Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
ప్రాణహాని కలిగించే వివిధ రకాల తలనొప్పులు...వాటికి గల కారణాలు....
మన నిత్య జీవితంలో తరచూ వేదించే సమస్య తలనొప్పి . ఇది సాధారణ ఆరోగ్య సమస్యల్లో ఇది కూడా ఒకటి. తల నొప్పి వచ్చినప్పుడు వెంటనే పిల్స్ వేసుకొని తక్షణ ఉపశమనం పొందుతుంటారు.
అయితే, ఆరోగ్య నిపుణుల అబిప్రాయం ప్రకారం పిల్స్ తినడం మానేసి, హోం రెమెడీస్ అయిన గ్రీన్ టీ మరియు నీరు తగినంత త్రాగడం వల్ల సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.
తలనొప్పికి చాలా సాధరణ కారణం ఒత్తిడి, డీహైడ్రేషన్ మరియు ఇతర కెఫిన్ వంటి ఆహారా పానీయాలు తీసుకోవడం వల్ల తలనొప్పికి గురి కావాల్సి ఉంటుంది.
అయితే తలనొప్పిని ఒక కంట కనిపెట్టి ఉండటం మంచిది. తలనొప్పి ప్రారంభమై అది అలాగే కొన్ని రోజుల పాటు కొనసాగితే అది స్ట్రోక్, అనిరిజమ్ , బ్రెయిన్ ట్యూమర్, లేదా బ్లీడింగ్ వంటి బ్రెయిన్ సమస్యలను సూచిస్తుంది. లేదా వీటికి కారణమవుతుంది.
అందువల్ల , ఇటువంటి పెద్ద సమస్యను నుండి బయట పడాలంటే మీకు వస్తున్నది ఎటువంటి రకమైన తలనొప్పి వస్తున్నదో గమనించాలి . అప్పుడే ట్రీట్మెంట్ తీసుకోవడానికి సులభం అవుతుంది.
అయితే ఈ రోజు మీకోసం కొన్ని ఖచ్చితమైన కారణాలు ...తరచూ తలనొప్పి బాధిస్తుంటే, అలాంటి తలనొప్పికి గల కారణాలను కొన్నింటిని మీకోసం ఈ క్రింది విధంగా తెలపడం జరిగింది . కాబట్టి మీకు ఎటువంటి తలనొప్పి వస్తున్నదో గుర్తించి వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

1. సడెన్ గా తలనొప్పి:
దీన్నే థండర్ హెడ్ ఏక్ అని పిలుస్తారు . ఈ తలనొప్పి ఉన్నఫలంగా సడెన్ గా వస్తుంది. తర్వాత అలాగే కొనసాగుతుంటుంది. ఇది థండర్ స్లాప్ హెడ్ ఏక్ అనిపిలుస్తారు . తర్వాత 60 నిముషాల తర్వాత మరింత తీవ్రంగా మారుతుంది . ఇది క్రమంగా బ్రెయిన్ లో ఇంటర్నల్ బ్లీడింగ్ కు దారితీస్తుంది.

2. రతి తర్వాత తలనొప్పి:
రతిక్రీడలో పాల్గొన్నకొద్ది సేపటి తర్వాత తలనొప్పి బాధిస్తుంటే , అది బ్రెయిన్ లో ట్యూమర్ లేదా అనైరిమ్ గా గుర్తించాలి . ఇటువంటి పరిస్థితిని కూడా సీరియస్ గా తీసుకొని వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

3. మెమరీ లాస్ మరియు తలనొప్పి:
కొన్ని రకాల తలనొప్పి, మెమరీ లాస్ తో పాటు, కంటి చూపు మసకగా కనిపిస్తుంది మరియు చురకు దనం లేకపోవడం, కదలికలు భారంగా కనిపించడం వల్ల స్ట్రోక్ చిహ్ననంగా గుర్తించాలి. ఇలాంటి రకమైన తలనొప్పిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడానికి లేదు.

4. వయస్సైన వారిలో తలనొప్పి:
వయస్సైన వారిలో తలనొప్పి బ్లడ్ ప్రెజర్ పెరగడానికి సూచిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో వెంటనే కేర్ తీసుకొని చికిత్సనందివ్వాల్సిన అవసరం ఉంటుంది. హైబిపి ఉన్నవారిలో ఇతర సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది.

5. తలనొప్పి మరియు గాయం:
గాయపడిన తర్వాత తలనొప్పి వస్తుంటే అది కాన్షియస్ నెస్ కు సంబందించిన తలనొప్పిగా గుర్తించాలి . ఈ తలనొప్పికి కూడా వెంటనే చికిత్సనందివ్వాల్సి ఉంటుంది . నిర్లక్ష్యం చేయడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ కు దారితీస్తుంది.

6. క్యాన్సర్ లక్షణం:
తరచూ తలనొప్పి బాధిస్తుంటే అది క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి గా సూచిస్తారన్న విషయం మీకు తెలుసా ..? ముఖ్యంగా ఇంట్లో క్యాన్సర్ పేషంట్స్ ఉన్నప్పుడు ఇలాంటి లక్షణాలు ఇతరుల్లో కనిపించే అవకాశాలు ఎక్కువ . కాబట్టి, ఇలాంటి తలనొప్పి ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

7. తలనొప్పిలో రకాలు:
తలనొప్పిలో కూడా వివిధ రకాలున్నాయి. వాటిలో ముఖ్యంగా టెన్షన్ వల్ల వచ్చే తలనొప్పి, మైగ్రేన్, సైనస్ మరియు క్లస్టర్ తలనొప్పి .వీటిని ఎట్టిపరిస్థితితో నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు . తలనొప్పి 24గంటలకు మంచి అలాగే కొనసాగితే ఖచ్చితంగా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి.



Click it and Unblock the Notifications