For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాసన పీల్చే శక్తిని కోల్పోయారా..? ఐతే ఇవిగో ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!

|

చాలా మందికి వాసన వస్తున్నా పసిగట్టలేరు. ఇలాంటి వారి పని అయిపోయినట్టేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. ముక్కు వాసన పీల్చే శక్తిని కోల్పోతే మరణానికి దగ్గరగా ఉన్నట్టేనని కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధకులు అంటున్నారు.

యూనివర్శిటీకి సంబంధించిన కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్‌లోని సైకియాట్రీ విభాగానికి చెందిన భారత డాక్టర్ దావనగిరి దేవానంద్ ఈ విషయంపై పరిశోధించి మరీ తేల్చిచెప్పాడు. ముక్కు వాసన పీల్చగల తన ప్రత్యేక శక్తిని కోల్పోతే ఆ తర్వాత కనీసం నాలుగేళ్లలోపు ఆ వ్యక్తి చనిపోతాడనే విషయం తమ పరిశోధనలో వెల్లడైనట్టు ఆయన తెలిపారు.

ఇప్పటివరకు 1,169 మంది వృద్ధులపై చేసిన ప్రత్యేక అధ్యయనంలో ఈ విషయాన్ని నిరూపణ అయినట్టు తెలిపారు. ముక్కు తన ప్రత్యేక లక్షణాన్ని కోల్పోవడమంటే చావు గడియలు దగ్గర పడుతుందనడానికి సంకేతమని యూనివర్శిటీ ప్రొఫెసర్లు చేసిన పరిశోధనలో తేలింది

వాసన (Smell or Odor) ఒక రకమైన ముక్కుకు సంబంధించిన జ్ఞానేంద్రియం. మంచి వాసనను సువాసన, పరిమళము, సుగంధం అంటారు. పువ్వులు రకరకాలైన సువాసనలను వెదజల్లుతాయి. ఎనిమిది రకాల సువాసనలను అష్టగంధాలు అని పేర్కొంటారు. ఇవి: కర్పూరం, కస్తూరి, పునుగు, జవ్వాజి, అగరు, పన్నీరు, అత్తరు మరియు శ్రీగంధం. చెడు వాసనను కంపు, దుర్గంధం లేదా దుర్వాసన అంటారు.

ఆరోమా వాసనను గ్రహించలేకపోతున్నారు. మీకు ఇష్టమైన ఆహారాలు వాసన చూడకుండా ఫుడ్ ఎంజాయ్ చేయలేకపోతున్నారా..? ఆహారాల మాత్రమే కాదు మీ పరిశరరాల్లోని మంచి వాసనాలు కూడా గ్రహించలేకపోతున్నరా? కొంత మంది ఉన్నట్లుండి వినికిడి లోపం ఏర్పడట్లు, వాసనశక్తిని కోల్పోతుంటారు.

వాసన శక్తి కోల్పోయినప్పుడు ఆ సామర్థ్యంను తిరిగి గ్రహించడానికి కొన్ని బెటర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి, హోం రెమెడీస్ . ఈ హోం రెమెడీస్ మీరు కోల్పోయిన వాసన శక్తిని తిరిగి తీసుకొస్తాయి. ఇలా వాసన శక్తిని కోల్పోవడాన్ని 'అనోస్మియా' లేదా 'నోస్ బ్లైండ్ నెస్ ' అని పిలుస్తారు. స్ట్రాంగ్ గా ఉన్న వాసన కూడా గ్రహించలేకపోవడాన్ని అనోస్మియా అని పిలుస్తారు .

ఇలాంటి పరిస్థితికి కారణమేంటి? వాసన గ్రహించే నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల బ్రెయిన్ కు సరైన సిగ్నెల్స్ అందవు . దాంతో వాసన గ్రహించలేదు. ఇలాంటి పరిస్థితికి వివిధ కారణాలున్నాయి. అయితే ఈ కారణాలు తాత్కాలికం లేదా శాశ్వతం కావచ్చు. ఇది జలుబు, ముక్కు దిబ్బడ, పొల్యుషన్, స్ట్రెస్,లేదా శరీరంలో విటమిన్స్, క్యాల్షియం, జింక్ వంటివి లోపించడం వల్ల కూడా వాసన గ్రహించే శక్తిని కోల్పోతారు. ఇంకా తలకు గాయాలవ్వడం వల్ల కూడా వాసన శక్తిని కోల్పోతారు.

