Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చలికాలంలో స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ను ఎఫెక్టివ్ గా నివారించే హోం రెమెడీస్..!
చర్మ సమస్యలు వివిధ రకాలుగా ఉంటాయి. చర్మం ఎప్పుడైతే ఎర్రగా కమిలి, చర్మంలో బ్లిస్టర్స్, చిన్న మొటిమలు ఏర్పడుతాయి, ఇవి చాలా పెయిన్ ఫుల్గా మరియు దురద కలిగిస్తాయి. ఇటువంటి లక్షణాలు కనబడినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ లక్షణాలన్నీస్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కు సంకేతాలు..
శరీరంలో సెడన్ గా ఇటువంటి లక్షణాలు కనబడ్డప్పుడు కొంత ఆందోళన, ఎలా నివారించుకోవడమే భయం ఏర్పడుతుంది. స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారించుకోవడానికి బెస్ట్ హోం రెమెడీస్ ఉన్నాయి.

స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే, చర్మ స్ట్రెచ్ అవ్వడం, లేదా పగుళ్ళు ఏర్పడటం జరుగుతుంది . స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కు వివిధ రకాల కారణాలున్నాయి. వాతావరణంలో మార్పులు, మురికి చెమటలు వల్ల చర్మం మీద బ్యాక్టీరియా చేరుతుంది. దాంతో ఫంగల్ ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది.
చర్మంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ముఖ్యంగా కాళ్ళ వేళ్ల మద్య, జెనిటిల్ (బహుమూలల్లో), ఎక్కడెక్కడ చర్మం ఫోల్డ్ అవుతుందో ఆ ప్రదేశంలో స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. ఇటువంటి పరిస్థితిలో పరిశుభ్రత, కొన్ని నియమాలు పాటించడం వల్ల ఇటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ను దూరం చేసుకోవచ్చు. . చర్మంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కంటిన్యూయస్ గా రావడానికి కారణం ఫంగస్. సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, ఇతర సమస్యలు తీవ్రమవుతాయి. మరి అటువంటి పరిస్థితికి తీసుకెళ్ళకుండా ప్రారంభంలో ఈ క్రింది సూచించిన హోం రెమెడీస్ ను ఉపయోగించి స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నివారించుకోవచ్చు..

పసుపు:
పసుపులో యాంటీ ఫంగల్ యాంటీసెప్టిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పసుపు కొమ్ము పచ్చిది తీసుకు,ి పొడి చేసి నేరుగా చర్మం మీద అప్లై చేయాలి. ఇన్ఫెక్షన్, దురద ఉన్న ప్రదేశంలో అప్లై చేసి రెండు మూడు గంటలు తర్వాత మంచి నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

వెనిగర్ :
బౌల్లో కొన్ని చుక్కల వెనిగర్, నీళ్ళు మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఇన్ఫెక్షన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారించబడుతుంది.

టీట్రీ ఆయిల్ :
టీ ట్రీ ఆయిల్లో యాంటీ ఫంగల్ లక్షణాలున్నాయి. కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్ తీసుకుని, అందులో కొన్ని చుక్కల బాదం ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్నిప్రభావిత ప్రదేశంలో అప్లై చేయాలి. రోజుకు రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

వెల్లుల్లి:
ఇందులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు స్కిన్ ఇన్ఫెక్షన్ లక్షణాలను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి, అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, ఇన్ఫెక్షన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పెరుగు:
పెరుగులో ప్రొబయోటిక్స్ ఉంటాయి. ఇది ఫంగస్ గ్రోత్ ను నివారిస్తుంది. ఒక కాటన్ బాల్ తీసుకుని, పెరుగులో డిప్ చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత వేడినీళ్లతో శుభ్రం చేసుకుని తేమను పూర్తిగా తుడిచేయాలి. ఇలా రోజుకు ఒక్కసారి చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరి నూనె :
స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారించడంలో కొబ్బరి నూనె గ్రేట్ గా సహాయపడుతుంది. కొద్దిగా స్వచ్చమైన కొబ్బరి నూనెతీసుకుని,ప్రభావింత ప్రాంతంలో అప్లై చేయాలి. రోజుకు రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ల్యావెండర్ ఆయిల్ :
ల్యావెండర్ ఆయిల్లో యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని చుక్కల ల్యావెండర్ ఆయిల్ ను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

ఆలివ్ లీప్ :
ఆలివ్ లీప్ లో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. కొన్ని ఆలివ్ లీఫ్స్ తీసుకుని, పేస్ట్ చేసి ఇన్ఫెక్షన్ ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications