For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోటి వాసనను నేచురల్ గా తగ్గించే 10 సింపుల్ టిప్స్ ..!

|

శ్వాస చెడు వాసన కొడుతూంటే నిజంగా చాలా అవమానకరంగా వుంటుంది. వ్యక్తిగతంగా, సామాజికంగా ఎంతో అసౌకర్యం భావిస్తాం. దీనికి కారణం నోటి ఆరోగ్యం సరిగా ఉంచుకోకపోవడమే. లేదా జీర్ణక్రియ సరిలేక గ్యాస్ సంబంధిత సమస్యలు. నోటి దుర్వాసన అనేది ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేటువంటి చాలా బాధాకరమైన విషయం. ఈ సమస్య వల్ల మీరు నలుగురితో సంతోషం గడపలేరు? మరియు నలుగురిలో హాపీగా నవ్వలేరు? అంతే కాదు మీతో ఉండే వారు మీ మీద జోకులేయడం కూడా మొదలు పెట్టేయవచ్చు.

మనం ఎప్పుడూ నోటిదుర్వాసనకు కారణం నాలుమీద ఫలకం(పాచీ), కావిటీస్ మరియు పంటి గాయం వంటివే నోటి దుర్వాసనకు కారణం అని ఆలోచిస్తుంటాం. అయితే నోటి దుర్వాసనకు కొన్ని ఊహించని మరియు మనకు తెలియని కొన్ని కారణాలున్నాయి. మీరు నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతూ..వివిధరకాల చిట్కాలతో పోరాడుతూ మరియు అది వదిలించుకోవలేకపోతున్నారు . అటువంటప్పుడు నోటి దుర్వాసనకు మరేదైన మీకు తెలియని వింత కారణాలున్నాయామో తెలుసుకోవాలి. దంతాలు సరిగా శుభ్రం చేసుకోకపోవడం, వాసన వచ్చే ఆహారాలను తినడం, డ్రై మౌత్, స్మోకింగ్, మెడికేషన్స్ మొదలగునవి బ్యాడ్ బ్రీత్ కు కొన్ని ప్రైమరీ రీజన్స్ ఉన్నాయి. నోటి దుర్వాసనకు కారణమేదైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నివారించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

నోటి దుర్వాసనను నివారించుకోవడానికి మార్కెట్లో అనేక రకాల మౌత్ ఫ్రెషనర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి వల్ల వేరే ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి. లేదా ఇన్ స్టాంట్ గా కొద్దిసేపు మాత్రమే ఫలితాన్ని అందిస్తాయి. కాబట్టి, మన ఇంట్లో నేచురల్ గా మనకు అందుబాటులో ఉండే హోం రెమెడీస్ ను అనుసరించడం ఉత్తమం. నోటి దుర్వాసనను నివారించే హోం రెమెడీస్..

1.లవంగాలు:

1.లవంగాలు:

లవంగము దాని రుచి మరియు వాసన కోసం వంటలలో ఉపయోగిస్తారు. అన్ని వయసుల వారికీ పంటి నొప్పి తగ్గటానికి దీనిని ఉపయోగిస్తారు. అంతేకాక టూత్ పేస్టు మరియు మౌత్ వాష్ లలో కూడా ఉపయోగిస్తారు. మంచి శ్వాస డియోడోరైజెర్ గా పనిచేస్తుంది. లవంగాలలో యాంటీ బాక్టీరియల్ యూజెనాల్ సమృద్ధిగా ఉంటాయి.మీరు కొన్ని లవంగాలను నమలండి.(చదవండి: పది చెడు శ్వాస భూతాలను ఓడించండి)

2. నిమ్మ:

2. నిమ్మ:

నిమ్మ , నారింజ వంటి సిట్రస్ పండ్లు మీ లాలాజల గ్రంథుల ఉద్దీపనకు సహాయం మరియు లాలాజలము ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. లాలాజలం ఫలకం ఉత్పత్తి ఆమ్లాలను తటస్థీకరిస్తుంది. అలాగే నోటిలో పేరుకుపోయిన మృత కణాలు మరియు ఆహార కణాలను తొలగించడానికి సహాయపడుతుంది.(చదవండి: మీ నోటి ఆరోగ్యం గురించి మీకు ఏమి తెలుసు?)

3. పార్ల్సే:

3. పార్ల్సే:

పార్స్లీ వంటకు కాకుండా అలంకరణకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నారా? పార్స్లీ జెర్మ్స్ ను ఎదుర్కోగల లక్షణాలు కలిగిన పత్రహరితాన్ని కలిగి ఉంటుంది. మీ భోజనం చివరిలో దానిని సేవ్ చేయండి. ఇది ఒక అద్భుతమైన శ్వాస సువాసన పదార్ధంగా ఉంటుంది. ఈ నూనెను శ్వాస ఫ్రెషనర్స్,సబ్బులు మరియు పరిమళ ద్రవ్యాలలో సువాసన కొరకు ఉపయోగిస్తారు.