ఇటువంటి పరిస్థితిలో వెంటనే చికిత్స తీసుకోవడం మంచిది. సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే వివిధ రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.

కోల్పోయిన వాసన శక్తిని తిరిగి గ్రహించడానికి ఇక్కడ కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి..

1. ఆముదం:

1. ఆముదం:

ఆముదంలో యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఆముదం కోల్పోయిన్ శక్తిని గ్రహించడానికి సహాయపడుతుంది. ఆముదం నూనెను ఒక్కొక్క డ్రాప్ ను ముక్కులో వేసుకోవాలి. ఉదయం మరియు రాత్రి నిద్రించడానికి ముందు ఒక్కో డ్రాప్ ఆముదం ముక్కులో వేసుకోవడం వల్ల నాజల్ ప్యాసేజ్ క్లియర్ అవుతుంది.

2. వెల్లుల్లి:

2. వెల్లుల్లి:

వెల్లుల్లిలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది నాజల్ ప్యాసేజ్ ను క్లియర్ చేస్తుంది. స్మెల్ తిరిగి పొందేందుకు సహాయపడుతుంది. రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని, నీటిలో వేసి బాయిల్ చేయాలి. దీన్ని రోజులో రెండు మూడు సార్లు తాగడం వల్ల మేలు చేస్తుంది.

3. దాల్చిన చెక్క:

3. దాల్చిన చెక్క:

కోల్పోయిన వాసనను తిరిగి పొందడానికి దాల్చిన చెక్క గ్రేట్ గా సహాయపడుతుంది. దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనె మిక్స్ చేసి నాలుక మీద అప్లై చేయాలి. లేదా ఈ రెండు మిశ్రమాలను వాటర్ లో మిక్స్ చేసి తాగాలి.

4. అల్లం:

4. అల్లం:

అల్లం ముక్కను నీటిలో వేసి బాగా బాయిల్ చేయాలి. టీ మరిగించిన తర్వాత ఆ నీటితో ఆవిరి పట్టడం వల్ల నాజల్ ప్యాసేజ్ క్లియర్ అవుతుంది. స్మెల్ ఇంప్రూవ్ అవ్వడంతో పాటు, రుచి కూడా అద్భుతంగా గ్రహిస్తారు.

5. హాట్ వాటర్ స్టీమ్ :

5. హాట్ వాటర్ స్టీమ్ :

వాటర్ ను బాగా మరిగించి, హాట్ వాటర్ స్టీమ్ చేయాలి. తలకు నిండుగా బెడ్ షీట్ కప్పి వేడి నీళ్ళు ఆవిరి పట్టాలి. ఇది ఇన్ప్లమేషన్ తగ్గిస్తుంది. వాసన తిరిగి గ్రహించేలా చేస్తుంది.

6. ఆపిల్ సైడర్ వెనిగర్ :

6. ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ నాజల్ ఇన్పెక్షన్ ను మరియు సైనస్ ను నివారిస్తుంది. కోల్పోయిన వాసన శక్తిని తిరిగి పొందేలా చేస్తుంది. ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను వాటర్ లో మిక్స్ చేసి, బాగా మిక్స్ చేసి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.

7. నిమ్మరసం:

7. నిమ్మరసం:

నిమ్మరసంలోని సిట్రస్ వాసన ముక్కు మీద ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వాసన తిరిగి పొందేలా చేస్తుంది. నిమ్మరసంను రెండు ముక్కలుగా కట్ చేసి,ప్రతి రోజూ ఉదయం మరియు సాయంత్రం వాసన చూడాలి.

8. యాలకలు:

8. యాలకలు:

బ్రెయిన్ కు సంకేతాలను అందించే నరాలు బలహీనపడినప్పుడు, వాసన శక్తిని కోల్పోతారు. యాలకలు వాసన శక్తిని తిరిగి గ్రహించేలా చేస్తుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో యాలకలను చేర్చుకోవడం చాలా అవసరం .

English summary

8 Amazing Home Remedies For Loss Of Smell

If you are not able to get the aroma of the food that you are eating then you would not be able to enjoy the food completely. Apart from food, you would also lose the sense of the environment if your smell sensitivity is lost.
Story first published: Wednesday, September 14, 2016, 11:09 [IST]