాలి:
కాఫీలోని కెఫిన్ కొంత మందిలో మరికొన్ని ఇతర నొప్పులకు దారితీస్తుంది . మీరు కనుక కాఫీ డ్రింకర్ అయితే అందులోనే పెయిన్ ఫుల్ పీరియడ్స్ ఉన్నట్లైతే వెంటనే కాఫీ త్రాగడం మానేయాలి . మార్పులున్నట్లైతే రోజులో ఒక కప్పు కాఫీతో సరిపెట్టుకోవాలి. లేదంటే పూర్తిగామానేయాలి.

9. సాల్ట్ అండ్ షుగర్ ఫుడ్స్ నివారించాలి:
ఆరోగ్యానికి ఎక్కువ ఉప్పు మరియు షుగర్ ఉన్న ఆహారాలు అంత మంచివి కాదు . ఎప్పుడైతే పొట్ట అనారోగ్యానికి గురౌతుందో అప్పుడు నొప్పి తీవ్రస్థితిలో ఉంటుంది . కాబట్టి ఉప్పు మరియు పంచదార తీసుకోవడం తగ్గించాలి.

10. ద్రవాలు తీసుకోవడం పెంచాలి:
పీరియడ్స్ సమయంలో శరీరం ఎక్కువ రక్తంను కోల్పోతుంది. శరీరంను హైడ్రేషన్ లో ఉంచుకోవడానికి ఫ్లూయిడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి . అందుకు గ్రీన్ టీ మరియు హేర్బల్ టీలు, హెల్తీ జ్యూసులు సహాయపడుతాయి.

11.యాంటీఇన్ఫ్లమేటరీ టాబ్లెట్స్:
నొప్పి నివారణకు యాంటీఇన్ఫ్లమేటరీ టాబ్లెట్స్ ను తీసుకోవాలి . ఇవి నొప్పిని తగ్గించడం దీర్ఘకాలికంగా తగ్గించకపోయినా, తాత్కలికంగా ఉపశమనం కలిగిస్తాయి.

12. వ్యాయామం:
పీరియడ్స్ సమయంలో నొప్పులను నివారించుకోవడానికి వ్యాయామం గ్రేట్ గా సహాయపడుతుంది . వ్యాయామం వల్ల మజిల్స్ ఫ్లెక్సిబుల్ గా మారుతాయి . దాంతో నొప్పులను తగ్గించుకోవచ్చు .

13. బరువు తగ్గాలి:
ఓవర్ వెయిట్ ఉన్నవారు పీరియడ్స్ నొప్పులకు అధిక బరువు కూడా ఒక కారణమే. కాబట్టి బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.

14. యాక్టివ్ గా ఉండాలి:
మీఅంతట మీరు యాక్టివ్ గా ఉండటం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇవి మిమ్మల్ని హెల్తీగా ఉంచడం మాత్రమే కాదు, ఎలాంటి నొప్పులు లేకుండా పీరియడ్స్ వచ్చిపోతుంటాయి.

15. విటమిన్ బూస్ట్:
శరీరానికి అవసరం అయ్యే విటమిన్స్ ను అధికంగా అందివ్వాలి. విటమిన్స్, న్యూట్రీషియన్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం హెల్తీగా మరియు ఫిట్ గా ఉంచడంతో పాటు చిన్న చిన్న అనారోగ్య సమస్యలను నివారిస్తుంది . హెల్తీ డైట్ చాలా ముఖ్యం, అందుకోసం మీకు అవసరం అయితే మల్టీ విటమిన్ క్యాప్స్యూల్స్ ను కూడా తీసుకోవచ్చు.



Click it and Unblock the Notifications











