Latest Updates
-
జెన్ జీ డేటింగ్ డిక్షనరీలో కొత్త పదం పఫర్ ఫిషింగ్.. మీ లవ్ స్టోరీలోనూ ఇలాగే జరుగుతోందా? -
భర్త మరణం, చేతిలో పసికందు,చేతిలో ఉన్నది రూ.500..ఇప్పుడు ఆమె టర్నోవర్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! -
గర్భిణీలు నేరేడు పండ్లు తింటే పిల్లలు నల్లగా పుడతారా.. ఇందులో నిజమెంత.? -
హనుమాన్ అష్టోత్తరం అర్థం తెలిస్తే జీవితం మారుతుంది -
గుడ్డు తింటున్నారా? ఈ పచ్చి నిజాలు మీరు తెలుపుకోవాల్సిందే! -
మ్యాంగో గులాబ్ జామ్ తిన్నారా? సమ్మర్ అయిపోయే లోపు తప్పకుండా తిన్సాల్సిన స్వీట్! -
భార్యపై ఇంట్రెస్ట్ తగ్గిపోతుందా.?.. మీరు అస్సలు ఊహించని షాకింగ్ నిజాలు ఇవే.! -
ఆధునిక జంటలు నార్మల్ అనుకుంటున్న అతి పెద్ద రిలేషన్ షిప్ తప్పు ఇదే.. మీరూ చేస్తున్నారా? -
యాభై ఏళ్ల వయసులోనూ యాక్టివ్గా ఉండాలంటే అబ్బాయిలు 30ల్లో తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే.! -
చేతి చెక్కలు ఎప్పుడైనా తిన్నారా? వర్షం పడుతున్నప్పుడు తింటే కేకో కేక..కరకరలాడుతూ భలే రుచిగా..
అల్లం & మిర్చి: క్యాన్సర్ ని నిరోధించే 2 అద్భుతమైన పదార్ధాలు!
మీ ఇంట్లో ఉన్న రెండు అత్యంత సాధారణ పదార్ధాలతో క్యాన్సర్ ని నిరోధించవచ్చని మీకు తెలుసా? ఆ రెండు పదార్ధాలు ఇంకేవో కాదు అల్లం, మిర్చి. అవి కేవలం సుగంధ ద్రవ్యలె కాదు మీ ఆహారానికి మసాలా కూడా, కానీ ఇవి క్యాన్సర్ పై ఎంతో శక్తివంతమైన ఆహారపదార్దాలుగా పోరాడతాయి.
ఈ మధ్య జరిగిన అధ్యయనాల ప్రకారం, అల్లం, మిర్చిలో ఉన్న రెండు సమ్మేళనాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని వెల్లడైంది. మిర్చిలో కాప్సైసిన్ అనే, అల్లంలో జింజేరోల్-6 అనే పదార్ధాలు ఉంటాయి. జింజేరోల్-6 బలమైన సమ్మేళనాన్ని ఉత్పత్తి చేసే కాప్సైసిన్ ని బంధించి ఉంచుతుందని నమ్ముతారు. ఈ సమ్మేళనం కణితి-పెరుగుదల గ్రహకలను నివారించడానికి పేరుగాంచింది.

క్యాన్సర్ పై పోరాడే శక్తివంతమైన ఆహారపదార్ధాలు
ఆరోగ్య పరిరక్షణకు, రక్త ప్రసరణ అభివృద్ధికి అల్లం చాలా సహాయపడుతుంది. ఇందులో మెగ్నీషియం, జింక్, క్రోమియం ఎక్కువగా ఉండడం వల్ల వాటి ప్రయోజనాలను బాగా అందిస్తుంది. ఒక నివేదిక ప్రకారం, అల్లం ని టీ లేదా జామ్ వంటి వివిధ రూపాల్లో తీసుకోవడం వల్ల, గర్భధారణ సమయంలో వికారం లాంటివి రాకుండా చేయడానికి సహాయపడుతుందని చెప్తారు.
మిర్చిలో కాప్సైసిన్ అని పిలవబడే సమ్మేళనం వల్ల కారపు రుచులు కలుగుతాయి, ఇవి తలనొప్పికి కారణమైన నొప్పిని నివారించడానికి, మంటపై పోరాడడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా, మిర్చి లో విటమిన్ C ఎక్కువగా ఉండి అది రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది.

క్యాన్సర్ పై పోరాడే శక్తివంతమైన ఆహారపదార్ధాలు
జింజేరోల్-6, కాప్సైసిన్ రెండిట్లో కణాల్లో ఉండే ఒకే గ్రాహకాలను బంధించి ఉంచుతుందని కనుగొన్నారు. ఈ గ్రహకానికి శరీరంలోని కణితి పెరుగుదలతో సంబంధం ఉంది. అల్లం, చిల్లి ని మీ ఆహార పదార్ధాలలో కలుపుకొని తీసుకోవడం అనేది చాలా అవసరం.
చాలావరకు భారతీయ వంటకాలు ఈ రెండు పదార్ధాలు కలిగి ఉంటాయి, ఇప్పుడు మీరు ఎంచుకోవడానికి ఎంపికల శ్రేణి ఉంది.
ఇలాంటే వంటకాలే కాకుండా, మీరు ఏ సమయంలోనైనా తయారుచేసుకొనే వివిధ రకాల ఆహార పదార్ధాల నుండి కూడా మీరు వీటిని ఎంచుకోవచ్చు.

క్యాన్సర్ పై పోరాడే శక్తివంతమైన ఆహారపదార్ధాలు
అందువల్ల, క్యాన్సర్ పై పోరాడే ఎంతో శక్తివంతమైన ఈ 2 వంటలపై దృష్టిపెట్టండి.
తేలికైన వంటలు:
1.మామిడి అల్లం సలాడ్:
స్టెప్ 1: ఎండుద్రాక్ష ను ఉపయోగించి నీరు వేడిచేసి డ్రెస్సింగ్ తయారుచేసుకోండి. గంటన్నర ఆగక నీటిని తీసేయండి. అందులో ఆయిల్, అల్లం, చిల్లీ, వెనిగర్, ఉప్పు వేయండి. ఈ మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టండి.

స్టెప్ 2: అవసరమైన కూరగాయల ముక్కలు వేయండి, ఒక బౌల్ లో మామిడికాయ ముక్కలు తరగండి, అందులో టాస్ తో డ్రెస్ చేయండి. వెంటనే వడ్డించండి.
క్యాన్సర్ పై పోరాడే శక్తివంతమైన ఆహారపదార్ధాలు
2.కాయధాన్యాలు, బీన్ చిల్లి:
స్టెప్ 1: కొద్దిగా ఆలివ్ నూనె ను వేడిచేసి, అందులో ఉల్లిపాయలు, క్యాప్సికం వేయండి.
స్టెప్ 2: తరువాత, అందులో అల్లం వేయండి. అది ఉడికిన తరువాత, అందులో ఉప్పు, మిరప పొడి, టొమాటోలు, కొద్దిగా నీళ్ళు పోసి కలపండి.

క్యాన్సర్ పై పోరాడే శక్తివంతమైన ఆహారపదార్ధాలు
స్టెప్ 3: కాయధన్యాలను వేసి ఒక అరగంట ఉడికించండి. ఈ మిశ్రమంలో మీరు బీన్స్, యాపిల్ సేడార్ వెనిగర్ ని కూడా కలపి, తక్కువ మంటపై 20 నిమిషాల సేపు ఉడికించండి. దీనిని అన్నంపై వడ్డించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications