For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కడుపుబ్బరంకు వెంటనే రిలీఫ్ కలిగించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!

|

అశాంతి, పొట్ట నిండుగా ఉండే అనుభూతి మరియు కడుపుబ్బరం, అసౌకర్యం ఇవన్నీ పొట్ట ఉబ్బరానికి సంబంధించిన లక్షణాలు. ఈ లక్షణాల్లో ఏ ఒక్కటీ మనం ఇష్టపడం. పొట్ట సమస్యలంటానే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పొట్ట సమస్యలకు గురికాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. పొట్టసమస్యల్లో తరచూ ఇబ్బంది కలిగించేది కడుపుబ్బరం. కడుపుబ్బరంను ఎలా నివారించుకోవాలి?

స్టొమక్ బ్లోటెడ్ (కడుపుబ్బరం)సమస్యకు నివారించుకోవాడానికి స్నేహితులు, బందువుల నుండి ఎన్నో చిట్కాలను, హోం రెమెడీస్ ను తెలుసుకుని ఉంటారు, అయితే ఎఫెక్టివ్ గా తక్షణ ఉపశమనం కలిగించే హోం రెమెడీస్ ఎంపిక చేసుకోవడం మంచిది.

కడుపుబ్బరం నివారించుకోవడానికి ఉపయోగించే ఈ ఎఫెక్టివ్ హోం రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మెడిసిన్స్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే కడుపుబ్బర సమస్యను నివారించుకోవడానికి, ఇంట్లో ఉండే ఈజీ అండ్ సింపుల్ హోం రెమెడీస్ ను ఫాలో అవ్వడం సేఫ్ .

కడుపుబ్బరంకు వివిధ కారణాలున్నాయి. ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్, సాల్ట్ ఫుడ్స్, ప్రొసెస్డ్ ఫుడ్స్ వంటి అనారోగ్యకరమైన ఆహారాలను తిన్నప్పుడు పొట్టలో ఎక్సెస్ గ్యాస్ ఏర్పడటం వల్ల పొట్ట హెవీగా ఫీలవుతుంది మరియు కడుపుబ్బరంగా అనిపిస్తుంది .

ఇంకా హార్మోనుల్లో మార్పులు, ప్రీమెనుష్ట్రువల్ సిండ్రోమ్, ఆహారాలు క్వాంటిటీ కొద్దిగా ఎక్కువగా తీసుకున్నప్పుడు ఇటువంటి పరిస్థితితుల్లో కూడా కడుపుబ్బరంగా అనిపిస్తుంది. అందువల్ల, ఈ సమస్య నుండి బయటపడాలంటే లైఫ్ స్టైల్ మరియు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల స్టొమక్ బ్లోటింగ్ సమస్యను నివారించుకోవచ్చు.

కడుపుబ్బరంకు ఉపశమనం కలిగించడానికి 15 అమేజింగ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

 అల్లం:

అల్లం:

కడుపుబ్బరంగా ఉన్నప్పుడు చిన్న అల్లం ముక్క తినడం లేదా అల్లం జ్యూస్ , అల్లం టీ తాగడం వల్ల కడుపుబ్బరం నుండి ఉపశమనం పొందుతారు, అల్లం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. దాంతో కడుపుబ్బరానికి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది.

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ:

ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను, ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి, తాగాలి. ఇది పొట్టలో యాసిడ్స్ ను క్రమబద్దం చేస్తుంది. కడుపుబ్బరం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

పసుపు:

పసుపు:

మీరు రెగ్యులర్ తినే ఆహారాల్లో పసుపు చేర్చుకోవాలి. లేదా ఒక టీస్పూన్ పసుపును ఒక గ్లాసు హాట్ వాటర్లో మిక్స్ చేసి, చల్లారిన తర్వాత వడగట్టి తాగాలి. స్టొమక్ బ్లోటింగ్ ను ట్రీట్ చేయడం వల్ల పసుపు గ్రేట్ నేచురల్ రెమెడీ.

చమోమెలీ టీ:

చమోమెలీ టీ:

కొన్ని చామంతి పువ్వులను తీసుకుని, వాటిని నీళ్ళలో వేసి బాగా మరిగించాలి. 5 నిముషాలు ఉడికంచిన తర్వాత వడగట్టి తాగాలి. ఈ టీ తాగడం వల్ల పొట్ట ఉబ్బరం నుండి వెంటనే రీలీఫ్ అవుతుంది.

