For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : నాలుక తెల్లగా ఉంటే క్యాన్సర్ కు సంకేతమా...?

|

మీరు ఏదైనా ఆహారం తిన్నప్పుడు, టేస్ట్ డిఫరెంట్ గా తెలుస్తున్నదా.. లేదా మీ నాలుక చాలా మందంగా..ఏది తిన్నా రుచికరంగా అనిపించుట లేదా..? ఇంకా బ్యాడ్ బ్రీత్ ఫీలింగ్ మీకు కలుగుతున్నట్లైతే ఖచ్చితంగా అది వైట్ టంగ్ (నాలుక తెల్లగా ఉంటుంది)ఒక సారి చెక్ చేసుకోండి..

సహజంగా మన నాలుక పింక్ కలర్లో ఉంటుంది. అయితే నాలుక మీద వైట్ కోటింగ్ ఉన్నట్లైతే అది చూడటానికి చాలా అసహ్యంగా ఉంటుంది. పైన సూచించిన లక్షణాలన్నీ కూడా వైట్ టంగ్ కు కారణమవుతాయి. వైట్ టంగ్ (నాలుక)తెల్లగా మారడానికి ఆహారాలు కారణం కావచ్చు, డెడ్ స్కిన్ సెల్స్ మరియు బ్యాక్టీరియా కూడా కారమవ్వొచ్చు, . ఇంకా నోటి సరైన నోటి శుభ్రతను పాటించకపోవడం, ఎక్కువగా స్మోక్ చేయడం, ఆల్కహాల్ తీసుకోవడం, డీహైడ్రేషన్ వల్ల నోరు డ్రైగా మారుతుంది. ఇవన్నీ నాలుకు తెల్లగా మారడానికి కారణమవుతుంది.

అలాగే హైఫీవర్ తో బాధపడే వారిలో లేదా జాండీష్ ఉన్న వారిలో నాలుక తెల్లగా ఉంటుంది. ముఖ్యంగా మెడిసిన్స్ తీసుకోవడం, లేదా యాంటీ బయోటిక్స్ వాడటం వల్ల నాలుక తెల్లగా మారుతుంది. తరచూ నాలుక తెల్లగా మారుతుంటే..వెంటనే డాక్టర్ ను కలవాలి. లేదంటే ఇది క్రోనిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. క్రమంగా లుకోప్లాకియా లేదా క్యాన్సర్ కు దారితీస్తుంది. కాబట్టి నాలుక తెల్లగా మారడం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా క్యాన్సర్ బారీనా పడుతారు. అలా జరకుండా ఉండాలంటే కొన్ని మెడికేషన్స్ అందుబాటులో ఉన్నాయి, అలాగే వైట్ టంగ్ నివారించుకోవడానికి కొన్ని మౌత్ వాష్ లు మెడికల్ స్టోర్స్ లో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా...

అలోవెర:

అలోవెర:

కలబందలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ఇవి నాలుక తెల్లగా మారకుండా నివారిస్తాయి. అలోవెర జ్యూస్ ను నాలుక మీద వేసుకుని రుద్ది వాష్ చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మంచి ఫలితం టుంది.

పసుపు:

పసుపు:

పసుపులో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీఫంగల్ లక్షణాలున్నాయి. కొద్దిగా పసుపు తీసుకుని నాలుక మీద వేసుకుని రబ్ చేయాలి. తర్వాత నోటి నిండా నీళ్ళు పోసి పుక్కలించి వాష్ చేసుకోవాలి. ఇది బ్యాడ్ బ్రీత్, వైట్ టంగ్ ను నివారిస్తుంది.

గోరువెచ్చని ఉప్పు నీళ్ళు:

గోరువెచ్చని ఉప్పు నీళ్ళు:

గోరువెచ్చని నీటిలో ఒక చెంచా ఉప్పు వేసి, నోట్లో పోసుకుని పుక్కలించాలి. ఈ నేచురల్ మౌత్ వాష్ ను ఉపయోగించడం వల్ల వైట్ టంగ్ ను నివారిస్తుంది.

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ:

నిమ్మరసంలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని నాలుక మీద వేసి రుద్దాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నాలుక మీద తెల్లన పొర తొలగిపోతుంది.

పెరుగు:

పెరుగు:

పెరుగు ప్రోబయోటిక్ రెమెడీ. ఇది బ్యాక్టీరియాను మరియు ఫంగస్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. డైలీ డైట్ లో పెరుగు చేర్చుకోవడం మంచిది.

నిమ్మరసం :

నిమ్మరసం :

నోట్లో బ్యాక్టీరియాను తొలగిస్తుంది. దాంతో నాలుక మీద వైట్ లేయర్ తొలగిస్తుంది. ఫ్రెష్ గా ఉండే నిమ్మరసం తీసుకుని నీటిలో మిక్స్ చేసి శుభ్రం చేసుకోవాలి.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిలో యాంటీఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది నాలుక మీద బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో వెల్లుల్లి రెబ్బలు చేర్చుకోవాలి. లేదా పచ్చి వెల్లుల్లిని నమిలి తినాలి.

 గ్లిజరిన్ :

గ్లిజరిన్ :

కొద్దిగా గ్లిజరిన్ తీసుకుని నాలుక మీద వేసుకుని బ్రష్ చేయాలి. ఇది నాలుక మీద ఉన్న వైట్ లేయర్ ను తొలగిస్తుంది.

 నీళ్ళు :

నీళ్ళు :

రోజూ నీళ్ళు ఎక్కువగా తాగాలి. శరీరంను సాధ్యమైనంత వరకూ హైడ్రేషన్ లోఉంచుకోవాలి. ఎక్కువగా నీళ్ళు తాగడం వల్ల వైట్ టంగ్ ను నివారించుకోవచ్చు.

వేప:

వేప:

వేపలో నేచురల్ యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. కొన్ని వేప ఆకులను తీసుకుని, నీటిలో వేసి బాయిల్ చేయాలి. చల్లారిన తర్వాత నోట్లో పోసుకుని శుభ్రం చేసుకోవాలి. వైట్ టంగ్ సమస్య ఎఫెక్టివ్ గా తొలగిపోతుంది.

English summary

10 Amazing Ingredients To Clean Your White Tongue

Do you feel that the food you eat tastes different, or that your tongue has become thicker and you also have bad breath? Check it for yourself. This might be due to a white tongue.
Story first published: Tuesday, September 13, 2016, 16:05 [IST]
Desktop Bottom Promotion