For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూరిన్ ఇన్ఫెక్షన్ నివారణకు 9 ఆయుర్వేద రెమెడీస్

|

ప్రస్తుత కాలంలో అనేక మంది మూత్రంలో మంట సమస్యతో బాధపడుతున్నారు. వేసవికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి లవణాల గాఢత పెరిగి కిడ్నిల్లో రాళ్లు మరియు యూరినరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్స్‌ (యు.టి.ఐ) ఏర్పడే అవకాశం ఉండటమే.యూటిఐ (యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ )అత్యంత సాధారణ సమస్య. ప్రస్తుత రోజుల్లో ప్రతి 100 మందిలో ఒకరు ఈ సమస్యను ఎందుర్కొంటున్నారు . పురుషులతో పోల్చితే మహిళల్లో ఈ ఇన్ఫెక్షన్ పది రెట్లు ఎక్కువగా ఉంటుంది . 50శాతం మంది మహిళలు వారి జీవిత కాలంలో ఈ సమస్యను అనుభవ పూర్వకంగా ఒక్కసారైనా ఎదుర్కొని ఉంటారు.

మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శరీర ద్రవాల్లోని లవణాల సమతుల్యత కాపాడి శరీరంలోని నీటి పరి మాణాన్ని తగ్గకుండా చూస్తూ జీవకార్య నిర్వహణలో పేరుకునే కాలుష్యాన్ని విసర్జిస్తాయి. ఇలాంటి విధులు నిర్వర్తించే కిడ్నీలు ఇన్‌ఫెక్షన్‌కు గురైనప్పుడు మూత్రంలో మంట వస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం, మూత్రకోశంలో ఇన్‌ ఫెక్షన్‌, నీరు తగినంతగా తాగకపోవడం, ఆహారపు అలవాట్లు, కొన్ని జన్యుపరమైన ఇన్‌ఫెక్షన్ల వలన మూత్రంలో మంట వస్తుంది.

మూత్ర విసర్జన సమయంలో మంట. పొత్తి కడుపులో నొప్పి రావడం, మూత్రం ఎక్కువ సార్లు చేయడం. మూత్రం రంగు మారడం, వేడిగా, ఎరుపుగా రావటం. పిల్లల్లో ఈ సమస్యను ఎదుర్కునే వారు మూత్రం పోయాలంటేనే భయపడిపోయి, ఏడుస్తుంటారు. నీరసం, జ్వరం లాంటి లక్షణాలుంటాయి. ఈ సమస్య నివారణకు డాక్టర్ల వద్దకు వెళితే డాక్టర్స్ ఏవో కొన్ని యాంటీబయోటిక్స్ సూచిస్తుంటారు . అయితే వీటి వల్ల త్వరిత ఉపశమనం ఉండదు , కాబట్టి హోం రెమెడీస్ ను ఉపయోగించడం వల్ల ఈ పెయిన్ ఫుల్ సమస్యను స్వయంగా మనం ఇంట్లోనే త్వరగా నివారించుకోవచ్చు. మరి అందుకు అవసరం అయ్యే హోం మేడ్ పదార్థాలు, ఏవిధంగా తయారుచేయాలి. ఎలా ఉపయోగించాలన్న విషయం తెలుసుకుందాం....

1. పెరుగు:

1. పెరుగు:

పెరుగులో ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియా అధికంగ3ా ఉండటం వల్ల ఇది కిడ్నీ మరియు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . పెరుగు ప్రేగుల ఆరోగ్యాన్ని పొట్టసమస్యలను నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. కిడ్నీ స్టోన్స్ నివారిస్తుంది.

2. వెల్లుల్లి:

2. వెల్లుల్లి:

యూరినరీ ఇన్ఫెక్షన్ నివారించడంలో పచ్చివెల్లుల్లి గ్రేట్ గా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, పచ్చిగా తీసుకోవచ్చు. నురుగా తినలేని వారు గార్లిక్ క్యాప్స్యూల్స్ తీసుకోవచ్చు.

3. కలబంద:

3. కలబంద:

అలోవెర చాలా అద్భుతమైన మూలిక. దీన్ని ప్రతి రోజూ కొద్దికొద్దిగా తీసుకొన్నట్లైతే ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది ఇది మూత్రపిండాలను చాలా ఎఫెక్టివ్ గా శుభ్రం చేసి శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది.

