For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాలుక మంట పుడుతుంటే తక్షణ ఉపశమనం కలిగించే అద్భుత చిట్కాలు..!!

|

ఏదైనా మీకు ఇష్టమైన ఫుడ్ కారంగా...పుల్లగా... స్వీట్ గా... లేదా వేడి వేడి టీ లేదా సూప్ లేదా హాట్ హాట్ పిజ్జాలు తిన్నప్పుడు నాలుక మండినట్లు అనిపిస్తుంది. ఆవకాయ తిన్నప్పుడు ఆ కారానికి మనకు మంట పుడితేనే చాలా బాధగా ఉంటుంది. ముద్ద పప్పు తిన్నా మంట కలిగే వారి జీవితాలు ఇంకెంత బాధాకరంగా వుంటాయో ఊహించుకోండి. మజ్జిగ అన్నం తిన్నా మంట/నొప్పి పెట్టేవారికి తినాలంటేనే భయం వేస్తుంది, బ్రతకాలంటేనే బాధేస్తుంది. చాలామంది ఆ మంటకి భయపడి తిండి మానేసి నీరసంతో మంచాన పడతారనడంలో ఏ అతిశయోక్తి లేదు. అసలు ఈ మంట కలగడానికి గల కారణాలేంటో చూద్దాం.

నోట్లోని ఏ భాగం మంట / నొప్పికి లోనవుతోంది? కొంతమందిలో మొత్తం నోరు, కొందరిలో బుగ్గలు, చాలా శాతం మందిలో నాలిక, చాలా తక్కువ మందిలో అంగుడి ఈ మంట లేదా నొప్పికి గురవుతుంటాయి.

నోట్లో లేదా నాలుక మంటకు కారణాలు? కారణాలు చాలానే ఉంటాయి. శ్రద్ధగా నోటిని పరీక్షించాల్సి వుంటుంది. ఎర్రని ప్రదేశాలకోసం, ఉమ్మినీరు ఉత్పత్తి, ఫంగస్ ఇన్‌ఫెక్షన్ కోసం, పుండ్లకోసం, నాలికమీద పొక్కుల కోసం, నాలికమీద తొర్రెలకోసం, నాలిక ఎర్రగా, నున్నగా ఉందా లేదా మామూలుగా గరుగ్గా వుందా అని పరీక్షించాల్సి వుంటుంది. ఇవి నోట్లో కనిపించే కారణాలైతే శరీరంలో కనిపించే కారణాలు కొన్ని ఉంటాయి. రక్తహీనత, విటమిన్‌ల లోపం, కొన్ని మందుల ప్రభావం, రోగ నిరోధక శక్తి లోపాలు (జషఆ్యనిౄౄఖశజఆక) ఇలాంటి కారణాలు కావొచ్చు.

వీరిలో అతి పెద్ద చికాకు కలిగించే విషయం ఏంటంటే, చాలామందిలో ఏ లోపాలు, కారణాలు కనిపించవు. దీనిని బర్నింగ్ వౌత్ సిండ్రోమ్ అంటారు. కారణాలు తెలిసినపుడు చికిత్స చెయ్యడం కష్టం అవుతుంది.

ఎవరిలో వస్తుంది? ఎవరిలోనైనా రావొచ్చు. కాకపోతే ముసలివారిలో ఎక్కువగా ఈ మంట/నొప్పి కనిపిస్తుంటాయి. ఆడవారిలో మెనోపాజ్ తరువాత హార్మోన్ల లోపంవల్ల ఈ మంట కలగొచ్చని ఓ నమ్మకం. ఈ మంట నొప్పి ఉన్నవారిలో చాలామందికి రుచులు లేక వాసనలు తెలియకపోవడం మనం గమనించగలం.

నాలుక మండుతున్నప్పుడు వెంటనే ఉపశమనం పొందడానికి మందులు, మాత్రలకోసం చూడకుండా కొన్ని హోం రెమెడీస్ ను ఫాలో అయితే తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఈ హోం రెమెడీస్ మన ఇంట్లో చాలా సులభంగా అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలా సింపుల్ రెమెడీస్. వీటిని ఉపయోగించడం వల్ల తక్షణ ఉపశమనం పొందుతారు. మరి అవెంటో..ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం...

