For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి ఆశ్చర్యం కలిగించే హోం రెమెడీస్

|

బ్యాక్ పెయిన్ తో ఏ పనిచేయలేకపోతున్నారా? వెన్నునొప్పిని వెంటనే తగ్గించుకోకపోతే అది దీర్ఘకాలం వేదిస్తుంది. వెన్ను నొప్పికి వివిధ కారణాలున్నాయి. ఒకే భంగిమలో కూర్చోవడం, లేదా పడుకోవడం లేదా ఎక్కవుగా బరువు మోయడం, ఎక్కువ శ్రమ, వ్యాయామం, గాయాలు , అనారోగ్యరమైన జీవనశైలి, బలహీనమైన ఎముకలు, ఇన్ఫెక్షన్స్, మరియు లిగమెంట్స్ వల్ల కూడా వెన్ను నొప్పికి దారి తీస్తుంది. బ్యాక్ పెయిన్ మాత్రమే కాదు, శరీరంలో ఎలాంటి నొప్పి వచ్చినా ఇది దినచర్యను మరింత అసౌకర్యంగా మార్చేస్తుంది.

శరీరంలో ఇతర నొప్పులతో పోల్చితే, వెన్ను నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. వెన్నెముక మన శరీరానికి అత్యంత అవసరమైనది. వంగాలన్నా, నడవాలన్నా, కూర్చోవాలన్నా ఇది అత్యంత అవసరమయిన అవయవం.

Unknown Home Remedies For Back Pain

వెన్నునొప్పి తగ్గించుకోవడానికి డాక్టర్ వద్దకు వెలితే పెయిన్ కిల్లర్స్ సూచిస్తుంటారు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో ఇవి తీవ్ర దుష్ప్రబావాలను కలిగిస్తాయి.

కాబట్టి, వెన్నునొప్పిని నేచురల్ గా తగ్గించుకోవాలని అనుకుంటే ఈ క్రింది మార్గాలను అనుసరించండి..

Unknown Home Remedies For Back Pain

1. ఎండోర్ఫిన్స్: ఎండోర్ఫిన్స్ అనే హార్మోన్ వ్యాయామం చేసిన తర్వాత మన శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్, ఇది వెన్ను నొప్పి తగ్గించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది, .

ఎండోర్ఫిన్ ఎఫెక్టివ్ పెయిన్ కిల్లర్ . ఇది డిప్రెషన్ మరియు ఆందోళనను తగ్గిస్తుంది. కాబట్టి వెన్నునొప్పి తగ్గించుకోవడానికి ఎండోర్ఫిన్స్ ఉత్పత్తి కావాలంటే రెగ్యులర్ గా వ్యాయామాలు చేయాలి .

Unknown Home Remedies For Back Pain

2. పొట్ట ఉదరానికి సంబందించిన వ్యాయామాలు: వెన్ను నొప్పి తగ్గించుకోవడానికి పొట్ట ఉదరం భాగానికి సంబందించిన వ్యాయామాలు చేయడం వల్ల లోయర్ స్పైన్ లేదా బ్యాక్ కు సపోర్టివ్ గా ఉంటుంది . ఆబ్డామిన ఫిట్ గా ఉండటం వల్ల లోయర్ బ్యాక్ పెయిన్ ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు.

Unknown Home Remedies For Back Pain

3. హాట్ అండ్ కోల్డ్ థెరఫి: బ్యాక్ పెయిన్ తగ్గించడంలో హాట్ అండ్ కోల్డ్ థెరఫీ గ్రేట్ గా సహాయపడుతుంది . స్నానం చేసేప్పుడు మొదట వేడినీళ్ళు, తర్వాత చల్లనీళ్ళలో ఇలా మార్చి మార్చి కొద్దిసేపు స్నానం చేయాలి.అలాగే కోల్డ్ లేదా హాట్ వాటర్ బ్యాగ్ తో బ్యాక్ పోర్షన్ కి కాపడం పెట్టుకోవాలి.

హాట్ వాటర్ బ్యాక్ కు రక్తప్రసరణ అందిస్తుంది. పెయిన్ తగ్గిస్తుంది, చల్లటి నీరు వాపులను మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది .

English summary

3 Unknown Home Remedies For Back Pain

Do you often miss out on activities because of your nagging back pain? Do you feel that no matter what you do, your backache is still persistent?If yes, then we understand how frustrating it must be for you. Any type of body pain can lead to a lot of discomfort and can also hamper your daily activities.
Story first published:Tuesday, July 5, 2016, 18:38 [IST]
Desktop Bottom Promotion