4. పుదీనా:

4. పుదీనా:

మార్కెట్లో అందుబాటులో ఉండే చాలా శ్వాస ఫ్రెషనర్స్ లలో ప్రధాన మూలవస్తువుగా పుదీనా ఉంటుంది. పుదీనా ఆకులను వంటకాలలో గార్నిషింగ్ కొరకు బాగా ఉపయోగిస్తారు. వాటి బలమైన మరియు శీతలీకరణ ప్రభావం వలన తక్షణమే మీ శ్వాస ఫ్రెష్ గా ఉంటుంది. కొన్ని ముడి పుదీనా ఆకులను నమలవచ్చు. అలాగే ఒక కప్పు పుదీనా టీను కూడా త్రాగవచ్చు.

5. తులసి:

5. తులసి:

బ్యాడ్ బ్రీత్ నివారించుకోవడంలో హెర్బ్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. అటువంటి వాటిలో తులసి ఒకటి. భోజనం చేసిన తర్వాత ఫ్రెష్ గా ఉన్న తులసి ఆకులను నమలడం లేదా వంటల్లో వాడటం చేయాలి. తులసిలో ఉండే ఆరోమా వాసన బ్యాడ్ బ్రీత్ ను రిఫ్రెష్ చేస్తుంది. ఆహారం రుచిగా ఉంటుంది.

6. యాలకలు:

6. యాలకలు:

ఏలకుల గింజలు ఒక సుగంధ ద్రవ్యం. ఇది తీపి రుచి కలిగి మరియు మీ శ్వాస మంచిగా ఉండటానికి ఉపయోగించవచ్చు. కేవలం చెడు శ్వాస వదిలించుకోవటం కోసం మీ నోటిలో వేసుకొని కొన్ని నిమిషాల పాటు నమలండి. మీ భోజనం ఎండింగ్ లో ఏలకులు టీ అనేది ఒక చెడ్డ ఆలోచన కాదు.

7. సోంపు:

7. సోంపు:

సోపు మామూలుగా భోజనం తర్వాత అజీర్ణం తగ్గిస్తుందనే నమ్మకంతో నములుతూ ఉంటాము. కానీ ఇది ఒక అద్భుతమైన నోటి ఫ్రెషనర్స్ అని మీకు తెలుసా? సోపు లాలాజలం ఉత్పత్తి పెరుగుదలకు మరియు చెడు శ్వాస కలిగించే జెర్మ్స్ మీద పోరాటం చేయటానికి సహాయం చేస్తుంది. అంతేకాక గ్యాస్ వల్ల వచ్చే త్రేన్పులు మరియు ఆమ్లం రిఫ్లక్స్ ను తగ్గించవచ్చు. మీరు కొన్ని గింజలను నమిలితే సహజంగా మీ శ్వాస బాగుంటుంది.

8. దాల్చిన చెక్క:

8. దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క కూడా ఒక బాక్టీరియా లక్షణాన్ని కలిగి చెడు శ్వాసను తగ్గించే ఒక సుగంధ ద్రవ్యం. మీరు దాల్చిన చెక్కను నమలవచ్చు. అలాగే ఒక కప్పు టీలో జోడించవచ్చు. అంతేకాక నీటిలో దాల్చిన చెక్క వేసి కాచి,చల్లారిన తర్వాత ఒక మౌత్ వాష్ గా ఉపయోగించవచ్చు.

9. బేరిపండ్లు:

9. బేరిపండ్లు:

పండ్లలో బేరిపండ్లు వంటి పైబర్ ఫుడ్స్ నమిలి తినడం వల్ల నోట్లో లాలాజల ఉత్పత్తికి సహాయపడుతాయి. దాంతో పాటు, బ్యాక్టీరియాను చాలా ఎఫెక్టివ్ గా నాశనం చేస్తాయి. శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు ఫ్లష్ అవుట్ చేస్తాయి.

10. బేకింగ్ సోడ:

10. బేకింగ్ సోడ:

బ్యాడ్ బ్రీత్ నివారించుటకు బేకింగ్సోడా ఎక్సలెంట్ హోం రెమెడీ. బ్యాక్టీరియాను నివారించడంలో ఇది గ్రేట్ గా పనిచేస్తుంది. నోట్లో అసిడిక్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. అరటీస్ఫూన్ బేకింగ్ సోడాను ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి నోటిని శుభ్రం చేసుకోవాలి.

English summary

Get Rid Of Bad Breath With These Natural Ways

Bad breath can be a really awkward thing to have. If you have bad breathe while talking to someone it can be a very embarrassing situation for both you and the person you are talking to.
Story first published:Wednesday, August 10, 2016, 16:37 [IST]
Desktop Bottom Promotion