For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పంటినొప్పి నుంచి ఫాస్ట్ గా రిలీఫ్ ఇచ్చే సింపుల్ టిప్స్

By Swathi
|

పంటినొప్పి వచ్చిందంటే.. చాలా ఇబ్బందికరమే. ఏది తిననివ్వదు.. కనీసం కాఫీ, టీ, జ్యూస్ లు కూడా తాగడానికి నరకమే. వయసు సంబంధం లేకుండా.. అందరికీ తరచుగా ఇబ్బంది పెడుతుంది పంటి నొప్పి. కొన్ని సందర్భాల్లో పిల్లలు, ఆడవాళ్లు, మగవాళ్లు ఎవరికైనా ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది. పంటి నొప్పి నివారించుకోవడానికి డాక్టర్ల దగ్గరకు వెళ్తే.. వాళ్ల ట్రీట్మెంట్ నొప్పిగా ఉంటుంది.

గారపళ్లతో నలుగురిలో నవ్వడానికి ఇబ్బంది పడుతున్నారా ?

కాబట్టి డెంటిస్ట్ దగ్గరకు వెళ్లడానికి కూడా కొంతమంది సంకోచిస్తూ ఉంటారు. అయితే పంటినొప్పి వచ్చినప్పుడు ఏమీ తినడం సాధ్యం కాదు కాబట్టి మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి పంటినొప్పి నిమిషాల్లో మాయం చేసే సింపుల్ హోం రెమిడీస్ అందుబాటులో ఉన్నాయి.

remedies for toothache

వెల్లుల్లి
ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకుని మెత్తగా చేయాలి. కొద్దిగా టేబుల్ సాల్ట్ లేదా బ్లాక్ సాల్ట్ కలిపి పంటినొప్పి ఉన్నదానిపై అప్లై చేయాలి. ఇలా ఈ టిప్ ని ఫాలో అవడం వల్ల పంటినొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

దంతాలు తెల్లగా మిళమిళ మెరవాలంటే 20 చిట్కాలు

remedies for toothache

మిరియాలు, ఉప్పు
మిరియాలు, ఉప్పు మిరాకిల్ గా పనిచేస్తాయి. ఎందుకంటే.. ఈ రెండు పదార్థాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ అలర్జిటిక్ గుణాలు ఉంటాయి. కాబట్టి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి. ఉప్పు, మిరియాల పొడిని సమానంగా తీసుకోవాలి. కొంచెం నీటితో బాగా మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ని నొప్పిగా ఉన్న పంటిపై డైరెక్ట్ గా అప్లై చేయాలి. అలాగే కొన్ని నిమిషాలు వదిలేయాలి. ఇలా కొన్నిరోజులపాటు వరుసగా చేస్తే పంటినొప్పు పారిపోతుంది.

remedies for toothache

లవంగాలు
యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ సెప్టిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్న లవంగాలు పంటినొప్పిని వెంటనే తగ్గిస్తాయి. రెండు లవంగాలను పొడి చేయాలి. ఇందులో ఆలివ్ లేదా వెజిటబుల్ ఆయిల్ కలపాలి. నొప్పిగా ఉన్న పంటిపై ఈ పేస్ట్ పెట్టాలి. లవంగం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

remedies for toothache

ఉల్లిపాయ
ఉల్లిపాయల్లో యాంటీ సెప్టిక్ గుణాలున్నాయి. ఇవి పంటినొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. చేయాల్సిందల్లా ఒక్కటే పచ్చి ఉల్లిపాయ తీసుకుని కొన్ని నిమిషాల పాటు నమలాలి. ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. ఒకవేళ నమలడం ఇష్టం లేకపోతే.. కొంచెం ఆనియన్ ముక్క తీసుకుని నొప్పిగా ఉన్న పంటిపై పెట్టుకుంటే సరిపోతుంది.

English summary

4 Powerful Home Remedies to Relieve From Toothache quickly

4 Powerful Home Remedies to Relieve From Toothache quickly. Visiting the dentist’s office is not the most pleasure experience. Majority of people, men, woman or children, no matter of their age are less or more scared when they have to visit the dentist.
Story first published: Friday, January 22, 2016, 14:25 [IST]
Desktop Bottom Promotion