Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చెవి నొప్పికి ఉపశమనం కలిగించే సింపుల్ హోం రెమెడీ
మన శరీర అవయవాలలో ముఖ్య మైన వాటిలో చెవికూడా ఒకటి. మనం వాటిని చాలా జాగ్రత్తగా చూసు కోవాలి. మనం చెవితో చాలా పనులు చేస్తూ వుంటాం. అది ఒక శ్రవణ యంత్రం. చెవితో మనం శబ్దాలను, సంగీతాలను విని ఆనందిస్తూ వుంటా ము. చెవి విషయంలో మనం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలావుంది.
చెవిలో సమస్యలు అరుదుగా కలిగినప్పటికి, దీని వలన కలిగే సమస్యల వలన స్థిమితం లేకుండా చేస్తాయి. చెవి సమస్యలు సాధారణంగా వైరల్ మరియు బ్యాక్టీరియాల వలన ఇన్ఫెక్షన్'లకు గురయ్యి ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఈ సమస్యలకు వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ కలుగుతాయి.

చెవి సమస్య చాలా సాధారణంగా వస్తుంటాయి, అయితే ఇవి తీవ్రంకాకుండా చూసుకోవాలి, లేదంటే వినికిడి శక్తిని కోల్పోతాయి . కొన్ని తీవ్రపరిస్థితిలో కొందరిలో చెవిలో రక్తం కారడం, , నీరు కారడం వంటి లక్షణాలు కనబడుతాయి . చెవి సమస్యలకు చెవిలో గుమిలితో మూసుకోవడానికి నివారించడానికి ఇక్కడ తెలిపిన ఆయుర్వేద ఔషదాలు త్వరగా, వాటి ప్రభావాన్ని చూపి ఇబ్బందుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
టీటీ ఆయిల్ స్ట్రీమ్ చాలా ఎఫెక్టివ్ గా మరియు సింపుల్ గా మూసుకుపోయిన చెవిని క్లియర్ చేస్తాయి, చెవి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి ,ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే ఇన్ఫ్లమేషన్, బ్యాక్టీరియాను తొలగిస్తాయి . చెవి నొప్పిని నివారించే హోం రెమెడీ ఎలా తయారుచేసుకోవాలలో తెలుసుకుని, చెవి దిబ్బడ నుండి ఉపశమనం పొందుదాము..

కావల్సినవి:
4-5 చుక్కల టీట్రీ ఆయిల్
2-3 cups వేడి నీళ్ళు
పద్దతి:
ఒక గిన్నెలో రెండు మూడు కప్పలు నీళ్ళు పోసి బాగా బాయిల్ చేయాలి.
అందులో టీట్రీ ఆయిల్ ను కొద్దిగా వేసి 5 నుండి 10 నిముషాల వరకూ బాయిల్ చేయాలి.
తర్వాత కొద్దిగా ఫ్లేమ్ తగ్గించాలి. తర్వాత స్టౌ మీద నుండి గిన్నె క్రిందికి దింపుకుని, నీటిని ఒక సారి బాగా కదిలించాలి
నీరు కదులుతున్నప్పుడు ఆనీటితో ఆవిరి పట్టి చూడండి మ్యాజిక్ మీకే అర్థమవుతుంది .
ఆవిరి పట్టేటప్పుడు తలకు మందపాటి క్లాత్ ను కప్పుకోవాలి.
కొన్ని నిముషాల పాటు కవర్ చేసిన ఆవిరి పట్టడం వల్ల చెవిదిబ్బడ నుండి ఉపశమనం పొందుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications