రాత్రిపూట లేటుగా భోజనం చేయడం వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్..

By Super

మన శరీరానికి సమయానికి భోజనం, నిద్ర చాలా అవసరం. ఈ రెండింటిలో ఏది తేడా వచ్చినా అవి మన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సమయానికి తినకపోవడం, సమయానికి పడుకోకపోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు.

రాత్రి ఆలస్యంగా భోజనం లేదా స్నాక్స్ తినటం వంటి అలవాట్ల వల్ల మన నిద్ర భంగానికి కారణమవుతాయి. ఈ అలవాట్లు అజీర్ణం, వివిధ రకాల సమస్యలకు కారణమవుతాయి. రోజు రాత్రి సమయంలో నిద్రాభంగం ఉంటే రాత్రి భోజనాన్ని త్వరగా ముగించడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.

రాత్రిళ్లు మితిమీరిన స్థాయిలో తినటం వల్ల కూడా నిద్రకు భంగం కలగవచ్చు. గుండె మంట, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు ఇలా డిన్నర్ లేట్ గా చేయడం వల్ల ఈ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. రాత్రి భోజనం తిన్న తర్వాత త్వరగా పడుకోవటం వలన మన శరీరంలో ఆహారం జీర్ణం అవటానికి సరైన సమయం కేటాయించ లేదని అర్థం. దీని వలన జీర్ణ వ్యవస్థ నెమ్మదిగా మారి, ఇతరేతర సమస్యలకు కారణం అవుతాయి.

సరైన సమయంలో రాత్రి భోజనం చేయటం, గుండె ఆరోగ్యం మధ్య సంబంధం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. రాత్రి భోజనం త్వరగా చేయటం వలన హార్ట్ స్ట్రోక్, అటాక్ లు తక్కువగా కలుగుతాయి. ఆలస్యంగా తినటం వలన తీసుకునే క్యాలరీల సంఖ్య పెరగటం, శరీరంలో ఇవి వినియోగపడకపోవటం వలన ట్రైగ్లిసరైడ్ లుగా శరీరంలో నిల్వ ఉండి, హార్ట్ స్ట్రోక్, హార్ట్ అటాక్ వంటి రోగాలను కలిగిస్తున్నాయి అని పరిశోధనలు నిరూపించాయి.

రాత్రి త్వరగా భోజనం చేసి పడుకోవటం వల్ల మరుసటి రోజు ఉదయం మనం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మన శరీరానికి అవసరమైన వ్యాయామాలు చేసే సమయం కూడా లభిస్తుంది. వ్యాయామాల వలన మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో మన అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం చాలామందికి ఉన్న పనుల ఒత్తిడి వల్ల ఈ ఎర్లీ డిన్నర్ చాలామందికి సాధ్యం కాని నేపధ్యంలో ఇది ఆచరించడం కష్టమే అయినా ప్రయత్నించి చూస్తే ఫలితాలు కనిపిస్తాయి..

Eating Late At Night Can Lead To THIS Disorder

బరువు నియంత్రణ
రాత్రి త్వరగా తినటం వలన మన శరీర బరువును చక్కగా నియంత్రించుకోవచ్చు. ఆలస్యంగా తినటం వలన ఆకలి ఎక్కువగా అనిపించి, ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. దీని వలన ఉదయం తీసుకునే అల్పాహారానికి సమస్య ఏర్పడుతుంది. ఫలితంగా, ఇన్సులిన్‌ నిల్వ పెరిగి, శరీరంలో కొవ్వు పదార్థాల నిల్వ అధికమై బరువు పెరుగుతారు.
Eating Late At Night Can Lead To THIS Disorder

మంచి నిద్ర
రాత్రి భోజనాన్ని ఆలస్యంగా చేయటం వలన లేదా తిన్న వెంటనే పడుకోవటం వలన గురకలు పెట్టే అవకాశం ఉంది. రాత్రి ఆలస్యంగా తినటం వలన లేదా అధికంగా తినటం వలన అజీర్ణానికి కారణం అవుతుంది. దాంతో మంచి నిద్రకు మీరు దూరమవుతారు. జీర్ణాశయంలో ఆహారం జీర్ణమవటానికి తగిన సమయం కేటాయించాలి. రాత్రి భోజనాన్ని త్వరగా తినటం వలన, జీర్ణ వ్యవస్థలో ఆసిడ్‌లు తగిన స్థాయిలో విడుదలై, ఆహరం సజావుగా జీర్ణమవుతుంది.
Eating Late At Night Can Lead To THIS Disorder

శక్తిని పెంచుతుంది
ఉదయం కొద్దిగా ఆహారాన్ని తీసుకుంటే రోజంతా మీరు శక్తివంతంగా ఉంటారు. అలానే రాత్రి సమయంలో కూడా కొద్దిగా తినటం వలన శక్తి స్థాయిలు కూడా పెరుగుతాయి. రోజు మొత్తం కొద్ది కొద్దిగా ఆహారాన్ని తినటం వలన రోజంతా సానుకూల శక్తి ఉత్పత్తి చెందటమే కాకుండా, మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. రాత్రి ఆలస్యంగా తినటం వలన శక్తిస్థాయిలు క్షీణింపబడతాయి. అలాగే అల్ప రక్త పీడనం, ఆకలి మందగించడం, ప్రతికూల భావోద్వేగాలకు గురవుతారు. పడుకోటానికి ముందుగా, ఆకలిగా అనిపించకపోయినా, కొద్దిగా తినటానికి ప్రయత్నించండి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Monday, May 2, 2016, 19:45 [IST]
Desktop Bottom Promotion