For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రింగ్ వార్మ్ (చర్మ వ్యాధి)ని నివారించుకోవడానికి 12 హెర్బల్ రెమెడీస్

By Super Admin
|

రిగ్ వార్మ్(తామర). చర్మ వ్యాధుల్లో బాగా ప్రసిద్ది చెందిన సమస్య . ఇది ''ట్రిచోఫైటోన్రోబ్రమ్’’ అనే ఫంగస్ వల్ల ఏర్పడుతుంది. ఈ ఫంగస్ వేడిగా, తడి ఎక్కువగా ఉన్న ప్రదేశంలో పెరుగుతుంది. దాంతో అనేక ఇన్ఫెక్షన్స్ కు దారితీస్తుంది. తలలో నుండి పాదాల వరకూ ఎక్కడైనా ఈ ఫంగస్ ఏర్పడవచ్చు.

రింగ్ వార్మ్(తామర)కు ముఖ్యమైన లక్షణం , చర్మం దురద, పొట్టు రాలడం, చర్మ ఎర్రగా కమిలిపోవడం, చూడటానికి అసౌకర్యంగా, చాలా చీరాకు తెప్పించేవిగా ఉంటాయి .

రింగ్ వార్మ్ సమస్యను తగ్గించుకోవడానికి వివిధ రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, అయితే వీటికంటే ముందు కొన్ని హెర్బల్ రెమెడీస్ ను ప్రయత్నిస్తే మంచిది. వీటిని ఉపయోగించడానికి ముందు రింగ్ వార్మ్ ఏర్పడిన ప్రదేశంను శుభ్రంగా కడిగి, తడిని బాగా పొడి వస్త్రంతో తుడిచేయాలి. తర్వాత హెర్బల్ రెమెడీస్ ను అప్లై చేస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది. తామరను(చర్మ వ్యాధి)ని నివారించుకోవడానికి 12 హెర్బల్ రెమెడీస్ ను ఈ క్రింది విధంగా పరిచయం చేయడం జరిగింది.

అలోవెర:

అలోవెర:

వివిధ రకాల చర్మ సమస్యలను నివారించడంలో మరియు సన్ బర్న్ నివారించడంలో కలబంద గ్రేట్ గా సహాయపడుతుంది. రింగ్ వార్మ్ ను నివారించడంలో కలబంద రసం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. త్వరగా నయం చేస్తుంది. సమస్య తగ్గే వరకూ కలబంద రసాన్ని ఎఫెక్టెడ్ ప్రదేశంలో అప్లై చేయాలి.

 లావెండర్ ఆయిల్:

లావెండర్ ఆయిల్:

లావెండర్ ఆయిల్లో యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి . ఇవి రింగ్ వార్మ్ ను ఎఫెక్టివ్ గా తగ్గిస్తాయి. పరిశోధనల ప్రకారం లావెండర్ ఆయిల్ ఫంగస్ గ్రోత్ ను నివారించడం మాత్రమే కాదు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా నివారిస్తుంది. ముఖ్యంగా అథ్లెట్స్ పాదాల్లో తరచూ ఏర్పడే రింగ్ వార్మ్ ను నివారిస్తుంది.

లెమన్ గ్రాస్ :

లెమన్ గ్రాస్ :

రింగ్ వార్మ్ ను నివారించడంలో లెమన్ గ్రాస్ ఒకటి. లెమన్ గ్రాస్ ను టీరూంలో తీసుకోవచ్చు లేదా లెమన్ గ్రాస్ టీబ్యాగ్స్ ను ఎఫెక్టెడ్ ప్రదేశంలో అప్లై చేయవచ్చు. రోజుకు ఒక కప్పు లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల చాలా రుచిగా ఉంటుంది.

పసుపు:

పసుపు:

పసుపులో యాంటీ బయోటిక్ లక్షణాలు ఎక్కువ, రింగ్ వార్మ్ ను నివారించడంలో ఇది గ్రేట్ హెర్బల్ రెమెడీ. రింగ్ వార్మ్ ఏర్పడి ప్రదేశంలో పసుపు రాయడం మంచిది. టర్మరింక్ జ్యూస్ అప్లై చేయడం వల్ల కూడా ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు .

పచ్చిబొప్పాయి:

పచ్చిబొప్పాయి:

పచ్చిబొప్పాయిలో డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. చర్మం మీద ఏర్పడ్డ తామరను నివారించి చర్మం డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. బొప్పాయిలో కొన్ని ముఖ్యమైన ఎంజైమ్స్ ఉంటాయి . ఇది వివిధ రకాల ఫంగస్ వ్యాధులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

 ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

రింగ్ వార్మ్ నివారించడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ ఎక్సలెంట్ హోం రెమెడీ.యాంటీ ఫంగల్ లక్షణాలు , మరియు ఎక్కువ అసిడిక్ గుణాలు కలిగి ఉండటం వల్ల , ఇది ఫంగస్ ను పూర్తిగా నివారిస్తుంది. రెగ్యులర్ గా చర్మానికి అప్లై చేస్తుంటే తామర నివారించబడుతుంది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

రింగ్ వార్మ్ నివారించడంలో సురక్షితమైన , ఉపయోగకరమైన హోం రెమెడీ. కొబ్బరి నూనెలో ఉండే లూరిక్ యాసిడ్ ఫంగస్ ను నాశనం చేస్తుంది. రింగ్ వార్మ్ ను నివారిస్తుంది. కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని చర్మానికి అప్లై చేసి, రాత్రంతా అలాగే ఉంచాలి. ఇలా రెగ్యులర్ గా ప్రతి రోజూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఓరిగానో ఆయిల్:

ఓరిగానో ఆయిల్:

ఓరిగానో నూనెలో థైమోల్, టెర్రీపైన్, మరియు సిమినే ఎక్కువగా ఉంటుంది.ఇందులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల రింగ్ వార్మ్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఓరిగానో ఆయిల్లో 40 నుండి 64శాతం థైమోల్ ఉంటుంది, ఇది ఎక్సలెంట్ హోం రెమెడీగా పనిచేస్తుంది. 3 నుండి 4 చుక్కల ఓరిగానో ఆయిల్ ను రింగ్ తామర ఏర్పడిన ప్రదేశంలో అప్లై చేయాలి. రోజుకు రెండు మూడు సార్లు అప్లైచేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఉప్పు:

ఉప్పు:

రింగ్ వార్మ్ ను నివారించడంలో ఉప్పు గ్రేట్ రెమెడీ. ఎఫెక్టెడ్ ఎరియాలో ఉప్పు నీటిని అప్లై చేయాలి. సీసాల్ట్ ను నీటితో కలిపి, పేస్ట్ లా చేసి తర్వాత తామర ఏర్పడ్డ ప్రదేశంలో అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

 వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిల్లో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎక్సలెంట్ హోం రెమెడీ. ఇది రింగ్ వార్మ్ ను నయం చేస్తుంది. వెల్లుల్లిని మెత్తగా పేస్ట్ చేసి, అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, ఎఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేయాలి. 1 గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా రోజుకు రెండు సార్లు, మూడు వారాలు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్లో ఉండే యాంటీ ఫంగల్ , యాంటీ వైరల్ లక్షణాలు, రింగ్ వార్మ్ నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది,. ఆలివ్ ఆయిల్ లీఫ్ నుండి తయారుచేసిన రసాన్ని అప్లై చేసినా రింగ్ వార్మ్ నయమవుతుంది. ఆలివ్ ఆయిల్ , ఆలివ్ ఆయిల్ లీప్ పౌడర్ లో మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను రింగ్ వార్మ్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

వేప:

వేప:

వేప మరో బెస్ట్ హెర్బల్ రెమెడీ. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువ. వేపఆకును మెత్తగా పేస్ట్ చేసి రింగ్ వార్మ ఏర్పడ్డ ప్రదేశంలో అప్లై చేయాలి. ఈ ప్రొసెస్ ను రోజూ కొన్ని వారాల పాటు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

12 Herbal Remedies To Treat Ringworms

12 Herbal Remedies To Treat Ringworms,12 Herbal Remedies To Treat Ring worms,disorder and cure, Ringworm is a very popular infectious skin disease which is mainly caused by "Trichophytonrubrum" fungus. This fungus grows in hot and humid areas and may infect a number of regions of your skin starting from your scalp to your feet.
Desktop Bottom Promotion