For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తీవ్రంగా ఇబ్బందిపెట్టే పొడి దగ్గు నివారించే ఎఫెక్టివ్ హోం రెమిడీస్..!

By Swathi
|

పొడి దగ్గు అనేది.. పెద్ద సమస్య కాకపోయినా.. చాలా ఇబ్బంది పెడుతుంది. అలాగే చాలా సాధారణంగా వచ్చే సమస్య కూడా. కానీ.. ఇది పెద్ద అనారోగ్య సమస్య కాకపోయినా.. నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే సరైన రెమిడీస్ పాలో అవ్వాలి.

చాలా సందర్భాల్లో పొడి దగ్గు అలర్జీ, వైరల్ ఇన్ఫెక్షన్ కి సంకేతంగా చెప్పవచ్చు. అలాగే పొడి దగ్గును తట్టుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే.. నొప్పి, అసౌకర్యంగా ఉంటుంది. నిర్విరామంగా దగ్గడం వల్ల.. గొంతులో ఏదో అడ్డుపడిన ఫీలింగ్ కలుగుతుంది.

అయితే ఈ దగ్గును నివారించడానికి చాలా ఎఫెక్టివ్ హోం రెమిడీస్ ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండే హోం రెమిడీస్ ని ఫాలో అవడం వల్ల.. పొడి దగ్గును చాలా తేలికగా నివారించుకోవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

తేనె, మిరియాలు

తేనె, మిరియాలు

తాజా తేనెను మిరియాల టీలో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల పొడి దగ్గు నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. గొంతులో కిచ్ కిచ్ కూడా తొలగిపోతుంది. రోజుకి కనీసం 3 నుంచి 4 సార్లు తీసుకుంటే.. త్వరగా తగ్గిపోతుంది.

పుక్కిలించడం

పుక్కిలించడం

ఉప్పు నీళ్లను నోట్లో పోసుకుని పుక్కిలించడం ద్వారా.. దగ్గును త్వరగా తగ్గించుకోవచ్చు. గొంతు, చెస్ట్ లో ఇబ్బంది తొలగిపోతుంది. ఇలా రోజంతా.. ఒకవారం పాటు చేస్తే.. పొడి దగ్గు తగ్గిపోతుంది.

ఆవిరి

ఆవిరి

కొన్ని చుక్కల పెప్పర్ మింట్ ఆయిల్, లావెండర్ ఆయిల్ ని వేడి నీటిలో కలిపి.. రోజుకి రెండు మూడు సార్లు ఆవిరి పట్టుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే.. దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.

పసుపు

పసుపు

పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల.. క్రిములు, బ్యాక్టీరియాను నివారిస్తుంది. కాబట్టి వేడి పాలలో పసుపు కలిపి తీసుకుంటే.. దగ్గు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

వెచ్చటి లిక్విడ్స్

వెచ్చటి లిక్విడ్స్

వేడిగా ఉండే సూప్స్ వంటి లిక్విడ్స్ తీసుకోవడం వల్ల.. దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.

అల్లం టీ

అల్లం టీ

ఒక కప్పు అల్లం టీ తాగడం వల్ల దగ్గు నుంచి చాలా ఎఫెక్టివ్ రిలీఫ్ పొందవచ్చు. ఈ ఈజీ రెమిడీ ద్వారా పొడి దగ్గు దూరమవుతుంది.

English summary

Best Home Remedies For Persistent Dry Cough

Best Home Remedies For Persistent Dry Cough. Dry cough is one problem that spares no one. But if this exceedingly common and mostly non-serious problem is persistent in nature, then you should not take it lightly.
Story first published: Wednesday, September 21, 2016, 16:56 [IST]
Desktop Bottom Promotion