Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బెంగాలీ ఝల్ మురి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
ఇన్స్టాగ్రామ్ 'ఆస్ట్రో-హీలర్' అరెస్ట్: సెక్స్టార్షన్ వెనుక ఉన్న భయంకరమైన నిజాలివే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే -
జీడిమెట్లలో దారుణం: సహజీవనం చేస్తున్న వ్యక్తిని చంపిన తల్లి, కొడుకు… అసలు కారణం తెలిస్తే షాక్! -
తెలంగాణలో నిప్పుల కొలిమి: పీరియడ్స్ సమయంలో ఎండల నుంచి తప్పించుకోవడం ఎలా? -
క్రేజీ రెసిపీ..ఎప్పుడైనా క్రిస్పీ గుమ్మడికాయ పూరీ రుచి చూశారా? అదిరిపోయే టేస్ట్ తో పాటు హెల్తీ కూడా.. -
మే 5: ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
నేటి ధన యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు, జాక్ పాట్ పక్కా! -
అంగారక సంకష్ట చతుర్థి: ఈ రోజు ఉపవాసం ఉంటే కష్టాలన్నీ తీరిపోతాయా? చంద్రోదయ సమయాలు, పూజా విధానం ఇదే! -
2026 మే 5 గ్రహ సంచారం: మీ జాతకంలో కొత్త ఉత్తేజం.. ఆ మార్పులు మీ కోసమే!
తుమ్ములు ఇబ్బంది పెడుతుంటే? తక్షణ ఉపశమనం కలిగించే హోం రెమెడీస్
సాధారణంగా కొందరు నిద్ర లేస్తూనే తుమ్ములతో లేస్తుంటారు. అంతే కాదు, ఈ తుమ్ములు కొన్ని గంటల వరకూ మద్య మద్యలో వస్తూనే ఉంటాయి. తుమ్ముల వల్ల చికాకు, పక్కవారికి ఇబ్బంది. కాబట్టి, ఇలా ఎక్కువ సమయం లేదా తరచూ వేధించే తుమ్ములను వెంటనే తగ్గించుకోవాలి. తుమ్ములు రాకుండా ఎలా నివారించుకోవడం అని ఆలోచిస్తున్నారా..?ఖచ్చితంగా మీకోసం కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. తుమ్ములతో బాధ పడే వారికి ఇవి ఎఫెక్టివ్ గా, త్వరగా ఉపశమనం కలిగిస్తాయి.
గత రాత్రి మీరు నిద్రించడానికి ముందు బాగానే ఉన్నారు...మరి ఉదయం లేవగానే తుమ్ములు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయి? దుమ్ము, ధూళి ముక్కుల్లో చేరడం వల్ల? గొంతులో, ముక్కులోని మ్యూకస్ కు చీకాకు కలుగడం వల్ల నిరంతరం తుమ్ములు బాధిస్తాయి. ఇంకా కొన్ని సందర్బాల్లో వాతావరణంలో మార్పులు వల్ల , జలుబు కారణంగా, అలర్జీల కారణంగా తుమ్ములు బాధిస్తాయి.
ఆగకుండా తుమ్ములు రావడానికి కారణమేదైనా...వాటిని తగ్గించుకోవడానికి కొన్ని మెడికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే అందుబాటులో ఉన్న అన్ని రకాల ట్రీట్మెంట్ కంటే ఇంట్లో చౌకగా ఉండే కొన్ని హోం రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, తర్వగా ఉపశమనం కలిగిస్తాయి.తమ్ముల నుండి ఉపశమనం కలిగించే కొన్ని ఫర్ఫెక్ట్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా..

అల్లం :
తుమ్ములు నివారించడంలో అల్లం బెస్ట్ నేచురల్ రెమెడీ. అల్లంతో తయారుచేసిన టీని తాగడం లేదా జింజర్ పౌడర్ ను తేనెతో మిక్స్ చేసి తాగడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది.

వెల్లుల్లి:
నిరంతరం బాధించే తుమ్ముల నుండి తక్షణ ఉపశమనం పొందాలంటే, వెల్లుల్లిని ఉపయోగించండి. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వెల్లుల్లి రెబ్బలను మెత్తగా దంచి, వేడినీటిలో వేసి మరిగించాలి. కొద్దిసేపటి తర్వాత ఈ నీటిని వడగట్టి, కొద్దిగా కొద్దిగా రోజంతా తగడంతో ఉపశమనం కలుగుతుంది. లేదా వెల్లుల్లి రెబ్బలను వేడి నీటిలో వేసి మరిగించి ఆవిరి పట్టాలి.

దాల్చిన చెక్క:
దాల్చిన చెక్కలో యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ తీసుకుని, ఒక టీస్పూన్ తేనెలో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల తుమ్ములు, జలుబు నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

తేనె మరియు నిమ్మరసం:
నిరంతరం బాధిస్తున్న తుమ్ములను నివారించే బెస్ట్ కాంబినేషన్ ఇది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, నిమ్మరసంలో విటమిన్ సి గ్రేట్ గా సహాయపడుతాయి. ఈ రెండింటిని ఒక్కోక్కో స్పూన్ ను గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి , తాగాలి. తుమ్ములను నివారించడంలో బెస్ట్ హోం రెమెడీ.

చమోమెలీ టీ:
ఆగకుండా తుమ్ములు ఇబ్బంది పెడుతుంటే, రోజుకు రెండు సార్లు చమోమెలీ టీని తాగండి. . తుమ్ముల నుండి తక్షన ఉపశమనం కలిగిస్తుంది.

యూకలిప్టస్ ఆయిల్ :
మరో బెస్ట్ హోం రెమెడీ, యూకలిప్టస్ ఆయిల్. బాయిలింగ్ వాటర్ లో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ ను మిక్స్ చేసి, ఆవిరి ట్టాలి. ఇలా చేస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది.

బ్లాక్ పెప్పర్ :
ఆగకుండా తుమ్ములు ఇబ్బంది పెడుతుంటే ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ తీసుకుని, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి తాగాలి. ఇలా చేస్తే జలుబు మరియు తుమ్ముల నుండి తక్షణ ఉపశమనం పొందుతారు.

ఫెన్నల్ టీ:
ఫెన్నల్ టీలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక గ్లాసు నీటిలోఫెన్నల్ పౌడర్(సోంపు పౌడర్) మిక్స్ చేసి మరిగించాలి. తుమ్ముల నుండి తక్షణ రిలీఫ్ ను అందిస్తుంది.

హాట్ వాటర్ తో ఆవిరి పట్టాలి:
హాట్ వాటర్ తో ఆవిరి పట్టడం వల్ల ముక్కు మరియు గొంతులో మ్యూకస్ వదులవౌతుంది. దాంతో శ్వాస సమస్యలుండవు, తుమ్ములు కూడా నేచురల్ గా తగ్గించుకోవచ్చు.

పసుపు:
పసుపులో ఉండే కుర్కుమిన్ అనే కాంపోనెంట్ , ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ముక్కుదిబ్బడను తొలగిస్తుంది. అలర్జీలను నివారించడలో , తుమ్ముల నుండి ఉపశమనం కలిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. డైలీ డైట్ లో పసుపు చేర్చడం వల్ల తుమ్ములను తగ్గించుకోవచ్చు. అలాగే కొద్దిగా గోరువెచ్చని పాలలో పసుపు మిక్స్ చేసి తీసుకుంటే తక్షణ ఉపశమనం కలుగుతుంది.



Click it and Unblock the Notifications