Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
లివర్ టాక్సిన్స్ ను తొలగించే 10 సూపర్ ఫుడ్స్
లివర్ (కాలేయం)మన శరీరంలోని అది పెద్ద అవయవం. మన శరీరంలోని జీవక్రియల్లో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది మన శరీరంలో ఉదరంలో కుడివైపున ఉంటుంది. లివర్ జబ్బుపడినా కూడా తనను తాను బాగు చేసుకోగల సామర్థ్యం కలది . శరీరానికి కావల్సిన శక్తిని తయారుచేసుకోగలదు. జీర్ణక్రియలో అత్యంత కీలకమైన పాత్ర నిర్వర్తించే అవయం, శరీరంలోని అతి పెద్ద గ్రంథి. ఇది పెద్దగ్రంధి మాత్రమే కాదు, బరువైన అవయవం కూడా .
కాలేయం... మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడం, శరీరంలోని కొవ్వు, చక్కెర (గ్లూకోజ్), ప్రొటీన్ శాతాన్ని నియంత్రించడం, శరీరం జబ్బు బారిన పడకుండా భద్రత కల్పించడం (శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వడం), రక్తశుద్ధి చేయడం, శరీరంలోని విషాలను హరించడం, మనలో ప్రవేశించే హానికర పదార్థాలను తొలగించడం, జీర్ణప్రక్రియకు దోహదపడే బైల్‌ను ఉత్పత్తి చేయడం, విటమిన్లు-ఐరన్ వంటి పోషకాలను నిల్వ చేయడం, ఆహారాన్ని శక్తి రూపంలోకి మార్చడం, శరీరంలోని వివిధ హార్మోన్ల విడుదలను నియంత్రించడం, రక్తం గడ్డకట్టడానికీ, గాయాలు తొందరగా మానడానికీ కావాల్సిన ఎంజైమ్స్‌ను ఉత్పత్తి చేయడం వంటి కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తుంది.
ఇన్నిరకాలుగా బాధ్యతలు నిర్వహించే కాలేయం ధూమపానం, మద్యం వల్ల త్వరగా జబ్బునపడుతుంది. కాబట్టి, అలా జరగకుండా ఎప్పటికప్పుడు కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు సహాయపడుతాయి. కాలేయాన్ని శుభ్రం చేసే ఆహారాలను తినడం చాలా మంచిది. శరీరంలోని టాక్సిన్స్ అన్నీ తొలగిపోతాయి. మరియు ఈ ఆహారాలు లివర్ ఫ్రెండ్లీ ఫుడ్స్. ఇది మీ జీవక్రియలను ఆరోగ్యంగా ఉంచడానికి ముఖ్యపాత్రను పోషిస్తుంది. కాబట్టి ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన ఫుడ్స్ ను రెగ్యులర్ గా తీసుకోవాలి.

బీట్ రూట్:
బీట్ రూట్ లో అమేజింగ్ హెల్త్ బెనిఫట్స్ దాగున్నాయి . ముఖ్యంగా ఫ్లెవనాయిడ్ మరియు బీటాకెరోటీన్ కూడా పుష్కలంగా ఉంది. ఈ రెండు కాంపౌడ్స్ మొత్తం ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

గ్రేప్ ఫ్రూట్:
గ్రేప్ ఫ్రూట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. వీటితోపాటు విటమిన్ సి కూడా ఉండటం వల్ల లివర్ టాక్సిన్స్ ను క్లియర్ చేస్తుంది .

లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్:
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను రెగ్యులర్ గా తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను చాలా ఎపెక్టివ్ గా తొలగిస్తుంది . దాంతో లివర్ శుభ్రపడుతుంది.
గ్రీన్ లీఫ్ లో ఆకుకూరలు, బిట్టర్ గార్డ్, మస్టర్డ్ గ్రీన్, మొదలగునవి తీసుకోవాలి.

ఆపిల్స్:
రోజుకు ఒక్క ఆపిల్ తింటే చాలు డాక్టర్ అవసరం ఉండదు అంటుంటారు. అది అక్షరాల నిజం. కాలేయంలోని హానికరమైన టాక్సిన్స్ తొలగించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది.

క్యారెట్స్:
క్యారెట్స్ ఫ్లెవనాయిడ్స్ కలిగి ఉంటుంది . ఈ ఫ్లెవనాయిడ్స్ లివర్ క్లెన్సింగ్ కు గ్రేట్ గా సహాయపడుతాయి .

టమోటోలు:
టమోటోల్లో ఉండే కాంపౌండ్స్ డిటాక్సిఫైయింగ్ కి గ్రేట్ గా సహాయపడుతాయి. శరీరంలోని వ్యర్థాలను తొలగించడం మాత్రమే కాదు, లివర్ క్లెన్సింగ్ గా కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులోని గ్లూటాథియోన్ అందుకు సహాయపడుతుంది.

వెల్లుల్లి:
కాలేయం ఆరోగ్యానికి వెల్లుల్లి గ్రేట్ గా పనిచేస్తుంది. ఇది కాలేయంలో ఎంజైమ్స్ ని ఉత్సాహపరిచి టాక్సిన్స్ ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. లివర్ టాక్సిక్ డ్యామేజ్ కి గురికాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి 2 లేదా 3 పచ్చి వెల్లుల్లి రెబ్బలను రోజూ తీసుకోవాలి.

క్యాబేజ్:
ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ నేచురల్ క్లెన్సింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది . కాలేయంలోఉండే ఎంజైంస్ యాక్టివ్ గా పనిచేయడానికి సహాయపడుతుంది. క్లెన్సింగ్ ప్రొసెస్ ను వేగవంతంగా చేస్తుంది.

అవొకాడో:
లివర్ డ్యామేజ్ కాకుండా కాపాడే కెమికల్స్ అవకాడోలో పుష్కలంగా ఉంటాయి. శరీరంలో పేరుకున్న హానికారక మలినాలను తొలగించడానికి, కాలేయం పనితీరు సజావుగా ఉండటానికి ఈ అవకాడో సహాయపడుతుంది. వారానికి 1 లేదా 2 అవకాడోలు కొన్ని నెలల పాటు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

బ్రసెల్స్ స్ప్రాట్స్:
బ్రసెల్స్ స్ప్రాట్స్ లోకాలేయానికి రక్షణ కల్పిస్తుంది. టాక్సిన్స్ ను తొలగిస్తుంది . వీటిని రెగ్యులర్ గా తింటుంటే కాలేయం శుభ్రపడుతుంది.



Click it and Unblock the Notifications