For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాండీస్ ను నివారించే 8 ఎఫెక్టివ్ నేచురల్ ఫుడ్స్

|

శరీరంలో ఇది ఒక పెద్ద గ్రంథి కాలేయం. మనం మరణించేంతవరకు పునరుత్పత్తి చెందగల ఏకైక అవయవం కాలేయం. అంతేకాదు, శరీరంలోని అతి పెద్ద అవయవం! అంతే కాదు 500పైగా శరీర ధర్మాల్ని నిర్వర్తించే అవయవం! చరిత్రలో కూడా కొన్ని సందర్భాలలో కాలేయ ప్రత్యేకతని చెప్పారు. ఇది ఒక పెద్ద రసాయన కేంద్రం. శరీరంలో పలు ధర్మాల్ని నిర్వర్తించడానికి తోడ్పడే అనేక రసాయనాల్ని ఇదే ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇది దెబ్బతింటే కాలేయానికి సంబంధించినవే కాకుండా, మరెన్నో అపాయాలు కలగవచ్చు. అందుకని కాలేయ ఆరోగ్యాన్ని కనిపెట్టుకొని ఉండటం అవసరం.

రోజూ ఉదయం పరగడుపున తినే తేనె-ఉసిరికాయ కాంబినేషన్ తో మ్యాజికల్ హెల్త్ బెనిఫిట్స్

పచ్చకామెర్లను జాండిస్‌ అని వ్యవహరిస్తారు. నిరంతరం రక్తంలోని ఎర్రకణాల విచ్ఛిత్తి జరుగుతూ బిలురూబిన్‌ అనే రంగు పదార్థం తయారవుతుంటుంది. రక్తంలో ఈ బిలురూబిన్‌ పరిమాణం రెట్టింపు అయితే కామెర్లు అని నిర్ధారిస్తారు. బిలూరూబిన్ పరిమాణం ఎక్కువైనప్పుడు వీరిలో చర్మం, కళ్లు, నాలుక పసుపుపచ్చ రంగులో కనిపిస్తాయి. బైల్ పిగ్మెంట్ రెట్టింపు అయ్యే కొద్ది, జాండీస్ లక్షణాలు పెరుగుతుంటాయ. వయస్సుతో సంబంధం లేకుండా జాండీస్ ఏవయస్సు వారికైనా రావచ్చు. జాండీస్ కు ముఖ్య కారణం పొట్ట ఉదరంలో నొప్పి, తలనొప్పి, ఫీవర్, వికారం, ఆకలి లేకపోవడం, సడెన్ గా బరువు తగ్గడం మరియు వాంతలు వంటి లక్షణాలు కనబడుతాయి . ఇంకా మలేరియా, సిర్రోసిస్ మరియు ఇతర డిజార్డర్స్ వల్ల జాండీస్ కు కారణం అవుతుంటుంది.

పైనాపిల్ ఆకారం..రంగు వెనుక దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు..!

జాండిస్ ను కేవలం మందులతోనే నివారించలేము. మెడికేషన్ తో పాటు కొన్ని కఠినమైన ఆహార నియమాలను పాటించడం ద్వారా ఈ లక్షణాలను నివారించుకోవచ్చు. ముఖ్యంగా జాండీస్ ఉన్నవారు ఉప్పు, కారం తగ్గించాలి. అంతే కాదు ఆయిల్ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ కు దూరంగా ఉంటూ తేలికగా జీర్ణం అయ్యే ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. పచ్చికూరలు మరియు హాఫ్ బాయిల్ చేసిన ఆహారాలను నిషేధించాలి. మరియు సరైన మందులు తీసుకోవడం వల్ల సాధ్యమైనంత వరకూ జాండీస్ ను తగ్గించుకోవచ్చు. మరి జాండీస్ ఉన్న వారు ఈ క్రింది తెలిపిన ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా..జాండిస్ ను తగ్గించుకోవచ్చు.

టమోటో:

టమోటో:

జాండీస్ ను నివారించుకోవడానికి టమోటో గ్రేట్ గా సహాయపడుతుంది. టమోటో యాంటీ ఆక్సిడెంట్ మరియు ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది . టమోటో రసాన్ని కొద్దిగా సాల్ట్ మరియు పెప్పర్ కలిపి కాలీపొట్టతో 12రోజులు తీసుకుంటే లివర్ సెల్స్ ను పెంచే శక్తిని, చైతన్యం నింపుతుంది.

ఉసిరికాయ:

ఉసిరికాయ:

ఇండియన్ గూస్బెర్రీగా పిలుచుకొనే, ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది జాండీస్ కు ఒక అద్భుతమైన హోం రెమెడీ. ఉసిరికాయలో ఉండే యాంటీఆక్సిడెంట్ లివర్ సెల్స్ ను శుభ్రం చేసి, కాలేయానికి చురుకుగా పనిచేసే శక్తి సామర్థ్యాలను పెంచుతుంది.

షుగర్ కేన్ జ్యూస్:

షుగర్ కేన్ జ్యూస్:

జాండిస్ తో పోరాడే గుణం షుగర్ కేన్ జ్యూస్ లో గ్రేట్ గా ఉన్నాయి . షుగర్ కేన్ జ్యూస్ రెగ్యులర్ గా త్రాగడం వల్ల ఇది లివర్ కెపాజిటిని పెంచుతుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. బైల్ డక్ట్స్(పిత్తవాహికలను)బ్లాక్ కాకుండా నిరోధిస్తుంది. నిమ్మరసంను ప్రతి రోజూ పరగడపున త్రాగడం వల్ల స్పీడ్ గా రికవర్ అవుతుంది. జాండీస్ లక్షణాలను నివారిస్తుంది.

 క్యారెట్:

క్యారెట్:

క్యారెట్స్ లో బీటా కెరోటీన్ అధికంగా మరియు కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది . ఇందులో విటమిన్ ఎ మరియు సిలు అధికంగా ఉంటాయి. క్యారెట్ లో ఉండే విటమిన్స్ మరియు న్యూట్రియంట్స్ లివర్ డిటాక్సిఫై చేయడానికి సహాయపడుతుంది. ఇది కాలేయం సరిగా పనిచేయడానికి చాలా ఎఫెక్టివ్ గా ఉపయోగపడుతుంది.

బట్టర్ మిల్క్:

బట్టర్ మిల్క్:

మజ్జిగలో ఐరన్ మరియు క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. బట్టర్ మిల్క్ ఫ్యాట్ ఫ్రీ కూడా, అందుకే ఇది చాలా తేలికగా...సులభంగా జీర్ణం అవుతుంది . బట్టర్ మిల్క్ ను ప్రతి రోజూ త్రాగడం వల్ల జాండీస్ ను నేచురల్ గా మరియు సులభంగా తగ్గించుకోవచ్చు.

దానిమ్మ:

దానిమ్మ:

దానిమ్మలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఇందులో వివిధ రకాల న్యూట్రీషియన్స్ మరియు సోడియం కంటెంట్ ఉండటంవ వల్ల జాండీస్ నివారించడంలో ఉపయోగకరంగా ఉంటుంది.

 బాదం:

బాదం:

ప్రతి రోజూ కొన్ని బాదంలను తినడం వల్ల లివర్ నార్మల్ గా పనిచేయడానికి సహాయపడుతుంది . బాదం శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . మరియు ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది.

English summary

TOP 8 Foods That Cure Jaundice

Jaundice is not a disease but rather a symptom of an underlying disease. The skin, mucous membranes and whites of the eyes turn yellow due excessive bilurubin production .One gets affected by jaundice when there is an increase in bile pigment. Jaundice can affect anyone regardless of age. The symptoms that accompany jaundice include abdominal pain, headache, fever, nausea, loss of appetite, weight loss and vomiting.
Story first published: Thursday, January 14, 2016, 16:08 [IST]
Desktop Bottom Promotion