యూకలిప్టస్ ఆయిల్ :

యూకలిప్టస్ ఆయిల్ :

ఒక గ్లాసు నీటిలో కొన్ని చుక్కుల యూకలిప్టస్ ఆయిల్ మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి రోజుకు ఒక్కసారి తాగడం వల్ల, కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది.

గ్రీన్ టీ :

గ్రీన్ టీ :

గ్రీన్ టీ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్, గ్రీన్ టీ పొట్టను డిటాక్సిఫై చేస్తుంది. కడుపుబ్బరంను నేచురల్ గా తగ్గిస్తుంది.

తమలపాకు:

తమలపాకు:

తమలపాకు తీసుకుని, దీనికి లవంగాలు చేర్చాలి. భోంచేసిన తర్వాత తమలపాకు నమలడం వల్ల త్వరగా జీర్ణమవుతుంది, కుడుపుబ్బర సమస్య ఉండదు. ఇది పొట్టలో గ్యాస్ ఏర్పడకుండా నివారిస్తుంది. దాంతో పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

సోంపు విత్తనాలు:

సోంపు విత్తనాలు:

కొన్ని సోంపు విత్తనాలు తీసుకుని, పొడి చేసి, ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. 5 నిముషాల తర్వాత వడగట్టి తాగాలి. ఇది అజీర్ణం మరియు స్టొమక్ బ్లోటింగ్ ను నివారిస్తుంది.

 పిప్పర్ మెంట్ :

పిప్పర్ మెంట్ :

కడుపుబ్బరానికి మరో బెస్ట్ ట్రీట్మెంట్ పుదీనా. కొన్ని పుదీనా ఆకులను తీసుకుని గ్లాసు నీటిలో వేసి 5 నిముషాలు ఉడికించాలి. చల్లారిన తర్వాత వడగట్టి , భోజనం చేసిన ప్రతి సారి కొద్దిగా తాగుతుండాలి.

బ్లాక్ సాల్ట్ :

బ్లాక్ సాల్ట్ :

కడుపుబ్బరాన్ని తగ్గించడానికి, బ్లాక్ సాల్ట్ ను ఒక టేబుల్ స్పూన్ తీసుకుని, అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం, చిటికెడు ఇంగువ మిక్స్ చేసి బాగా మిక్స్ చేసి రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది .

లవంగం నూనె:

లవంగం నూనె:

ఒక గ్లాసు నీటిలో లవంగం నూనె మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి రోజుకు ఒక్కసారి తాగాలి. ఇది కడుపుబ్బరాన్ని తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

బ్లాక్ పెప్పర్ :

బ్లాక్ పెప్పర్ :

కడుపుబ్బరం తగ్గించుకోవడా మరో సింపుల్ నేచురల్ రెమెడీ బ్లాక్ పెప్పర్. మీరు రోజూ తినేటటువంటి రెగ్యులర్ డైట్, టీలలో బ్లాక్ పెప్పర్ ను జోడించడం వల్ల కడుపుబ్బరానికి నేచురల్ గా ఉపశమనం కలిగిస్తుంది.

దాల్చిన చెక్క :

దాల్చిన చెక్క :

దాల్చిన చెక్క పౌడర్ ను కొద్దిగా తీసుకుని ఒక గ్లాసు వేడినీటిలో మిక్స్ చేయాలి. చల్లారిన తర్వాత రోజుకు రెండు మూడు సార్లు తాగుతుంటే కడుపుబ్బరం నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

పెరుగు:

పెరుగు:

పెరుగు హెల్తీ ప్రొబయోటిక్ ఫుడ్, ఇది పొట్టలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. బ్యాడ్ బ్యాక్టీరియాను తొలగిస్తుంది. దాంతో కడుపుబ్బర సమస్యలు ఉండవు.

 త్రిఫలం:

త్రిఫలం:

కడుపుబ్బరాన్ని తగ్గించే నేచురల్ రెమెడీస్ లో త్రిఫలం ఒకటి. అరటీస్పూన్ త్రిఫల పౌడర్ ను, ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేయాలి. అలాగే తేనె మిక్స్ చేయాలి. నిద్రించడానికి ముందు ఈ త్రిఫల వాటర్ మిక్స్ ను తాగడం వల్ల పొట్ట సమస్యలతో పాటు, కడుపుబ్బరం తగ్గుతంది.

English summary

Is Your Stomach Bloated? Take Up These Home Remedies That Actually Work!

That uneasiness, a feeling of fullness and bloated stomach can make you feel uncomfortable, which is something that all of us hate. But despite being too careful, you tend to develop it. So, how do we get rid of a bloated stomach?
Desktop Bottom Promotion