For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిప్రెషన్, స్ట్రెస్ తగ్గించే అమేజింగ్ ఫుడ్స్...!

|

ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల మానసిక ఆరోగ్యం ఒక సమస్యగా మారుతున్నది. ఒకప్పుడు అంటువ్యాధులు మనుషుల్ని బలితీసుకున్నాయి. ఇప్పుడు మానసిక మనోశారీరక రుగ్మతలు కృంగదీస్తున్నాయి. ఇందులో డిప్రెషన్ అంత్యంత ప్రమాదకారిగా మారుతున్నది. డిప్రెషన్ అనేది ఒక విధమైన మానసిక వ్యాధి. ఏదో తెలియని బాధ, నిరాశ, ఏ పనీ చేయాలనిపించకపోవటం, నిస్సత్తువ, నిద్రలేమి, ఆకలి మందగించటం, దేనిమీదా ఆసక్తి లేకపోవడం. బరువు విపరీతంగా తగ్గిపోవటం లేదా విపరీతంగా బరువు పెరగటం. తలనొప్పి, జీర్ణసంబంధ వ్యాధులు, చనిపోవాలనే ఆలోచనలు, ఆత్మహత్యా ప్రయత్నాలు చేయటం, సరైన నిర్ణయం తీసుకోలేకపోవటం, భవిష్యత్తులో ఏదో విపరీతమైన మార్పులు సంభవిస్తాయన్న భావన మొదలైనవి దీని లక్షణాలు. సకాలంలో దీనికి సరైన చికిత్స తీసుకోకపోతే తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ఇది ఆత్మహత్యకి కూడా దారితీయవ చ్చు. దీని లక్షణాలు కొన్ని నెలలు లేదా సంవత్సరాల వరకు ఉండవచ్చు.


డిప్రెషన్ , ఒత్తిడి వల్ల శరీరంలో కార్టియోసల్ హార్మోన్లు లెవల్స్ పెరుగుతుంది. ఈ కార్టిసోల్ అనే హార్మోన్ వల్ల ఆకలి పెరుగుతుంది. ముఖ్యంగా మహిళలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల కార్బోహైడ్రేట్స్ మరియు స్వీట్స్ మీద ఎక్కువ కోరికలు పెరుగుతాయి. ఈ ఫుడ్స్ స్ట్రెస్ ను తగ్గించడానికి సహాయపడుతాయి. తిరిగి వీటి వల్ల అధిక బరువు మరియు ఇతర సమస్యలు

కాబట్టి, తినే ఆహారం సరైనదైతే ఒత్తిడి మరియు డిప్రెషన్ తగ్గించుకోవచ్చు. ఒత్తిడి తగ్గించుకోవడానికి ఒక సైలెంట్ ట్రిక్, ఒత్తిడి తగ్గించే నేచురల్ ఆహారాన్ని తీసుకోవడమే. మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ లేదా ఇతర ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం మానేయాలి. ఇవి శరీరంలో అదనపు క్యాలరీల పెంచుతాయి తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒత్తిడి తగ్గించుకోవడానికి కొన్ని నేచురల్ ఫుడ్స్ ను ఈ క్రింది లిస్ట్ లో తెలపడం జరిగింది. ఇవి డిప్రెషన్ ను తగ్గించడం మాత్రమే కాదు, ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తాయి. మరి ఆ ఆహారాల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం...

విటమిన్ బి:

విటమిన్ బి:

విటమిన్ బి అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల డిప్రెషన్ కు చెక్ పెట్టవచ్చు. ఉదాహరణకు గుడ్డు, బెల్ పెప్పర్, ఆకుకూరలు, చీజ్, టర్కీ, ఫిస్ మరియు ఇతర త్రుణధాన్యాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు. మెదడుకు కొన్ని ప్రత్యేకమైన హ్యాపికెమికల్స్ ఉత్పత్తి చేయడంవల్ల మూడ్ స్థిరంగా ఉంటుంది.

ఆస్పరాగస్ :

ఆస్పరాగస్ :

ఆస్పరాగస్ లో ఫొల్లేట్ పుష్కలంగా ఉంది. ఇది మనస్సును ప్రశాంత పరుస్తుంది. అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది దీన్ని ఆవిరిలో ఉడికించినప్పుడు మరింత ఆరోగ్యకరం . కాబట్టి, డైలీ డైట్ లో చేర్చుకోవాలి.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవడం వల్ల అది మానవ మనస్సును ఒక ప్రశాంతంగా ఉంచేందుకు ప్రభావం కలిగి ఉంటుంది. నిజానికి ఇది చాలా ఎఫెక్టివ్ గా ప్రభావం చూపెడుతుంది.

వాటర్ మెలోన్ :

వాటర్ మెలోన్ :

వాటర్ మెలోన్ డిప్రెషన్ తగ్గిస్తుంది. మరియు అందులో ఉండే నీటి శాతం బ్రెయిన్ కు ఎనర్జీని అందిస్తుంది.

ఆపిల్:

ఆపిల్:

ఆపిల్స్ లో పెక్టిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మనిషిలో మూడ్ ను క్రమబద్దం చేస్తుంది. అలాగే ఆపిల్స్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ బ్రెయిల్లో ఉండే న్యూట్రోట్రాన్స్మీటర్స్ మీద ప్రధాణ పాత్రపోషిస్తుంది. ఆపిల్స్ స్ట్రెస్ బూస్టింగ్ ఫుడ్స్.

యాలకలు:

యాలకలు:

మీరు ఇష్టంగా తాగే టీలో యాలకల పొడి కలపడం వల్ల ఆరోమా వాసన మెదడు మీద చక్కటి ప్రభావం చూపుతుంది. ప్రశాంత పరుస్తుంది.

రోజ్ టీ:

రోజ్ టీ:

రోజాపువ్వు రేకులు నీటిలో వేసి బాయిల్ చేయాలి. దీన్ని ఫిల్టర్ చేసి అవసరమైనప్పుడు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

అరటిపండ్లలో ఫైబర్ తక్కువ, అరటిపండ్లు గ్యాస్ ను తగ్గిస్తుంది.దాంతో ప్రశాంతగా మరియు ఒత్తిడి లేకుండా గడపడానికి ఇవి బాగా సహాయపడుతాయి.

జీడిపప్పు:

జీడిపప్పు:

ఇటీవలి కాలంలో చాలామంది డ్రై ఫ్రూట్స్ లో వున్న లాభాలను గ్రహించారు. వీటిలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు వుంటాయి. వాల్ నట్స్ వంటి వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వుంటాయి. మెగ్నీషియం వుంటుంది. ఇవి శరీరంలో సెరోటోనిన్ స్ధాయి పెంచుతాయి. అందుకనే డిప్రెషన్ కలిగి వున్న వారికి మెగ్నీషియం అధికంగా వుండే విటమిన్లు, మినరల్స్ ఇస్తారు. ఈ సూక్ష్మ పోషకాలు నెగెటివ్ మూడ్ ను, నిద్ర సమస్యలను, సాధారణంగా వచ్చే చికాకు, కోపం వంటివాటిని తగ్గిస్తాయి.

నట్ మగ్:

నట్ మగ్:

ఆమ్లా జ్యూస్ లో చిటికెడు నట్ మగ్ పౌడర్ మిక్స్ చేసి తీసుకోవడం వల్ల డిప్రెషన్ ను నేచురల్ గా తగ్గించుకోవచ్చు.

ఇష్టమైన వారితో మాట్లాడటం:

ఇష్టమైన వారితో మాట్లాడటం:

మీకు ఇష్టమైన వారితో ఎక్కువ సమయం గడపడం వల్ల సంతోషంగా ఉంటారు. డిప్రెషన్ నుండి బయట పడటానికి ఇది ఒక సింపుల్ ట్రిక్

డాక్టర్ ను కలవడం:

డాక్టర్ ను కలవడం:

మీరు మానసిక స్థితిని ఎదుర్కోవటానికి ఒక మానసిక వైద్యుడును సంప్రదించడం వల్ల వారి సహాయం మీ ఒత్తిడిని తగ్గించడాని బాగా ఉపయోగపడుతుంది. కేవలం మాత్రలు కోసం, ప్రిస్ర్కిప్షన్స్ పొందడానికి కౌన్సిలర్ల వద్దకు వెళితే ప్రయోజనం ఉండదు. ఇది మీరు ప్రస్తుతానికి ఒత్తిడి తగ్గించుకోవడానికి సహాయపడుతుంది అంతే.

English summary

Home Remedies For Depression

The stress in modern life is increasing and this is why the rate of depression is also increasing. There could be many reasons behind depression.Anything that throws one in grief could cause depression; for example, a sudden death of a loved one. In some cases, depression could just be genetic. For some, depression could be a result of some other illness.
Desktop Bottom Promotion