For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అద్భుతం: మెడిసిన్స్ లేకుండా బీపీ కంట్రోల్ చేసే జ్యూస్..!

By Swathi
|

గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారా ? అయితే టెన్షన్ పడకండి. మీకో అమేజింగ్ హెల్త్ డ్రింక్ ఉంది. అది చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఎలాంటి మెడిసిన్స్ అవసరం లేకుండా.. మీ బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేసే.. హెల్త్ డ్రింక్ ఉంది. దాన్ని ఇంట్లోనే చాలా తేలికగా ప్రిపేర్ చేసుకోవచ్చు.

Incredible Juice that Lowers Blood Pressure

ఈ డ్రింక్ తయారు చేయడానికి ఉపయోగించే ప్రతి పదార్థం రక్త ప్రసరణ సజావుగా జరగడానికి, రక్తపోటుని అధిగమించడానికి సహాయపడతాయి. ఈ జ్యూస్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ ని తగ్గించుకోవచ్చని.. లండన్ యూనివర్సిటీ అధ్యయనాలు సూచిస్తున్నాయి. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వాళ్లకు, గుండె ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలని భావించేవాళ్లకు ఈ బీట్ రూట్ జ్యూస్ చక్కటి పరిష్కారమని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే బ్లడ్ ప్రెజర్ ని కూడా ఊహించని స్థాయిలో తగ్గిస్తుందట.

బిపితో చిర్రుబుర్రులాడక ఈ ఆహారాలు తినండి..

Incredible Juice that Lowers Blood Pressure

2 బీట్ రూట్స్, 1 గ్రీన్ యాపిల్, 1 క్యారెట్, అర నిమ్మకాయ, 1 టేబుల్ స్పూన్ అల్లం తురుము తీసుకోవాలి. వీటన్నింటినీ.. బాగా మిక్సీ పట్టి జ్యూస్ తయారు చేసుకోవాలి. వెంటనే తాగితే.. మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ జ్యూస్ ని రెగ్యులర్ గా తీసుకుంటే.. బ్లడ్ ప్రెజర్ వెంటనే కంట్రోల్ అవుతుంది.

హై బ్లడ్ ప్రెజర్ ను మరింత పెంచే 10 వరెస్ట్ ఫుడ్స్

ఈ జ్యూస్ కి ఉపయోగించే బీట్ రూట్, నిమ్మకాయలు, అల్లం శరీరానికి పోషకాలను అందిస్తాయి. అలాగే గ్రీన్ యాపిల్, క్యారట్స్ బ్లడ్ ప్రెజర్ ని నిరోధిస్తాయి. అలాగే హార్ట్ ఎటాక్ రిస్క్ నుంచి కూడా దూరంగా ఉండటానికి ఇవి సహాయపడతాయి. ఈ జ్యూస్ తాగిన మొదట్లో కాస్త తలనొప్పి, తలతిరుగుతున్న ఫీలింగ్ ఉండొచ్చు. కానీ.. అది తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. తర్వాత చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి.. మీకు మంచి ఉపశమనం కలిగిస్తుంది.

English summary

Incredible Juice that Lowers Blood Pressure

Incredible Juice that Lowers Blood Pressure. If you experience heart-related problems and have blood pressure that exceeds the limits, then this is an amazing and healthy alternative to help you lower high blood pressure without using any medications.
Story first published:Friday, January 29, 2016, 14:47 [IST]
Desktop Bottom Promotion