Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
మెదడు రుగ్మతలను నివారించడానికి ఆహారాలు
మెదడు శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం. ఇది ఇతర అవయవాలను క్రమబద్దీకరణ చేస్తుంది.
మెదడు సరైన క్రమం లో పని చేయకపోతే ఇతర అవయవాలు కూడా తగిన విధంగా పని చేయలేవు.
అందువలన, సమతుల్య ఆహారం తీసుకుంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.
సమతుల్య ఆహారం తీసుకుంటే చిత్తవైకల్యం, పార్కిన్సన్ వ్యాధి మరియు అల్జీమర్ వ్యాధి వంటి వ్యాధులను పారద్రోలటానికి అవసరమైన అన్ని పోషకాలు మెదడుకు అందుతాయి. దాంతో మెదడు బలపడి జ్ఞానపరమైన క్రియలను పెంచుతుంది.
మన మానసిక స్థితి, దృష్టి, అధ్యయన సామర్ధ్యం మరియు మెమరీ మనం తినే ఆహారాల ద్వారా ప్రభావితం అవుతాయి.
అందువలన, మెదడు పనితీరు మరియు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సరైన ఆహారాలను ఎంచుకోవలసిన అవసరం ఉంది. మెదడు ఆరోగ్యాన్ని పెంచటానికి మరియు పార్కిన్సన్ వ్యాధి మరియు చిత్తవైకల్యం వంటి మెమరీ సంబంధిత రుగ్మతలు నిరోధించడానికి కొన్ని సూపర్ ఆహారాలు ఉన్నాయి.
మీ రోజువారీ ఆహారంలో ఈ సూపర్ ఆహారాలను చేర్చితే మీ శరీరం యొక్క మొత్తం ఆరోగ్యాన్ని నిర్వహించవచ్చు.
అందువలన, ఈ వ్యాసం లో Boldsky మెదడు పనితీరుకు సహాయపడే సూపర్ ఆహారల గురించి తెలియజేస్తుంది.

గ్రీన్ టీ
గ్రీన్ టీలో యాంటి ఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన ఫ్రీ రాడికల్స్ తొలగించడానికి సహాయపడుతుంది. గ్రీన్ టీలో పోలిఫెనోల్స్ సమృద్దిగా ఉండుట వలన మెదడులో ప్రోటీన్ ఏర్పడటాన్ని తగ్గించి చిత్తవైకల్య ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాక పోలిఫెనోల్స్ మెమరీ పెంచడానికి మరియు మెదడు కనెక్టివిటీని విస్తరించేందుకు సహాయపడుతుంది.

పాలకూర
పాలకూరలో పొటాషియం సమృద్దిగా ఉండుట వలన మెదడు కొరకు ఉత్తమమైన ఆహారంగా ఉంది. పొటాషియం మెదడు ఎలక్ట్రానిక్ వాహకత నిర్వహించడానికి సహాయపడుతుంది. అంతేకాక మెదడు కణాల నష్టాన్ని నిరోదించి చిత్తవైకల్య ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఆపిల్
ఆపిల్ లో కుఎర్చెతిన్ అనే శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది పార్కిన్సన్ మరియు అల్జీమర్ వ్యాధుల వంటి న్యూరోడీజనరేటివ్ వ్యాధులకు వ్యతిరేకంగా పోరాటం చేసి మెదడును రక్షిస్తుంది. అంతేకాక మెదడు నరాల కణాలను రక్షిస్తాయి. అలానే ఊపిరితిత్తుల మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

అవోకాడో
అవోకాడోలో ఉండే ఖనిజాలు రక్తంలో ఆక్సిజన్ కంటెంట్ పునరుత్పత్తికి సహాయపడతాయి. మరోవైపు, అవోకాడోలో సమృద్దిగా ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఆక్సీకరణ ఒత్తిడి మరియు స్వేచ్ఛారాశులు చర్య నుండి కణాల శోథను నిరోధించడానికి సహాయపడతాయి.

పసుపు
పసుపులో " కర్కుమిన్ " అనే సమ్మేళనం ఉంటుంది. అలాగే యాంటి ఆక్సిడెంట్ , శోథ నిరోధక లక్షణాలు సమృద్దిగా ఉండుట వలన మెదడు గాయాలు అయ్యిన రోగులకు సహకరించడానికి మరియు అభిజ్ఞా బలహీనత ఎదుర్కొనడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications