For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెడిసిన్స్ కు కూడా తలొగ్గని సైనస్ కు బామ్మ చెప్పె చిట్కాలు

|

మీకు దగ్గు,తుమ్ములు నిరంతరాయంగా వస్తున్నాయా? మీకు మీ అలెర్జీ చికాకు కలిగిస్తున్నదా? చివరగా, మీరు ఒక వైద్యుడుని సందర్శించాలని ఆలోచిస్తున్నారా? జలుబు కోసం మీ మందులు పనిచేయకపోతే మరియు మీరు మీ శరీరం నొప్పులు మరియు అలెర్జీలతో కఠినముగా ఉంటే,అప్పుడు మీరు సైనసిటిస్ గా భావించాలి.

తలనొప్పి తీవ్రంగా వేధిస్తున్నా? కళ్ల దగ్గర దురదగా ఉన్నా? ముక్కు ఇరువైపులా ముట్టుకుంటే నొప్పిగా ఉన్నా? మీరు సైనసైటిస్‌తో బాధపడుతున్నట్టే. సైనస్ గదుల్లో ఏర్పడే నొప్పినే సైనసైటిస్ అంటారు. ముక్కుకు ఇరువైపులా సైనస్ గదులు ఉంటాయి. దీనివల్ల మ్యూకస్ పేరుకుపోతుంది. అందువల్ల బాక్టీరియా, ఇతర క్రిములు పెరిగి సైనసైటిస్ సమస్య మొదలవుతుంది. సైనసైటిస్ నాలుగు వారాల కంటే తక్కువ ఉంటే అక్యూట్ సైనసైటిస్ అని, 4 నుంచి 12 వారాల పాటు ఉంటే క్రానిక్ సైనసైటిస్ అని భావించాలి.

లక్షణాలు
తరచు జలుబు చేయడం, జలుబుతో ఎక్కువ రోజులు బాధపడటం సైనసైటిస్ ప్రాథమిక లక్షణం. ఈ దశలో సరైన చికిత్స తీసుకోకపోతే తరువాత ఇది మందులకు కూడా లొంగదు. ముక్కులు బిగదీసుకుపోతాయి. ఆపైన ముక్కు నుంచి పసుపు పచ్చని స్రావం వస్తుంది. దగ్గు, శ్వాస దుర్గంధంతో కూడి ఉంటుది. ముఖంలో వాపు, పళ్లు, కళ్ల వెనుక భాగంలో నొప్పి కనిపిస్తుంది. కొద్దిరోజులకు వాసన తెలియకుండా పోతుంది.

సైనస్ కు వెంటనే చికిత్స చేయించుకోకపోతే పరిస్థితి తీవ్రంగా మారుతుంది. అంతే కాదు అసౌకర్యానికి గురిచేస్తుంది . సైనస్ కంజెషన్ కు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ పరిష్కార మార్గాలున్నాయి . ఈ మార్గాల ద్వారా సైనస్ లక్షణాలను నివారించుకోవచ్చు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ సైనస్ కంజెషన్ దేనివల్ల వచ్చిందో కనుగొన్నట్లైతే సమస్యను తగ్గించుకోవడాని సాధ్యపడుతుంది. అంతే కాదు,ఈ సైనస్ సమస్య చిన్నగా ఉన్నప్పుడే సరైన చికిత్స తీసుకొన్నట్లైతే వెంటనే ఉపశమనం పొందవచ్చు. అంతే కాదు, సైనస్ లక్షణాలను ప్రారంభంలో గుర్తించినట్లైతే హోం మెరెడీస్ తోనే తగ్గించుకోవచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

సైనస్ కంజెషన్ సమస్యతో బాధపడుతున్నట్లైతే వెంటనే ఈ హోం రెమెడీస్ ను ఉపయోగించడం వల్ల ఉపశమనం పొందవచ్చు...

స్టీమింగ్:

స్టీమింగ్:

బెస్ట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ రెమెడీ స్టీమింగ్. ఆవిరి పట్టడం ద్వారా నాజల్ కంజషన్ బ్రేకప్ చేయొచ్చు. చాలా తక్కువ సమయంలో ఉపశమనం పొందవచ్చు . అంతే కాదు స్టీమ్ వల్ల డ్రై మ్యూకస్ హుమిడిఫై చేస్తుంది. దాంతో తొలగింపబడుతుంది.

ఉప్పు:

ఉప్పు:

కొన్ని సందర్భాల్లో , దుమ్ము, ధూళీ, కాలుష్యం వల్ల సైనస్ మార్గం మూసుకుపోవడం వల్ల, కంజషన్ కు కారణం అవుతుంది. అందువల్ల . ఈ చీకాకుల నుండి బయట పడాలంటే సాల్ట్ వాటర్ తో ముక్కు శుభ్రం చేసుకోవడం వల్ల కొద్దిగా ఉపశమనం పొందవచ్చు.