4. ఆమ్లా:

4. ఆమ్లా:

ఇది ఒక ఆయుర్వేదిక్ హోం రెమెడీ. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రొపర్టీస్ యూరిన్ ఇన్ఫెక్షన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.ఇందులో విటిమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల యూరిన్ ట్రాక్ లో బ్యాక్టీరియాను తొలగిస్తుంది . బ్లాడర్ హెల్తీగా ఉంచుతుంది. కావల్సిన పదార్థాలు: 1 teaspoon ఆమ్లా పౌడర్ 1 teaspoon పసుపు ½ cup నీళ్లు తయారుచేయువిధానం: అరకప్పు నీటిలో ఒక స్పూన్ ఆమ్లా పౌడర్ మరియు పసుపు వేసి బాగా మిక్స్ చేసి బాయిల్ చేయాలి. వాటర్ సగం అయ్యే వరకూ బాయిల్ చేసి, స్టౌ ఆఫ్ చేసి గోరువెచ్చగా చల్లారిన తర్వాత తాగాలి. ఈ నేచురల్ డికాషన్ ను రోజులో మూడు సార్లు తీసుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది

5. అల్లం:

5. అల్లం:

అల్లం చాలా పాపులర్ హెర్బ్. అనేక వ్యాధులను నయం చేసే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి . ఇందులో జింజరోల్ అనే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్, బ్యాక్టీరియా కిడ్నీలో వ్యాప్తి చెందకుండా నివారిస్తుంది. మరియు ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది . అందుకు అల్లం టీ రెగ్యులర్ గా తీసుకోవాలి.

క్రాన్ బెర్రీ జ్యూస్: బ్రాన్ బెర్రీ జ్యూస్ త్రాగడం వల్ల యూరినరీ బ్లాడర్ బ్యాక్టీరియాను నివారిస్తుంది . అందువల్ల యూటిఐ ఇన్ఫెక్షన్ కు చాలా ఎఫెక్టివ్ గా నివారించడానికి క్రాన్ బెర్రీ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవాలి.

6. పసుపు:

6. పసుపు:

పసుపు నేచురల్ రెమెడీ. ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది. మరియు ఇది చాలా త్వరగా కోలుకొనేలా చేస్తుంది. పసుపులో ఉండే కుర్కుమిన్ వంటి బలమైన యాంటా బ్యాక్టీరియల్, యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ుంటుంది . ఇది మైక్రోబ్స్ అభివ్రుద్ది మరియు వ్యాప్తి చెందకుండా నివారిస్తుంది. కాబట్టి పాలలో కొద్దిగా పసుపు మిక్స్ చేసి తీసుకోవాలి.

7. కొత్తిమీర:

7. కొత్తిమీర:

యూరినరీ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో ఇది ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఆయుర్వేదంలో గ్రేట్ గా ఉపయోగిస్తారు . పైత్య దోషనివారణకు ఇది గ్రేట్ గా సమాయపడుతుంది. బర్నింగ్ మరియు దురద వంటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కొత్తిమీరలో ఉపశమనం కలిగించే లక్షణాలు ఎక్కువ. రెగ్యులర్ గా కోరియాడర్ టీ తాగడం వల్ల బర్నింగ్ సెన్షేషన్ తగ్గించుకోవచ్చు.

8. దాల్చిన చెక్క:

8. దాల్చిన చెక్క:

యుర్వేదంలో ఇది ఒక మ్యాజికల్ హెర్బ్ . యూటిఐకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో దాల్చిన చెక్క గ్రేట్ గా సహాయపడుతుంది . ఈకోలి బ్యాక్టీరియాను నాశనం చేసి మూత్రంలో మంటను నివారిస్తుంది . అసౌకర్యాన్ని నివారిస్తుంది. రోజుకు రెండు మూడు సార్లు దాల్చిన చెక్క టీ తాగడం వల్ల యూటీఐ ఇన్ఫెక్షన్స్ నివారించుకోవచ్చు.

9. నీళ్ళు త్రాగడం :

9. నీళ్ళు త్రాగడం :

ప్రతి రోజూ శరీరానికి అవసరం అయ్యే నీరును తీసుకోవడం వల్ల శరీరంను హైడ్రేషన్ లో ఉంచుకోవచ్చు. అంతే కాదు నీళ్ళు మూత్రంలో కలిసిపోయి కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా, నివారిస్తుంది. మరియు కిడ్నీలలో ఉండే టాక్సిన్స్ ను బయటకు ఫ్లష్ చేస్తుంది.

English summary

9 Ayurvedic Remedies To Treat Urinary Tract Infection

If you are looking for herbal, Ayurvedic medicines for UTI, then there are plenty of amazing Ayurvedic medicines that you can use, which can cure your UTI problem.
Story first published:Saturday, May 28, 2016, 16:36 [IST]
Desktop Bottom Promotion