1. ఐస్ క్యూబ్:

1. ఐస్ క్యూబ్:

నాలుక లేదా నోరు మంటగా ఉన్నప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకుని, వాటిని నాలు మీద పెట్టి మసాజ్ చేయాలి లేదా నోట్లో పెట్టుకొని చప్పరించాలి.

2. షుగర్ నోట్లో వేసుకోవాలి:

2. షుగర్ నోట్లో వేసుకోవాలి:

ఎదైనా తిన్నప్పుడు నాలుక ఎక్కువ మంటగా అనిపిస్తే వెంటనే షుగర్ లేదా షుగర్ పౌడర్ ను నోట్లో వేసుకోవడం వల్ల ఇన్ స్టాంట్ రిలీఫ్ ఉంటుంది. నాలుక మంటను త్వరగా తగ్గిస్తుంది.

3. చల్లటి నీటితో గార్గిలింగ్ చేయాలి:

3. చల్లటి నీటితో గార్గిలింగ్ చేయాలి:

నాలుక మంటగా ఉన్నప్పుడు, తినడానికి స్వీట్ గా ఏది దొరకనప్పుడు వెంటనే నీరు తాగడం వల్ల తక్షణ ఉపశమనం పొందతారు . చల్లటి నీరు తీసుకొని, నోట్లో పోసుకుని గార్గిలింగ్ చేయాలి. ఇది నాలుక మంట నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.

4. పెరుగు:

4. పెరుగు:

పెరుగులో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ బి5లు పుష్కలంగా ఉన్నాయి. నాలుక మండుతున్నప్పుడు, వెంటనే కొద్దిగా పెరుగును నోట్లో వేసుకుని తినడం వల్ల కూలింగ్ ఎఫెక్ట్ కలుగుతుంది . బర్నింగ్ సెన్షేషన్ తగ్గుతుంది. త్వరగా ఉపశమనం కలుగుతుంది.

5. తేనె:

5. తేనె:

తేనెలో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే నాలుక లేదా నోరు మంటగా అనిపిస్తే వెంటనే కొద్దిగా తేనె నోట్లో వేసుకోవడం వల్ల స్మూతింగ్ ఎఫెక్ట్ కలిగిస్తుంది. నాలుక మంటను చల్లార్చుతుంది.

6. అలోవెర జెల్ :

6. అలోవెర జెల్ :

నాలుక మండుతన్నప్పుడు లేదా నోరు మంటగా అనిపిస్తే వెంటనే అలోవెర జెల్ ను అప్లై చేయాలి. దీన్ని అప్లై చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే అలోవెర జెల్లో యాంటీఇన్ఫ్లమేటరీ , యాంటీయాక్సిడెంట్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇవి తక్షణ ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.

7. కోల్డ్ ఆపిల్ జ్యూస్:

7. కోల్డ్ ఆపిల్ జ్యూస్:

ఆపిల్ జ్యూస్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆస్ట్రిజెంట్ లా పనిచేస్తుంది. ఇది నాలుక మంటకు స్మూతింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది.

8. మింట్ టూత్ పేస్ట్:

8. మింట్ టూత్ పేస్ట్:

కొద్దిగా మింట్ టూత్ పేస్ట్ తీసుకుని మండతున్న ఏరియాలో అప్లై చేయాలి. ఇది నాలుక కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. డ్రై అయిన తర్వాత నోట్లో చల్లటి నీళ్ళు పోసి శుభ్రం చేసుకోవాలి.

9. ల్యావెండర్ ఆయిల్:

9. ల్యావెండర్ ఆయిల్:

ల్యావెండర్ ఆయిల్ ఒక బెస్ట్ హోం రెమెడీ. ఇది నాలుక మంటను నివారిస్తుంది. ఇందులో ఇండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు గ్రేట్ గా సహాయపడుతుంది. త్వరగా నయం చేస్తుంది.

English summary

Amazing Home Remedies That Gives Instant Relief From Burnt Tongue

You just had a piping hot tea or soup or in an excitement you gulped down some hot sizzling pizzas just out of the oven. And this ended up in giving you a burnt tongue. You scream out loud and then you run around panting with your tongue hanging out.
Story first published:Friday, August 19, 2016, 12:55 [IST]
Desktop Bottom Promotion