 స్మోకింగ్ వల్ల సమస్య మరింత తీవ్రం అవుతుంది:

స్మోకింగ్ వల్ల సమస్య మరింత తీవ్రం అవుతుంది:

సిగరెట్స్ మరియు సెకెండ్ హ్యాండ్ స్మోక్ వల్ల క్రోనిక్ సైనస్ పెరుగుతుంది . దాంతో సైనస్ కంజెషన్ పెరుగుతుంది . సైనస్ సమస్య ఉన్నప్పుడు వెంటనే స్మోక్ తగ్గించడం వల్ల సైనస్ కంజెషన్ నివారించుకోవచ్చు.

నాజల్ స్ప్రే:

నాజల్ స్ప్రే:

ప్రస్తుత రోజుల్లో మెడికల్ సైన్స్ బాగా అభివ్రుద్ది చెందినది . నాజల్ స్ప్రే ద్వారా ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవచ్చు . ఇది కంజెషన్ ను నివారిస్తుంది .

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు:

యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా కలిగి ఉన్న ఉల్లిపాయలు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. అలాగే ఇందులో ఉండే సల్ఫర్ నాసల్ ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా చూస్తుంది. పచ్చి ఉల్లిపాయ తిని.. ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

కారం:

కారం:

సైనస్ నుంచి ఉపశమనం పొందడానికి కారంపొడిని కూడా ఉపయోగించవచ్చు. ముక్కులో వచ్చే ఫ్లమ్ ని తగ్గించడానికి, మున్ముందు ఏర్పడకుండా తగ్గించడానికి కారం చాలా పర్ ఫుల్ గా పనిచేస్తుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో కారం పొడిని ఆహారంలో కలుపుకుని తీసుకోవాలి.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

ముక్కులో వచ్చే ఫ్లమ్ తో వెల్లుల్లి చక్కగా పోరాడుతుంది. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి రోజుకి 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవడం వల్ల సైనస్ ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది. అలాగే క్రోనిక్ సైన సైటిస్ సమస్యలను కూడా ఇది అరికడుతుంది.

హెర్బల్ టీ:

హెర్బల్ టీ:

అల్లం, పుదినా, తులసి కలిపి హెర్భల్ టీ తయారు చేసుకోండి. ఈ టీని రోజుకి రెండు మూడు సార్లు తీసుకోవడం వల్ల మీ ముక్కులో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా.. హెల్తీగా ఉంటారు. అలాగే శ్వాస సంబంధిత సమస్యల నుంచి కూడా చక్కటి పరిష్కారం లభిస్తుంది.

అలర్జీల గురించి తెలుసుకొని ఉండాలి:

అలర్జీల గురించి తెలుసుకొని ఉండాలి:

ఎలాంటివి మీ ఒంటికి పట్టవో వాటి గురించి తెలుసుకొని ఉండాలి . సైనస్ ఇన్ఫెక్షన్ నుండి కొద్దిగా ఉపశమనం పొందవచ్చు . అలర్జీలున్నప్పుడు సరైన మందులు తీసుకొని సైనస్ సమస్యను నివారించుకోవచ్చు.

బరువు తగ్గించుకోవాలి:

బరువు తగ్గించుకోవాలి:

ఊబకాయగ్రస్తులు అధికబరువును తగ్గించుకోవడం వల్ల క్రోనిక్ సైనస్ ఇన్ఫెక్షన్ ను తగ్గించుకోవచ్చు . న్యూట్రీషియనిస్ట్ ను కలిసి హెల్తీ డైట్ బ్యాలెన్స్ చేసుకోవాలి.

సర్జరీ :

సర్జరీ :

షార్ట్ టర్మ్ రెమెడీస్ పనిచేయనప్పుడు ఆల్టర్ నేటివ్ గా సర్జరీ చేయించుకోవడం మంచిది.

చల్లదనానికి దూరంగా :

చల్లదనానికి దూరంగా :

ఎక్కువ సమయం ఈత కొట్టడం చేయకూడదు. చల్లని నీటితో స్నానం చేయకూడదు. చల్లటి పదార్ధాలకు దూరంగా ఉండటం, చెవిలో దూదిపెట్టుకోవడం, ఆవిరిపట్టడం చేయడం వల్ల సైనసైటిస్‌ సమస్య రాకుండా కాపాడుకోవచ్చు.

బ్రీతింగ్ ఎక్సర్ సైజ్:

బ్రీతింగ్ ఎక్సర్ సైజ్:

మరో వైపు నిరంతరం బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ చేయడం వల్ల కూడా సైనస్ బాధ నుండి ఉపసమనం పొందవచ్చు.

English summary

Grandma Remedies To Clear Sinus Congestion

Grandma Remedies To Clear Sinus Congestion, Sinus is a problem which is faced by a lot of people. The common causes include allergies and infections, but your congestion could also be caused by structural problems with your nose and sinuses.
Story first published: Friday, February 19, 2016, 18:03 [IST]
Desktop Bottom Promotion